Bad Cooking Oils: ఈ వంట నూనెలు మీరు కూడా వినియోగిస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త..
దాదాపు ప్రతి వంట తయారీలో నూనె ఉపయోగిస్తుంటాం. నూనె వంటలకు రుచితోపాటు మంచి సువాసన కూడా అందిస్తాయి. శరీరంలో మంచి కొవ్వుల ఉత్పత్తికి కూడా నూనె చాలా అవసరం. నూనెలు మన శరీరానికి అవసరమైన ముఖ్యమైన సూక్ష్మపోషకాలను అందిస్తాయి. ప్రతి నూనె దాని స్వంత లక్షణాలను కలిగి ఉంటుంది. అయితే మనం రోజూ వాడే ఈ నూనెల్లో ట్రాన్స్ ఫ్యాట్స్, శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఈ రెండు కొవ్వులు శరీరానికి ఎంతో హానికరం. ఎందుకంటే ఈ రెండు కొవ్వులు..
దాదాపు ప్రతి వంట తయారీలో నూనె ఉపయోగిస్తుంటాం. నూనె వంటలకు రుచితోపాటు మంచి సువాసన కూడా అందిస్తాయి. శరీరంలో మంచి కొవ్వుల ఉత్పత్తికి కూడా నూనె చాలా అవసరం. నూనెలు మన శరీరానికి అవసరమైన ముఖ్యమైన సూక్ష్మపోషకాలను అందిస్తాయి. ప్రతి నూనె దాని స్వంత లక్షణాలను కలిగి ఉంటుంది. అయితే మనం రోజూ వాడే ఈ నూనెల్లో ట్రాన్స్ ఫ్యాట్స్, శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఈ రెండు కొవ్వులు శరీరానికి ఎంతో హానికరం. ఎందుకంటే ఈ రెండు కొవ్వులు శరీరంలో పేరుకుపోతే ఊబకాయం, గుండె జబ్బులతో సహా అనేక సమస్యలు తలెత్తుతాయి. మన పూర్వికులు వంటకు ఆవాల నూనె, కొబ్బరి నూనె, ఆముదం నూనెను ఉపయోగించేవారు. ప్రస్తుతం మార్కెట్లో వివిధ రకాల నూనెలు అందుబాటులో ఉన్నాయి.
కొన్ని నూనెలు ఆరోగ్యకరమని వాణిజ్య ప్రకటన్లో ఊకదంపుడు ప్రసంగాలు ఇస్తుంటారు. ఈ నూనెలన్నీ తింటే శరీరంలో కొవ్వు పేరుకుపోదని అంటుంటారు. కానీ ఏ నూనె ఆరోగ్యానికి మంచిదో.. ఏది హానికరమో తెల్చుకోలేక వినియోగదారులు తికమకపడిపోతుంటారు. అంటే అన్ని నూనెలు ఆరోగ్యానికి మంచివి కావు. కానీ ఇలాంటి రకరకాల నూనెల వినియోగం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. పోషకాహార నిపుణులు కొన్ని రకాల నూనెలకు దూరంగా ఉండాలని సిఫార్సు చేస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం..
పామాయిల్
పామాయిల్‌లో సంతృప్త కొవ్వు ఎక్కువగా ఉంటుంది. ఇది LDL కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. సంతృప్త కొవ్వు అధికంగా ఉండటం వల్ల ఈ నూనె గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. ఈ నూనె మార్కెట్లో చౌకగా దొరుకుతుంది. అందువల్ల వివిధ ఆహార దుకాణాల్లో విస్తృతంగా ఉపయోగిస్తుంటారు. అందుకే బయటి ఆహారానికి దూరంగా ఉండాలని వైద్యులు చెబుతుంటారు.
కొబ్బరి నూనె
కొబ్బరి నూనెలో సంతృప్త కొవ్వు అధికంగా ఉంటుంది. ఇది మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ (MCTలు) కలిగి ఉంటుంది. వీటివల్ల కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ కానీ LDL కొలెస్ట్రాల్‌ను పెంచడంలో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.
మొక్కజొన్న నూనె
ఈ రోజుల్లో చాలా మంది మొక్కజొన్న నూనెను తినడానికి ప్రాధాన్యత ఇస్తుంటారు. ఈ నూనెలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. దీనిని ఎక్కువగా తీసుకుంటే శరీరంలో ఇన్‌ఫ్లమేటరీ సమస్యలు వస్తాయి. ఇది దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది
సోయాబీన్ నూనె
సోయాబీన్ నూనె కూడా మొక్కజొన్న వంటిదే. ఇందులో ఒమేగా-6 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఏది ఎక్కువైతే శరీరంలో అనేక ఇన్‌ఫ్లమేటరీ సమస్యలకు కారణం అవుతుంది. ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ శరీరానికి చాలా అవసరం. ఈ నూనె మంచిదే అయినప్పటికీ, ఎక్కువగా తినకూడదు.
సన్‌ఫ్లవర్ ఆయిల్
సన్‌ఫ్లవర్ ఆయిల్‌లో ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అయితే ఇందులో సంతృప్త కొవ్వు తక్కువగా ఉంటుంది. ఒమేగా -6 అధిక వినియోగం అంత మంచిదికాదు.
మరైతే ఏ నూనెలు ఆరోగ్యానికి మంచిది..?
ఆలివ్ ఆయిల్, ఫ్లాక్స్ సీడ్ ఆయిల్, అవకాడో ఆయిల్, బాదం నూనె, నువ్వుల నూనె వంటివి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అయితే ఏ నూనె అయినా పరిమితంగా మాత్రమే వినియోగించాలి. లేదంటే ప్రమాదం పొంచిఉంటుంది.
మరిన్ని తాజా ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.