AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: చెరువు క్లీన్ చేస్తోన్న వాలెంటీర్లు.. అందులో కనిపించిన సూట్‌కేసు.. తెరిచి చూడగా దెబ్బకు షాక్..!

అమెరికాలో హాలోవీన్ సందడి నెలకొంది. ఈ క్రమంలో కొందరు వాలంటీర్లు హాలోవీన్ రోజున సరస్సును శుభ్రం చేసే కార్యక్రమం చేపట్టారు. శుభ్రం చేస్తుండగా.. ఒక సూట్ కేస్ కంటపడింది.. దాన్ని తెరిచి చూడగా దుర్వాసన వచ్చింది. ఏంటోనని పరిశీలించగా.. మృతదేహం బయటపడింది.. ఎవరో చంపి మృతదేహాన్ని సూట్‌కేసులో పార్శిల్ చేసి.. సరస్సులో పడేసినట్లు పోలీసులు తెలిపారు.

Viral: చెరువు క్లీన్ చేస్తోన్న వాలెంటీర్లు.. అందులో కనిపించిన సూట్‌కేసు.. తెరిచి చూడగా దెబ్బకు షాక్..!
Lake (representative image)
Shaik Madar Saheb
|

Updated on: Nov 04, 2023 | 5:58 PM

Share

అమెరికాలో హాలోవీన్ సందడి నెలకొంది. ఈ క్రమంలో కొందరు వాలంటీర్లు హాలోవీన్ రోజున సరస్సును శుభ్రం చేసే కార్యక్రమం చేపట్టారు. శుభ్రం చేస్తుండగా.. ఒక సూట్ కేస్ కంటపడింది.. దాన్ని తెరిచి చూడగా దుర్వాసన వచ్చింది. ఏంటోనని పరిశీలించగా.. మృతదేహం బయటపడింది.. ఎవరో చంపి మృతదేహాన్ని సూట్‌కేసులో పార్శిల్ చేసి.. సరస్సులో పడేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన అమెరికాలోని కాలిఫోర్నియాలో చోటుచేసుకుంది. హాలోవీన్ రోజున కాలిఫోర్నియాలోని ఓక్‌లాండ్‌లోని ఒక సరస్సును శుభ్రపరిచే సమయంలో సూట్‌కేస్‌లో హత్యకు గురైన వ్యక్తి మృతదేహం కనుగొన్నట్లు కాలిఫోర్నియా పోలీసులు తెలిపారు. న్యూయార్క్ పోస్ట్ ప్రకారం.. వాలంటీర్లు మంగళవారం ఉదయం లేక్ మెరిట్‌ను శుభ్రం చేస్తుండగా, దాని అంచున తేలియాడుతున్న సూట్‌కేస్‌ను గుర్తించారు. ఆ తర్వాత వలను ఉపయోగించి.. బయటకు తీశారు. చివరకు సూట్‌కేస్‌లో మృతదేహం కనిపించడంతో షాక్‌కు గురయ్యారు.

ఆ వ్యక్తి తన 30 ఏళ్ల వయస్సులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సూట్‌కేస్‌ను తెరిచి చూడగానే ముందు దుర్వాసన వచ్చిందని.. కుళ్లిపోయిన స్థితిలో ఉన్నట్లు వాలంటీర్లు తెలిపారు. సూట్‌కేస్‌ను కనుగొన్న లేక్ మెరిట్ ఇన్‌స్టిట్యూట్‌లోని వాలంటీర్లలో కెవిన్ షోమో మాట్లాడుతూ.. సూట్ కేసులో ఉన్న మృతదేహాన్ని చూసి ఆశ్చర్యపోయానని.. ఇలాంటి ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. ముందుగా నెట్ స్తంభాలను ఉపయోగించి దానిని తమ వైపుకు లాగామని.. పట్టుకుంటే చాలా బరువుగా ఉందని మేము గ్రహించామని.. తెరచి చూడగానే మృతదేహం బయటపడ్డట్లు తెలిపారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించినట్లు ఓక్లాండ్ పోలీసు కెప్టెన్ అలాన్ యు తెలిపారు. ఎవరు హత్య చేశారు.. మృతదేహాన్ని ఎక్కడ నుంచి తీసుకువచ్చారు.. ఇలా సాధ్యమయ్యే అన్ని విషయాలను పరిగణలోకి తీసుకుని పరిశీలిస్తున్నామని తెలిపారు.

కాగా.. ఈ ఘటన కలకలం రేపింది. తరచూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటుండటం ఆందోళన కలిగిస్తోందని స్థానికులు తెలిపారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
ఈ చెక్క సాగుతో కోట్లల్లో లాభం.. కాసుల వర్షం కురిపించే వ్యాపారం
ఈ చెక్క సాగుతో కోట్లల్లో లాభం.. కాసుల వర్షం కురిపించే వ్యాపారం
మీ గోళ్లలోనే మీ ఊపిరితిత్తుల ఆరోగ్య రహస్యం.. ఈ లక్షణాలు..
మీ గోళ్లలోనే మీ ఊపిరితిత్తుల ఆరోగ్య రహస్యం.. ఈ లక్షణాలు..