Momos Side Effects: మీకు ఇష్టమైన మోమోస్ ను ఎక్కువగా లాగించేస్తున్నారా.. ఈ వ్యాధులబారిన పడవచ్చు అని హెచ్చరిస్తోన్న ఆరోగ్య నిపుణులు

ఈ మోమోస్ వెజ్ మోమోస్, పనీర్ మోమోస్, మష్రూమ్ మోమోస్, చికెన్ మోమోస్ ఇలా చాలా వెరైటీలే ఉన్నాయి.  వీటిని టమాటో, లేదా మిర్చిలతో చేసిన స్పైసీ, సాసీ డిప్‌తో వడ్డిస్తారు. అయితేస్ట్రీట్ ఫుడ్  మోమోస్ అధికంగా తినడం ఆరోగ్యానికి ప్రమాదకరమని..  శరీరానికి దీర్ఘకాలిక నష్టం కలిగిస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

Momos Side Effects: మీకు ఇష్టమైన మోమోస్ ను ఎక్కువగా లాగించేస్తున్నారా.. ఈ వ్యాధులబారిన పడవచ్చు అని హెచ్చరిస్తోన్న ఆరోగ్య నిపుణులు
Momos Side Effects
Follow us

|

Updated on: Dec 06, 2022 | 9:41 AM

టిబెటన్ ఆథంటిక్ వంటకం మోమోస్.. మన దేశంలో అడుగు పెట్టాయి. అతి తక్కువ సమయంలోనే ఆదరణ సొంతం చేసుకున్నాయి. దీంతో ఇప్పడు    హోటల్స్ తో పాటు స్ట్రీట్ ఫుడ్ గా మోమోస్ సందడి చేస్తున్నాయి. నేపాల్ తో పాటు మన దేశంలోని లడక్, సిక్కిం ప్రాంతంలోనూ మోమోస్ కనిపిస్తుంటాయి.  వేయించిన, ఆవిరి మీద ఉడికించిన, కూర లేదా తందూరీ ఇలా మోమోస్‌ను ఏ విధంగా తిన్నా రుచిగా ఉంటాయి. నేడు అత్యంత ప్రజాదరణ పొందిన స్ట్రీట్ ఫుడ్ ప్రతి చోటా అందుబాటులో ఉన్నాయి. చికెన్, చేపలు,  మాంసం లేదా కూరగాయలతో నింపబడి, అవి అనేక రుచులు, వెరైటీలలో లభిస్తాయి. ఈ మోమోస్ వెజ్ మోమోస్, పనీర్ మోమోస్, మష్రూమ్ మోమోస్, చికెన్ మోమోస్ ఇలా చాలా వెరైటీలే ఉన్నాయి.  వీటిని టమాటో, లేదా మిర్చిలతో చేసిన స్పైసీ, సాసీ డిప్‌తో వడ్డిస్తారు. అయితే స్ట్రీట్ ఫుడ్  మోమోస్ అధికంగా తినడం ఆరోగ్యానికి ప్రమాదకరమని..  శరీరానికి దీర్ఘకాలిక నష్టం కలిగిస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మోమోస్ తినడం వల్ల కలిగే నష్టాలు: 

ఆరోగ్యం, పరిశుభ్రత గురించి పెద్దగా పట్టించుకోకుండా రోడ్‌సైడ్ తినుబండారాలను తయారు చేస్తారు. స్ట్రీట్ ఫుడ్ మోమోస్ నుంచి ఎందుకు దూరంగా ఉండాలి అనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఇవి కూడా చదవండి

ఆకర్షణీయంగా కనిపించడం కోసం పదే పదే శుద్ధి చేసిన పిండి ఆరోగ్యానికి హానికరం.. ఇలాంటి పిండిని అనేక వంటలలో విస్తృతంగా ఉపయోగిస్తారు. US డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ ప్రకారం.. శుద్ధి చేసిన పిండితో మూడు ప్రధాన సమస్యలు ఉన్నాయి.

శుద్ధి చేసిన పిండి వలన బ్లడ్ షుగర్, జీవక్రియ లోపించడం వంటి అనేక వ్యాధుల బారిన పడవచ్చు. అంతేకాదు శుద్ధి చేసిన పిండిలో పోషకాలు ఉండవు. ఆరోగ్యానికి హానికరంగా మారే అవకాశం ఉంది. ఈ పిండితో చేసిన పదార్ధాలను తినే ఆహారంలో చేర్చుకోవడంలో వలన  ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది.

