AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కల్తీకాటు.. నకిలీ మద్యం తాగి 10 మంది మృతి.. 50 మందికిపైగా ఆస్పత్రిలో చికిత్స

కళ్లకురిచ్చి జిల్లా కొత్త కలెక్టర్‌గా ఎంఎస్‌ ప్రశాంత్‌ను ప్రభుత్వం నియమించింది. అలాగే కళ్లకురిచ్చి ఎస్పీ సమయసింగ్ మీనాపై సస్పెన్షన్ వేటు పడింది. ఎస్పీగా రజత్ చతుర్వేది నియమితులయ్యారు. అలాగే, ఈ ఘటనలో పలువురు పోలీసు అధికారులను సైతం ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. ఇదిలా ఉంటే, అదే గ్రామానికి చెందిన 10 మందికి పైగా మృతి చెందడం ఈ ప్రాంత ప్రజల్లో విషాదాన్ని నింపింది.

కల్తీకాటు.. నకిలీ మద్యం తాగి 10 మంది మృతి.. 50 మందికిపైగా ఆస్పత్రిలో చికిత్స
Illicit Liquor
Jyothi Gadda
|

Updated on: Jun 19, 2024 | 9:43 PM

Share

తమిళనాడులో దారుణ ఘటన చోటు చేసుకుంది. కల్తీ మద్యం తాగిన పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. నకిలీ మద్యం తాగిన వారిలో 10మంది మృత్యువాతపడ్డారు. సుమారు 50 మందికి పైగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టుగా తెలిసింది. వీరిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. కల్తీ మద్యం తాగిన వారందరూ విపరీతమైన తలనొప్పి, వాంతులు, స్పృహతప్పి పడిపోవడంతో వారిని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చేర్పించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

తమిళనాడులో కల్తీ మద్యానికి పది మంది ప్రాణాలు కోల్పోయారు.. కళ్లకురిచి జిల్లాలో కల్తీ మద్యం తాగడంతో పదిమంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు అస్వస్థతకు గురయ్యారు. బాధితులను హుటాహుటినా ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందజేస్తున్నారు. వారిలో కొందరినీ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. కల్తీ సారా విక్రయాలపై గ్రామస్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కల్తీ మద్యం విక్రేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఈ ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ తీవ్రంగా పరిగణించారు. ఈ వ్యవహారంపై సీబీ-సీఐడీ విచారణకు స్టాలిన్‌ ఆదేశించారు. అదే సమయంలో కలెక్టర్‌ శ్రావణ్‌కుమార్‌ జతావత్‌పై బదిలీ వేటు వేశారు. కళ్లకురిచ్చి జిల్లా కొత్త కలెక్టర్‌గా ఎంఎస్‌ ప్రశాంత్‌ను ప్రభుత్వం నియమించింది. అలాగే కళ్లకురిచ్చి ఎస్పీ సమయసింగ్ మీనాపై సస్పెన్షన్ వేటు పడింది. ఎస్పీగా రజత్ చతుర్వేది నియమితులయ్యారు. అలాగే, ఈ ఘటనలో పలువురు పోలీసు అధికారులను సైతం ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. ఇదిలా ఉంటే, అదే గ్రామానికి చెందిన 10 మందికి పైగా మృతి చెందడం ఈ ప్రాంత ప్రజల్లో విషాదాన్ని నింపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి…

Follow Us
బతికున్న వ్యక్తిని చనిపోయినట్లు నమోదు.. పింఛన్ నిలిపివేత... ఆయన
బతికున్న వ్యక్తిని చనిపోయినట్లు నమోదు.. పింఛన్ నిలిపివేత... ఆయన
బ్యాగ్‌లో ఏదో కదిలింది.. లోపల ఉన్నది చూసి గుండె ఆగినంత పనైంది!
బ్యాగ్‌లో ఏదో కదిలింది.. లోపల ఉన్నది చూసి గుండె ఆగినంత పనైంది!
ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇంటర్నల్ స్లైడింగ్ షెడ్యూల్ విడుదల..
ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇంటర్నల్ స్లైడింగ్ షెడ్యూల్ విడుదల..
3 ఏళ్లు డిప్రెషన్‏లో హీరోయిన్.. జీవిత పాఠాలు చెప్పిన యమున..
3 ఏళ్లు డిప్రెషన్‏లో హీరోయిన్.. జీవిత పాఠాలు చెప్పిన యమున..
శుక్ర చంద్రుల యుతి.. ఈ రాశులవారికి ఇక మంచి రోజులు!
శుక్ర చంద్రుల యుతి.. ఈ రాశులవారికి ఇక మంచి రోజులు!
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం అలర్ట్.. అలా చేయకపోతే డబ్బులు కట్..
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం అలర్ట్.. అలా చేయకపోతే డబ్బులు కట్..
ఇన్‌స్టా రీల్స్‌లో తిలక్ వర్మ యాక్టింగ్ అదుర్స్
ఇన్‌స్టా రీల్స్‌లో తిలక్ వర్మ యాక్టింగ్ అదుర్స్
వెళ్లింది ఆరుగురు.. తిరిగొచ్చింది మాత్రం ఐదుగురే..
వెళ్లింది ఆరుగురు.. తిరిగొచ్చింది మాత్రం ఐదుగురే..
నా పిల్లల కోసం మళ్లీ కత్తి పడతా..హంతకుడిని అవుతానన్న నారాయణ
నా పిల్లల కోసం మళ్లీ కత్తి పడతా..హంతకుడిని అవుతానన్న నారాయణ
పసికందు మృతదేహం మాయంపై కీలక విషయం చెప్పిన పోలీసులు
పసికందు మృతదేహం మాయంపై కీలక విషయం చెప్పిన పోలీసులు