ముంబైని ముంచెత్తిన వర్షాలు.. 11 విమానాలు రద్దు
దేశ ఆర్థిక రాజధాని ముంబైని భారీ వర్షాలు మరోసారి ముంచెత్తాయి. నగరంతో పాటు మహారాష్ట్రలోని పలు జిల్లాల్లో శుక్రవారం భారీ వర్షపాతం నమోదైంది. గడిచిన 24 గంటల్లో 150 నుంచి 180మి.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ ప్రకటించింది. దీంతో నగరంలోని వీధులన్నీ జలమయమయ్యాయి. శుక్రవారం 17 విమానాలను దారి మళ్లించగా.. మరో 11 విమానాలు రద్దుచేసినట్లు ముంబై ఎయిర్‌పోర్టు అధికారులు ప్రకటించారు. పలు విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. కుర్లా-థానే ప్రాంతంలో భారీ వర్షలు కురుస్తుండటంతో.. ముందు […]

దేశ ఆర్థిక రాజధాని ముంబైని భారీ వర్షాలు మరోసారి ముంచెత్తాయి. నగరంతో పాటు మహారాష్ట్రలోని పలు జిల్లాల్లో శుక్రవారం భారీ వర్షపాతం నమోదైంది. గడిచిన 24 గంటల్లో 150 నుంచి 180మి.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ ప్రకటించింది. దీంతో నగరంలోని వీధులన్నీ జలమయమయ్యాయి. శుక్రవారం 17 విమానాలను దారి మళ్లించగా.. మరో 11 విమానాలు రద్దుచేసినట్లు ముంబై ఎయిర్‌పోర్టు అధికారులు ప్రకటించారు. పలు విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. కుర్లా-థానే ప్రాంతంలో భారీ వర్షలు కురుస్తుండటంతో.. ముందు జాగ్రత్తగా ఆ మార్గంలో నడిచే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు సెంట్రల్ రైల్వే వెల్లడించింది.
రాయ్‌గఢ్, రత్నగిరి, సింధూదుర్గ్ జిల్లాల్లో ముందు జాగ్రత్త చర్యగా వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్‌ని ప్రకటించింది. ముంబయి, థానే, నవీ ముంబయి ప్రాంతాల్లో మరో 24గంటల పాటు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. ముందస్తు హెచ్చరికలతో అప్రమత్తమైన ప్రభుత్వం.. అవసరమున్నచోట రెస్క్యూ టీమ్స్‌ను రంగంలోకి దింపుతున్నాయి. చాలా ప్రాంతాల్లో రోడ్లపై నీరు పొంగి ప్రవహించడంతో.. భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది.
