ఎన్నికల టైమ్‌లో అక్రమ మద్యాన్ని పట్టిస్తున్న యాప్ ఇదే…పోలీసుల పని ఈజీ
ఎన్నికలు ఉన్నందున ఓటర్లకు పంపిణి చేయడానికి ఎవరైనా పెద్ద మొత్తంలో మద్యం నిల్వలు చేస్తే తమకు సమాచారం ఇవ్వాలన్నారు పోలీసులు. వినియోగదారులకు నకిలీ మద్యం విక్రయించే అవకాశాలు కూడా ఉన్నాయని, ప్రతి మద్యం షాపులో అమ్మేది నిజమైనదా? నకిలీదా? అని తెలుసుకునేందుకు 'వేరిట్ యాప్” ద్వారా తెలుసుకోవచ్చన్నారు.

ఎన్నికల సమయంలో ఓటర్లను మభ్య పెట్టేందుకు డబ్బు, మద్యాన్ని ఎరగా వాడుతున్నారు కొందరు అభ్యర్థులు. దీంతో ఎన్నికలు కోడ్ అమలైనప్పటినుంచి పోలీసులు నాకబంది నిర్వహించి ఇప్పటివరకు కోట్ల రూపాయల డబ్బుతో పాటు కోట్ల విలువైన పద్యాన్ని కూడా సీజ్ చేశారు. అక్రమంగా తరలించే.. ఇతర రాష్ట్రాలకు చెందిన మద్యాన్ని ఈజీగా గుర్తించేందుకు తెలంగాణ పోలీసులు ఒక యాప్‌ని వాడుతున్నారు. దీంతో వారి పని ఈజీ అయ్యింది. మద్యం బాటిల్‌ని స్కాన్ చేస్తే ఎప్పుడు.. ఎక్కడ తయారయ్యింది.. ఎక్కడికి రవాణా చేయబడింది.. సదరు మద్యం షాపులో దాన్ని విక్రయించేందుకు అనుమతి ఉందా..? లేదా ఇలా పూర్తి వివరాలు తెలుస్తాయి. గూగుల్ ప్లే స్టోర్‌లో ఆ యాప్ అందుబాటులో ఉంటుంది. అయితే ఈ యాప్ పోలిసుల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చింది కాదు. సాధారణ ప్రజలు సైతం కొనే మద్యం బాటిల్ పూర్తి సమాచారం కోసం ఈ యాప్ ఉపయోగపడుతుంది. నకిలీ మద్యాన్ని ఈ వేరిట్ యాప్ ద్వారా గుర్తించవచ్చు.
ఎన్నికలు ఉన్నందున ఓటర్లకు పంపిణి చేయడానికి ఎవరైనా పెద్ద మొత్తంలో మద్యం నిల్వలు చేస్తే తమకు సమాచారం ఇవ్వాలన్నారు పోలీసులు. వినియోగదారులకు నకిలీ మద్యం విక్రయించే అవకాశాలు కూడా ఉన్నాయని, ప్రతి మద్యం షాపులో అమ్మేది నిజమైనదా? నకిలీదా? అని తెలుసుకునేందుకు ‘వేరిట్ యాప్” ద్వారా తెలుసుకోవచ్చన్నారు. గూగుల్ ప్లే స్టోర్ ద్వారా ఈ వేరిట్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని బాటిల్‌పై ఉన్న గుర్తును స్కాన్ చేస్తే ఆ మద్యం సీసా ఎక్కడ తయారైంది… ఏ షాపులో అమ్మబడుతున్నది అన్ని వివరాలు వస్తాయని తెలిపారు. దాన్ని బట్టి నకిలీదా? నిజమైనదా తెలుసుకోవచ్చన్నారు.
ఇప్పటికీ ఈ యాప్ ద్వారా వందల కోట్ల విలువైన అక్రమ మద్యాన్ని సీజ్ చేశారు పోలీసులు. పోలీసులే కాదు ఇకనుంచి మీరు కూడా మద్యం కూడా ఒరిజినలా.. లేదా కల్తీ మద్యామా అనేది ఈజీగా తెలుసుకోవచ్చు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…
