Yoga: ఆరోగ్య ప్రయోజనాలు ఆశించేవారికి.. అనువైన ఆసనాలు.. ఎంత తిన్నా ఇట్టే అరిగిపోతుంది..

ఏం తిన్నా అరగడం లేదు. కడుపు ఉబ్బరంగా ఉంటుందనే సమస్య చాలామందిలో చూస్తాం. వ్యక్తిలోని జీర్ణవ్యవస్థ పనితీరుపై ఇది ఆధారపడి ఉంటుంది. కొంతమంది ఎలాంటి ఆహారం తీసుకున్నా ఇట్టే..

Yoga: ఆరోగ్య ప్రయోజనాలు ఆశించేవారికి.. అనువైన ఆసనాలు.. ఎంత తిన్నా ఇట్టే అరిగిపోతుంది..
Vajrasana
Follow us
Amarnadh Daneti

|

Updated on: Dec 06, 2022 | 9:13 AM

ఏం తిన్నా అరగడం లేదు. కడుపు ఉబ్బరంగా ఉంటుందనే సమస్య చాలామందిలో చూస్తాం. వ్యక్తిలోని జీర్ణవ్యవస్థ పనితీరుపై ఇది ఆధారపడి ఉంటుంది. కొంతమంది ఎలాంటి ఆహారం తీసుకున్నా ఇట్టే అరిగిపోతుంది. మరికొంతమంది లైట్ ఫుడ్ తీసుకున్నా అరుగుదల సమస్యతో బాధపడుతూ ఉంటారు. తిన్నది జీర్ణం కావడానికి భోజనం చేసిన తర్వాత కొన్ని ఆసనాలు వేస్తే.. సమస్య ఇట్టే పరిష్కారమవుతుందని నిపుణులు సూచిస్తున్నారు. సాధారణంగా తిన్న వెంటనే శరీరాన్ని శ్రమ పెట్టే పనులు చేయకూడదు.. తిన్న వెంటనే ఆసనాలు వేయకూడదని చాలా మంది చెప్తారు. కాని తిన్న తర్వాత కొన్ని రకాల ఆసనాలు వేస్తే.. జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేసి.. తిన్నది వెంటనే అరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఎక్కువుగా తినడం, సరైన డైట్ ను పాటించకపోవడం వల్ల అరుగుదల సమస్య వస్తుంది. యాసిడ్ రిఫ్లక్స్, గ్యాస్, ఉబ్బరం, అజీర్ణం వంటి లక్షణాలు ఇబ్బంది పెడతాయి. ఇవి వికారం, నిద్రలేమికి కూడా కారణమవుతాయి. చివరకి బరువు పెరగడానికి దారితీయవచ్చు. భోజనం చేసిన తర్వాత కొన్ని యోగా ఆసనాలు చేస్తే.. మెరుగైన జీర్ణక్రియ, ప్రశాంతమైన నిద్ర, బరువు తగ్గడం వంటి ప్రయోజనాలు పొందవచ్చు అంటున్నారు యోగా నిపుణులు.

వజ్రాసనం

మధ్యాహ్నం, రాత్రి భోజనం లేదా ఏదైనా తిన్న తర్వాత వజ్రాసనం చేయడం ద్వారా తిన్నది త్వరగా జీర్ణమవుతుంది. అలాగే మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది. కడుపు ఉబ్బరం వంటి సమస్యలను దూరం చేస్తుంది. ఈఆసనం చేయడం ద్వారా ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది.

ఇవి కూడా చదవండి

సుప్త బద్ధ కోణాసనం

ఈ ఆసనం ద్వారా శరీరం లోపలి తొడలు, మోకాళ్లను సాగదీస్తుంది. పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థను పెంచడం ద్వారా జీర్ణక్రియను సక్రియం చేస్తుంది. ఇది అలసట, నిద్రలేమి నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది.

ఊర్ధ్వ ప్రసారిత పద్మాసనం

ఈ ఆసనం చేయడం ద్వారా కడుపు సంబంధిత సమస్యలను నయం చేయడంతో పాటు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అలాగే ఈఆసనం కండరాలను బలపరుస్తుంది. వెన్నెముకను సాగదీసి శక్తినిస్తుంది. కాలేయం, మూత్రపిండాలను ప్రేరేపిస్తుంది. అవయవాల పనితీరును క్రమబద్దీకరిస్తుంది.

మార్జాలాసనం

ఈ ఆసనం తుంటి, వీపు, పొత్తికడుపులోని కండరాలను సాగదీస్తుంది. అంతేకాక ఇది జీర్ణశయాంతర ప్రేగులతో సహా అవయవాలను ప్రేరేపిస్తుంది. ఫలితంగా జీర్ణవ్యవస్థ సమర్థవంతంగా పని చేస్తుంది.

తడాసానం

తిన్న తర్వాత చేయడానికి ఇది ఉత్తమమైన ఆసనం. కడుపు నిండా తిన్నా సరే దీనిని నిర్భయంగా చేయవచ్చు. ఇది జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. జీవక్రియను పెంచుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం చూడండి..