ఈ నేపథ్యంలో ఈ పిండితో మోమోస్ ను తయారు చేస్తారు. దీంతో ఫైబర్, పోషకాలు లోపిస్తాయి. తిన్నప్పుడు రక్తంలో చక్కర స్థాయిలో మార్పులు చోటు చేసుకుంటాయి. ఇది కాలక్రమేణా మధుమేహం, హృదయ సంబంధ వ్యాధుల వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతుంది.

పిండిని శుద్ధి చేసే ప్రక్రియలో, డైటరీ ఫైబర్, విటమిన్లు B , E, ఇనుము, మెగ్నీషియం సహా ఇతర ముఖ్యమైన పోషకాలు గణనీయంగా కోల్పోతుంది. కనుక ఈ పిండితో చేసిన మోమోస్ తినడం వలన బరువు పెరుగుట , ఊబకాయం , రక్తపోటు, క్యాన్సర్‌ కారకాలుగా మారతాయి.

మోమోస్ లో స్టఫింగ్ చేసే మాసం, కూరగాయలు కూడా ప్రాణాంతక ఇన్ఫెక్షన్లలకు కారణమవుతాయి.

చాలా మోమోలను రోడ్‌సైడ్ కేఫ్‌ల్లో తింటారు. ఈ మోమోస్ లో ఉపయోగించే ఫిల్లింగ్‌లకు ఉపయోగించే కూరగాయలు లేదా.. మాసం శుభ్రంగా కడిగి ఉపయోగించరు. మోమోస్ లో ఫీల్ చేస్తున్న మాసం గడువు ముగిసినది లేదా పాడైపోయింది వినియోగిస్తున్నట్లు అనేక నివేదికల ప్రకారం తెలుస్తోంది. దీంతో మోమోస్ లో E.coli బ్యాక్టీరియా వైరస్‌ చేరుకుంటుందని.. ఈ మోమోస్ ను తినడం వలన ఈ వైరస్‌ ప్రభావంతో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, పొత్తికడుపు ఇన్ఫెక్షన్, గ్యాస్ట్రోఎంటెరిటిస్, వాంతులు,తిమ్మిరి వంటి అనేక ఇన్ఫెక్షన్‌లకు కారణమయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

క్యాబేజీ , క్యారెట్ వంటి కూరగాయలు కూడా కడగకపోతే ఫ్లూ, విరేచనాలు మొదలైన వాటికి కారణమవుతాయి. క్యాబేజీని సరిగ్గా ఉడికించకపోతే టేప్‌వార్మ్  బీజాంశం మెదడుకు చేరి ..  పెరిగి ప్రాణాపాయ స్థితికి కారణమవుతుంది.

ప్రమాదకరంగా మారుతున్న స్పైసీ డిఫ్స్  మోమోస్‌తో పాటు స్పైసీ డిప్స్ ను వినియోగిస్తారు. ఈ డిప్స్ గా వినియోగించే రెడ్ చట్నీని కాల్చిన మిరియాలు, మిరపకాయలు, టమోటాలతో తయారు చేస్తారు. అయితే వీటిని చాలా వరకు రోడ్‌సైడ్ దొరికే కల్తీ వస్తువులను ఉపయోగించి తయారు చేస్తున్నారు. దీంతో ఈ స్పైసీ డిప్స్ ను తినడం వలన  హెమోరాయిడ్స్ లేదా పైల్స్‌కు కారణమవుతున్నాయి.

మోమోస్ ప్యాకింగ్ చాలా మంది ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మోమోస్‌ను ప్యాకింగ్ చేస్తున్న కవర్స్ లో మోనో-సోడియం గ్లుటామేట్ లేదా MSG ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వేడివేడి మోమోస్ ను ఈ ప్యాక్ లో వేయడం వలన అవి తింటే.. ఊబకాయానికి దారితీయడమే కాకుండా నాడీ రుగ్మతలు , చెమటలు పట్టడం, ఛాతీ నొప్పి ,వికారం , దడ వంటి ఇతర ఆరోగ్య సమస్యలకు కారణం అవుతున్నాయి. కనుక మోమోస్ ను ఇష్టంగా తినేవారు.. అవి తినే ప్లేస్ ను తయారు చేస్తున్న పరిసరాలను దృష్టిలో పెట్టుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Note: ఈ వ్యాసంలో పేర్కొన్న చిట్కాలు , సూచనలు సాధారణ పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఇవ్వబడింది. వీటిని వృత్తిపరమైన వైద్య సలహాగా భావించకూడదు. మీ ఆహారంలో ఏవైనా మార్పులు చేసే ముందు ఎల్లప్పుడూ మీ వైద్యుడిని లేదా డైటీషియన్‌ని సంప్రదించండి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..