Banana vs Milk: అరటిపండు, పాలు కలిపి తీసుకుంటున్నారా? ఎంత డేంజరో తెలుసా?
పాలలో కాల్షియం, ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, B విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే అరటిపండులో ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం సమృద్ధిగా ఉంటాయి. అయితే ఈ రెండింటిని కలిపి తీసుకుంటే మాత్రం జీర్ణవ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుందట.
బాడీబిల్డర్లైనా, హాస్టళ్లలోని పిల్లలైనా, స్కూల్‌కి పరిగెత్తే పిల్లలైనా, అందరూ మిల్క్ షేక్‌లు ఇష్టపడి తాగుతుంటారు. అందులోనూ బనానా మిల్క్ షేక్ అయితే మరీనూ. ఇక బరువు పెరగాలనుకునే వారు ఎక్కువగా అరటి పండు, పాలును కలిపి తీసుకుంటుంటారు. అయితే ఇలా అరటిపండ్లు, పాలు తీసుకోవడం ఆరోగ్యానికి అంతమంచిది కాదంటున్నారు ఆయుర్వేదం నిపుణులు. పాలలో కాల్షియం, ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, B విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే అరటిపండులో ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం సమృద్ధిగా ఉంటాయి. అయితే ఈ రెండింటిని కలిపి తీసుకుంటే మాత్రం జీర్ణవ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుందట. పాలు తాగిన తర్వాత అరటిపండు తినాలనుకుంటే, సైడ్ ఎఫెక్ట్స్ నివారించడానికి ఈ రెండింటి మధ్య కనీసం 20 నిమిషాలు గ్యాప్ ఇవ్వడం మేలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ఇక అలెర్జీలు లేదా ఉబ్బసం ఉన్నవారు పాలు, అరటిపండును కలిపి తినడం మంచిది కాదు. ఎందుకంటే ఇవి కఫం, శ్వాసకోశ రుగ్మతలను కలిగిస్తాయి.
ప్రాచీన భారతీయ వైద్యశాస్త్రంలో పాలు అరటిపండ్లకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఆయుర్వేదంలో ప్రతి ఆహారం రుచి, జీర్ణక్రియ తర్వాత ప్రభావంతో పాటు వేడి, శీతలీకరణ శక్తులను కలిగి ఉంటుంది. కాబట్టి అరటి పండు, పాలును కలిపి తీసుకుంటే కొందరిలో గ్యాస్ట్రిక్ సమస్య కూడా వస్తుంది. అలాగే కడుపులో గ్యాస్ ఏర్పడటం, సైనస్ సమస్య, జలుబు, దగ్గు, శరీరంపై దద్దుర్లు, వాంతులు, విరేచనాలు తదితర సమస్యలు కలుగుతాయి. ఇక ఆయుర్వేదంలో, ఈ రెండు ఆహారాలు శరీరంలో విషాన్ని కలిగిస్తాయని నమ్ముతారు. ఇవి శరీర పనితీరుకు ఆటంకం కలిగిస్తాయి. ముఖ్యంగా మెదడు పనితీరును నెమ్మదిస్తుంది.
ఎలా తినాలంటే? పోషకాహార నిపుణులు, డైటీషియన్ల సూచనల ప్రకారంపాలు, అరటిపండును విడివిడిగా తీసుకోవడం ఉత్తమం. వ్యాయామానికి ముందు లేదా తర్వాతైనా, స్నాక్ అయినప్పటికీ, రెండింటి మధ్య 20 నిమిషాల గ్యాప్ ఉంచడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.
నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని లైప్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..