కోనాయిపల్లి ఆలయంలో నామినేషన్ పేపర్లు ఉంచి సీఎం కేసీఆర్ పూజలు

కోనాయిపల్లి ఆలయంలో నామినేషన్ పేపర్లు ఉంచి సీఎం కేసీఆర్ పూజలు

Ram Naramaneni

|

Updated on: Nov 04, 2023 | 2:41 PM

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శనివారం నంగనూరులోని కోనాయిపల్లిలో గల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామివారి సన్నిధిలో నామినేషన్‌ పత్రాలను ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. మంత్రి హరీశ్‌రావు, ఇతర బీఆర్‌ఎస్‌ నేతలతో కలిసి ఆయన ఆలయానికి చేరుకున్నారు. సీఎంకు అర్చకులు సాదర స్వాగతం పలికారు.

సిద్దిపేట జిల్లా కోనాయిపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేశారు సీఎం కేసీఆర్‌. నామినేషన్ పత్రాలను స్వామివారి సన్నిధిలో ఉంచి పూజలు చేశారు. అనంతరం ఆలయార్చకులు సీఎం కేసీఆర్‌కు వేదాశీర్వచనం అందించారు. అక్కడే నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. ఈనెల 9న గజ్వేల్‌తో పాటు కామారెడ్డిలో నామినేషన్ వేయనున్నారు సీఎం కేసీఆర్‌.

దశాబ్దాలుగా సీఎం కేసీఆర్‌కు కోనాయిపల్లి వేంకటేశ్వర ఆలయం సెంటిమెంట్‌. ఏ శుభకార్యం చేసినా ఇక్కడ పూజలు చేసిన అనంతరమే పనులను ప్రారంభిస్తారు. ప్రతి ఎన్నికల ముందు నామినేషన్‌ పత్రాలను వేంకటేశ్వరస్వామి చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించడం 1985వ సంవత్సరం నుంచి ఆనవాయితీగా వస్తోంది. 1989, 1994, 1999, 2001, 2004, 2009 ఎన్నికల నామినేషన్‌ పత్రాలకు పూజలు నిర్వహించి, ఆ తర్వాత నామినేషన్‌ వేసి విజయం సాధించారు. ఇప్పుడు కూడా అదే సెంటిమెంట్‌ను ఫాలో అయ్యారు కేసీఆర్‌.

సీఎం కేసీఆర్‌ వెంట ఉన్నారు మంత్రి హరీశ్‌రావు. ఆయనకు కూడా ఈ ఆలయం సెంటిమెంట్‌. 2004  బై ఎలక్షన్‌లో స్టేట్ మినిస్టర్‌గా ఉన్న హరీశ్‌రావు మొదటిసారి కోనాయిపల్లి టెంపుల్‌లో తన నామినేషన్‌ పత్రాలకు పూజలు చేయించి సంతకాలు చేశారు. అనంతరం నామినేషన్‌ వేసి ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. అప్పటి నుంచి హరీశ్‌రావుకు సెంటిమెంట్‌ గుడిగా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

 

Published on: Nov 04, 2023 02:33 PM