పశ్చిమబెంగాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..13 మంది మృతి.. ఘటనకు సంబంధించి కారణాలు..

Accident in west Bengal: పశ్చిమ బెంగాల్‌లో ఘోర ప్రమాదం జరిగింది. బండరాళ్ల లోడ్‌తో వెళ్తున్న ట్రక్కు ఓ కారుతో పాటు ఆటోపై బోల్తా పడింది.

పశ్చిమబెంగాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..13 మంది మృతి.. ఘటనకు సంబంధించి  కారణాలు..
Follow us
uppula Raju

|

Updated on: Jan 20, 2021 | 8:25 AM

Accident in west Bengal: పశ్చిమ బెంగాల్‌లో ఘోర ప్రమాదం జరిగింది. బండరాళ్ల లోడ్‌తో వెళ్తున్న ట్రక్కు ఓ కారుతో పాటు ఆటోపై బోల్తా పడింది. దీంతో 13 మంది అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ విషాదకరణ ఘటన జల్పాయిగుడి జిల్లా ధుప్‌గుడి వద్ద బుధవారం తెల్లవారు జామున జరిగింది. ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందగా మరికొందరు గాయపడ్డారు.

ఈ ఘటనలో మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో కొందరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. క్షతగాత్రులను జల్పాయిగుడిలోని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఓవర్‌లోడ్‌, పొగమంచు కారణంగా ట్రక్కు అదుపు తప్పి పక్కనే వెళ్తున్న వాహనాలపై బోల్తాపడి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. బండరాళ్లు వాహనాలపై పడడంతో భారీగా దెబ్బతిన్నాయి. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. పోలసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి.. పలువురికి తీవ్రగాయాలు. ఎనిమిది కార్లు ధ్వంసం(