BRS Party: సీటు కోల్పోయినా బీఆర్ఎస్ ప్రచారంలో దుమ్మురేపుతున్న సిట్టింగ్ ఎమ్మెల్యే..
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రధాన రాజకీయ పార్టీల ప్రచారం జోరందుకుంది. వినూత్న కార్యక్రమాలు వింత వింత చేష్టలతో అభ్యర్థులు జనం దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్య హడావుడి అంతా ఇంతా కాదు. రాజయ్య ప్రచార కార్యక్రమాలు జనంలో తెగ చర్చగా మారింది. ఫుల్ జోష్ తో ఊగిపోతున్న రాజయ్య జనంతో మమేకమవుతూ వినూత్న రీతిలో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. డప్పు దరువేసి తెగ హడావుడి
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రధాన రాజకీయ పార్టీల ప్రచారం జోరందుకుంది. వినూత్న కార్యక్రమాలు వింత వింత చేష్టలతో అభ్యర్థులు జనం దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్య హడావుడి అంతా ఇంతా కాదు. రాజయ్య ప్రచార కార్యక్రమాలు జనంలో తెగ చర్చగా మారింది. ఫుల్ జోష్ తో ఊగిపోతున్న రాజయ్య జనంతో మమేకమవుతూ వినూత్న రీతిలో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. డప్పు దరువేసి తెగ హడావుడి చేస్తున్న రాజయ్య మహిళలతో కలిసి కోలాటాలు చేస్తూ వాహ్ అని కార్యకర్తల చేత కేక పెట్టిస్తున్నారు. ఇంటింటి ప్రచారంలో బీఆర్ఎస్‌కు ఓటేయండి అని జనానికి విజ్ఞప్తి చేస్తూ వినూత్న రీతిలో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్న రాజయ్య సంథింగ్ స్పెషల్ గా నిలుస్తున్నారు. సాధారణంగా సిట్టింగ్ ఎమ్మెల్యేకు సీటు కేటాయించక పోతే ఎవరైనా అలిగి కూర్చుంటారు. ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉండడం కామన్. కానీ అందుకు పూర్తి భిన్నంగా రాజయ్య వ్యవహార శైలి కనిపిస్తుంది. రెట్టింపు ఉత్సాహంతో రాజయ్య తన ప్రచార కార్యక్రమాలలో పాల్గొనడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. రాజయ్య వెరైటీ కార్యక్రమాలతో జనంలో చర్చగా మారుతున్నారు. నలుగురు డప్పు కళాకారులు కనిపిస్తే చాలు పరుగున అక్కడికి వెళ్లి డప్పు గుంజుకుని దరువేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి