PM Modi: యూపీఏ ప్రభుత్వం గుజరాత్‌లో ఎన్నో అడ్డంకులు సృష్టించింది.. ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు..

Vibrant Gujarat Summit 2023: గుజరాత్ పరువు తీసేందుకు కుట్ర పన్నారని.. అయితే 20 ఏళ్ల తర్వాత ప్రపంచం గుజరాత్ విజయాన్ని చూస్తోందంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బుధవారం అహ్మదాబాద్‌లో జరుగుతోన్న వైబ్రంట్ గుజరాత్‌ గ్లోబల్‌ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ కీల వ్యాఖ్యలు చేశారు.

PM Modi: యూపీఏ ప్రభుత్వం గుజరాత్‌లో ఎన్నో అడ్డంకులు సృష్టించింది.. ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు..
PM Modi
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Sep 27, 2023 | 1:54 PM

Vibrant Gujarat Summit 2023: గుజరాత్ పరువు తీసేందుకు కుట్ర పన్నారని.. అయితే 20 ఏళ్ల తర్వాత ప్రపంచం గుజరాత్ విజయాన్ని చూస్తోందంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బుధవారం అహ్మదాబాద్‌లో జరుగుతోన్న వైబ్రంట్ గుజరాత్‌ గ్లోబల్‌ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ కీల వ్యాఖ్యలు చేశారు. యూపిఏ హయాంలో కేంద్రం నుంచి గుజరాత్‌కు ఎలాంటి సాయమూ అందలేదన్నారు. గుజరాత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ పెట్టుబడిదారులు భయపడేవారని మోదీ గుర్తు చేశారు. గుజరాత్‌లో తాను బాధ్యతలు తీసుకున్న సమయంలో పరిస్థితులు సరిగా లేవని, గట్టి సంకల్పంతో అన్ని ఇబ్బందులనూ అధిగమించానని చెప్పారు మోదీ. గుజరాత్‌ను చూసే మిగతా రాష్ట్రాలూ గ్లోబల్‌ బిజినెస్‌ సదస్సులు ప్రారంభించాయని గుర్తుచేశారు. 2047 నాటికి భారత్‌ను అన్ని రంగాల్లోనూ అగ్రభాగాన నిలిపేలా ప్రణాళికలు రూపొందించాలని మోదీ సూచించారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా మోదీ 5,200 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు.

వైబ్రంట్ గుజరాత్‌ గ్లోబల్‌ సదస్సులో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. గుజరాత్ నుంచి వ్యాపారులు వలస వెళతారని చెబుతున్నారు.. గుజరాత్ పరువు తీసేందుకు కుట్ర పన్నారంటూ విరుచుకుపడ్డారు. తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అప్పటి యూపీఏ ప్రభుత్వం నుంచి ఎలాంటి మద్దతు లభించలేదన్నారు. అభివృద్ధిలో అడ్డంకులు సృష్టించారని.. అయినప్పటికీ రాష్ట్రంలోకి పెట్టుబడులు వస్తూనే ఉన్నాయన్నారు. ఇక్కడ ఒకప్పుడు కొంచెమే అభివృద్ధి కనిపించేదని.. 20 ఏళ్ల క్రితం తాను నాటిన విత్తనం.. నేడు పెద్దదిగా మారి మర్రి చెట్టుగా విస్తరించిందన్నారు. వైబ్రెంట్ గుజరాత్ కేవలం బ్రాండింగ్ ఈవెంట్ కాదని.. ఇది ఒక కుటుంబ ఈవెంట్ అని పేర్కొన్నారు.

వైబ్రెంట్ గుజరాత్‌కు మొదట్లో చాలా తక్కువ మంది వచ్చేవారని అన్నారు. అయితే ఇవాళ పెద్ద సంఖ్యలో ప్రతినిధులు వస్తున్నారని వివరించారు. వైబ్రంట్ గుజరాత్ టైమ్ ఈవెంట్‌గా కాకుండా ఒక సంస్థగా మారిందని మోడీ పేర్కొన్నారు. కాలం మారింది, కానీ ఒక్కటి మాత్రం మారలేదు. ప్రతిసారీ వైబ్రంట్ గుజరాత్ విజయాలను సొంతంచేసుకుని.. ప్రపంచానికి చిహ్నంగా మారిందంటూ ఉదహరించారు.

గత రెండు దశాబ్దాల్లో వివిధ రంగాల్లో కొత్త పుంతలు తొక్కామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆటోమొబైల్, ఆగ్రో ఫుడ్, నిర్మాణ రంగాల్లో గుజరాత్ ప్రముఖ పాత్ర పోషిస్తోంది. భారత్ నుంచి వజ్రాల ఎగుమతుల్లో గుజరాత్ వాటా 80 శాతం ఉందంటూ గుర్తుచేశారు.

ప్రపంచంలోని మూడు అగ్రగామి ఆర్థిక వ్యవస్థగా భారత్‌

వైబ్రంట్ గుజరాత్‌ను ప్రారంభించామని, తద్వారా గుజరాత్ దేశానికి గ్రోత్ ఇంజన్‌గా మారుతుందన్నారు ప్రధాని మోడీ.. 2014లో దేశానికి సేవ చేసే అవకాశం వచ్చినప్పుడు, భారతదేశాన్ని ప్రపంచ వృద్ధి ఇంజిన్‌గా మార్చడమే లక్ష్యంగా బాధ్యతలు చేపట్టానని పేర్కొన్నారు. నేడు ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్‌ ఉందన్నారు. భారతదేశం ప్రపంచ ఆర్థిక శక్తిగా మారబోతోంది. మరికొన్నాళ్లలో ప్రపంచంలోని మూడు అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థల్లో భారత్‌ ఒకటి అవుతుందని.. మోదీ పేర్కొన్నారు. దారుణమైన పరిస్థితుల నుంచి గుజరాత్‌ ఎక్కడికో ఎదిగిందని.. జీవితంలో ఇంతకంటే గొప్ప సంతృప్తి ఏముంటుందంటూ మోడీ పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..