AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Polluted Cities: మళ్లీ ఢిల్లీనే టాప్.. తొలి 15 స్థానాల్లో 10 భారత్ వే.. నివేదికలో విస్తుపోయే విషయాలు

దేశంలో కాలుష్యం (pollution) రోజు రోజుకు కోరలు చాస్తోంది. గతంతో పోలిస్తే వాయువుల్లో నాణ్యత మరింత తగ్గిందని వరల్డ్ ఎయిర్‌ క్యాలిటీ నివేదిక-2021 వెల్లడించింది. ప్రపంచంలో వాయు కాలుష్యం అధికంగా ఉన్న 100 నగరాల్లో భారత్‌ (India) లోనే..

Polluted Cities: మళ్లీ ఢిల్లీనే టాప్.. తొలి 15 స్థానాల్లో 10 భారత్ వే.. నివేదికలో విస్తుపోయే విషయాలు
Delhi Pollution
Ganesh Mudavath
|

Updated on: Mar 23, 2022 | 7:06 AM

Share

దేశంలో కాలుష్యం (pollution) రోజు రోజుకు కోరలు చాస్తోంది. గతంతో పోలిస్తే వాయువుల్లో నాణ్యత మరింత తగ్గిందని వరల్డ్ ఎయిర్‌ క్యాలిటీ నివేదిక-2021 వెల్లడించింది. ప్రపంచంలో వాయు కాలుష్యం అధికంగా ఉన్న 100 నగరాల్లో భారత్‌ (India) లోనే 63 ఉన్నట్లు పేర్కొంది. దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తర భారతంలో కాలుష్య స్థాయిలు ప్రమాదకరస్థాయికి చేరుకుంటున్నాయి. వరుసగా నాలుగో ఏడాది ప్రపంచంలోనే అత్యంత కాలుష్యమైన రాజధానిగా దిల్లీ (Delhi) ప్రథమ స్థానంలో ఉంది. ఇక గాలి నాణ్యత ప్రమాదకరంగా ఉన్న తొలి 50 నగరాల్లో 35 భారత్‌లోనే ఉండటం గమనార్హం. 2021లో భారత్‌లోని ఒక్క నగరం కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన గాలి నాణ్యత ప్రమాణాలను చేరుకోలేకపోయిందని నివేదిక తెలిపింది. అత్యంత కాలుష్య రాజధానుల జాబితాలో ఢిల్లీ మొదటి స్థానంలో ఉండగా ఢాకా రెండో స్థానంలో నిలిచింది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల జాబితాలో రాజస్థాన్‌ భీవాడి ప్రథమ స్థానంలో ఉండగా ఉత్తరప్రదేశ్‌లోని గజియాబాద్‌ రెండు, దిల్లీ నాలుగో స్థానంలో ఉన్నాయి. ఈ జాబితాలో తొలి 15 నగరాల్లో 10 భారత్‌లోనివే కావడం గమనార్హం.

ఢిల్లీని ”గ్యాస్ చాంబర్”గా అభివర్ణిస్తున్నారు. కానీ, ఈ పరిస్థితి కేవలం ఢిల్లీకి మాత్రమే పరిమితమై లేదు. ప్రపంచంలోని అత్యంత కలుషితమైన ఆరు నగరాలు- గురుగ్రామ్, ఘాజియాబాద్, ఫరీదాబాద్, భివాడి, నోయిడాలు ఢిల్లీకి 80 కిలోమీటర్ల పరిధిలో ఉన్నాయి. ఇవి ప్రస్తుతం గాలి నాణ్యత విషయంలో ప్రపంచంలో అత్యంత కలుషితమైనవిగా ఉన్నాయి. వాయు కాలుష్యం కారణంగా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 70 లక్షల మంది అకాల మరణం పొందుతున్నారని డబ్ల్యూహెచ్‌వో అంచనా వేసింది. ప్రస్తుతం దిల్లీని కప్పేసిన ఒక రకమైన పొగమంచు వల్ల గుండెపోటు, డయాబెటిస్, ఊపిరితిత్తుల క్యాన్సర్, దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. నేపాల్, బంగ్లాదేశ్ కూడా ప్రమాదానికి గురవుతున్నాయి.

Also Read

KTR US Tour: తెలంగాణకు క్యూ కడుతున్న అంతర్జాతీయ కంపెనీలు.. పెట్టుబడులే లక్ష్యంగా సాగుతున్న కేటీఆర్ అమెరికా పర్యటన

Yogurt Side Effects: మామిడి పండుతో పెరుగన్నం తింటున్నారా? ఐతే ఈ విషయాలు తెలుసుకోండి..

Axis Bank: ఎఫ్డీలపై వడ్డీ రేట్ల పెంపు.. కీలక నిర్ణయం తీసుకున్న మరో బ్యాంక్.. ఎంత పెరిగాయంటే..