అవమానవీయం.. నడిరోడ్డుపై అత్యాచార బాధితురాలు..
సమాజంలో ఆడవాళ్లకు రక్షణ లేకుండా పోతోంది. ఎక్కడో ఓ చోట ప్రతిరోజు మహిళలు వేధింపులకు గురవుతూనే ఉన్నారు. చిన్నపిల్లల నుంచి పండు ముసలివాళ్ల వరకు ఎవరిని కూడా వదిలిపెట్టడం లేదు. దాడులు చేయడం, వేధింపులకు గురిచేయడం, అఘాయిత్యాలు, అత్యాచారాలకు పాల్పడటం ఇలా అన్నింట్లో మృగాళ్లు రెచ్చిపోతున్న పరిస్థితి నెలకొంది. ఎటువంటి కఠిన చట్టాలు తీసుకొచ్చిన కూడా మహిళలపై నేరాలూ తగ్గకపోవడం ఆందోళనకరంగా మారింది.
సమాజంలో ఆడవాళ్లకు రక్షణ లేకుండా పోతోంది. ఎక్కడో ఓ చోట ప్రతిరోజు మహిళలు వేధింపులకు గురవుతూనే ఉన్నారు. చిన్నపిల్లల నుంచి పండు ముసలివాళ్ల వరకు ఎవరిని కూడా వదిలిపెట్టడం లేదు. దాడులు చేయడం, వేధింపులకు గురిచేయడం, అఘాయిత్యాలు, అత్యాచారాలకు పాల్పడటం ఇలా అన్నింట్లో మృగాళ్లు రెచ్చిపోతున్న పరిస్థితి నెలకొంది. ఎటువంటి కఠిన చట్టాలు తీసుకొచ్చిన కూడా మహిళలపై నేరాలూ తగ్గకపోవడం ఆందోళనకరంగా మారింది. ఇప్పటికీ కూడా కొంతమంది దుర్మార్గుల ప్రవర్తనలో ఎటువంటి మార్పులు రావడం లేదు. అయితే తాజాగా మధ్యప్రదేశ్‌లోని జరిగిన ఓ ఘటన సభ్య సమాజం తలదించుకునేలా చేసింది. మైనర్ బాలికను(12) కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత పాశవికంగా అత్యాచారని ఒడిగట్టారు. ఆ బాధితురాలు ఒంటిపై గాయాలతోనే.. ప్రతి ఇంటికి వెళ్తూ సాయం కోసం అర్తించింగి. అయితే ఈ దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
అర్థ నగ్నంగా, రక్తస్రావంతో ఆ బాలిక బాధపడుతూ కనిపిస్తుండటం తీవ్ర ఆందోళన రేపుతోంది. అయితే ఈ దారుణ ఘటన ఉజ్జయిని సమీపంలోని బాద్‌నగర్ రహదారిపై జరిగింది. ఆ బాలిక ఇలా సాయం అర్తించిన దృశ్యాలు రోడ్డుపై సమీపంలో ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అందిరిని ఆశ్చర్యానికి గురిచేస్తోన్న ఈ వీడియోలో 12 ఏళ్ల ఆ బాలిక ఒంటిపై ఓ క్లాత్‌తో వీధుల్లో తిరుగుతూ కనిపిస్తుంది. కానీ రోడ్డు మీద ఉన్న ప్రజలు ఆమెను అలా చూస్తూనే ఉన్నారే తప్ప.. ఆమెకు ఎలాంటి సాయం చేయడానికి మాత్రం ముందుకు రాలేదు. సాయం కోసం ఆ బాలిక ఓ వ్యక్తిని సంప్రదించింది. అతడు బాలికను వెళ్లిపోమ్మంటూ నెట్టేశాడు. ఇది వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇదిలా ఉండగా.. చివరికి ఆ బాధితురాలు ఓ ఆశ్రమానికి వెళ్లింది. అక్కడ ఓ పూజారి ఆమెను చూశారు. ఆమెపై టవల్ కప్పి జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ జరిపిన పరీక్షల్లో ఆ బాలికపై అత్యాచారం జరిగినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఆమె ఒంటిపై తీవ్రమైన గాయాలు ఉండటం వల్ల మెరుగైన చికిత్స కోసం ఇండోర్‌కు తరలించారు. అయితే ప్రస్తుతం చిన్నారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. సమాచారం మేరకు రంగంలోకి దిగిన పోలీసులు దీనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకొని విచారణను మొదలుపెట్టారు. నిందితులను వీలైనంత త్వరగా గుర్తించి కఠినంగా శిక్షిస్తామని ఉజ్జయిని పోలీస్ చీఫ్ సచిన్ శర్మ పేర్కొన్నారు. ఆ బాలికపై ఎక్కడ అత్యాచారం జరిగిందో ఇంకా తెలియలేదని.. అయితే దీనిపై విచారణ జరిపి త్వరలోనే వివరాలను బయటపెడతామని పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఆ బాలిక వివరాలు కూడా ఇంకా తెలియలేదని అయితే ఆమె మాటలను బట్టి చూస్తే ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కి చెందినట్లు భావిస్తున్నారు. ఈ దారుణమైన అఘాయిత్యం మహిళలపై జరుగుతున్న ఘోరాలను మరోసారి వెలుగులోకి తీసుకొచ్చింది.
On Camera, 12-Year-Old Girl, Raped And Bleeding, Asks For Help, Shooed Away@Anurag_Dwary reports
Read here: https://t.co/gYx8RKulRb pic.twitter.com/0hiyE5SYUA
— NDTV (@ndtv) September 27, 2023