AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gyan Mudra: మానసిక ఒత్తిడికి లోనవుతున్నారా.. రోజూ 5 నిమిషాలు ఈ ముద్రను చేయండి..

ప్రస్తుతం ఎక్కువగా శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకోసం యోగ, వ్యాయామం, తినే విషయంలో కేరింగ్ ఇలా చాలా చేస్తున్నారు. అయితే ఎంత చదువుకున్న వారైనా సరే మానసిక ఆరోగ్యంపై పెద్దగా శ్రద్ధ చూపరు. దీని వల్ల ఆందోళన, డిప్రెషన్ వంటి అనేక సమస్యలు పెరుగుతున్నాయి. ఇలాంటి వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుంది. రోజంతా ఏదో ఒక సమస్య లేదా పని ఒత్తిడి .. అలసట కారణంగా చాలా మంది చిరాకుగా ఉంటారు. తీవ్ర  ఒత్తిడికి గురవుతారు.

Gyan Mudra: మానసిక ఒత్తిడికి లోనవుతున్నారా.. రోజూ 5 నిమిషాలు ఈ ముద్రను చేయండి..
Gyan MudraImage Credit source: pexels
Surya Kala
|

Updated on: Mar 11, 2024 | 12:49 PM

Share

నేటి మానవుని జీవన శైలి ఉరుకులు పరుగులతో సాగుతోంది. ఆధునిక జీవనశైలితో మానవులకు అనేక సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి. అయితే కొంతమంది తమకు ఎదురయ్యే సమస్యను ఎదుర్కొంటూ.. పరిష్కారాన్ని సులభంగా కనుగొంటారు. మరి కొందరు వ్యక్తులు చిన్న చిన్న విషయం గురించి లేదా చిన్న సమస్య ఏర్పడినా దాని గురించి నిరంతరం ఆలోచిస్తూ ఉంటారు. టెన్షన్ తీసుకుంటూ తెగ బాధపడిపోతారు .  చాలా ఒత్తిడికి లోనవుతారు. అయితే ప్రస్తుతం ఎక్కువగా శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకోసం యోగ, వ్యాయామం, తినే విషయంలో కేరింగ్ ఇలా చాలా చేస్తున్నారు. అయితే ఎంత చదువుకున్న వారైనా సరే మానసిక ఆరోగ్యంపై పెద్దగా శ్రద్ధ చూపరు. దీని వల్ల ఆందోళన, డిప్రెషన్ వంటి అనేక సమస్యలు పెరుగుతున్నాయి. ఇలాంటి వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుంది .

రోజంతా ఏదో ఒక సమస్య లేదా పని ఒత్తిడి .. అలసట కారణంగా చాలా మంది చిరాకుగా ఉంటారు. తీవ్ర  ఒత్తిడికి గురవుతారు. అటువంటి పరిస్థితిలో మనస్సును ప్రశాంతంగా, రిలాక్స్‌గా ఉంచుకోవాలి. ఇందుకు యోగాలో ఒక భంగిమ మంచి సహాయ కారి. ప్రముఖ యోగా నిపుణులు సుగంధ గోయల్‌ ఇదే విషయంపై మాట్లాడుతూ.. ఒత్తిడి, చిరాకును తగ్గించడంలో ధ్యాన ముద్ర  సహాయపడుతుందని చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ధ్యాన ముద్ర గురించి తెలుసుకుందాం

ధ్యాన ముద్ర

ధ్యానం లేదా ప్రాణాయామంలో దృష్టిని కేంద్రీకరించడానికి ఉపయోగించే చేతి సంజ్ఞ. ఇది మనస్సుకు శాంతిని ఇవ్వడంతో పాటు అనేక భౌతిక ప్రయోజనాలను అందించడంలో ప్రయోజనకరంగా ఉంటుందని నమ్ముతారు.

ఇవి కూడా చదవండి

ఎలా చేయాలంటే

ఈ ముద్ర చేయడానికి సరైన మార్గం ధ్యాన భంగిమలో కూర్చోవడం.  నడుము..  మెడ నిటారుగా ఉంచండి.  మణికట్టును మోకాళ్లపై ఉంచండి. ఇప్పుడు రెండు చేతుల చూపుడు వేళ్ల చివరలను వంచి బొటనవేలుతో కలపండి. ఇక్కడ  మిగిలిన మూడు వేళ్లను నేరుగా ఉంచండి. వాటిని ఒకదానితో ఒకటి కలపండి. ఇప్పుడు సౌకర్యవంతమైన భంగిమలో కళ్ళు మూసుకుని ధ్యాన స్థితిలో కూర్చోండి.

ధ్యాన ముద్ర వలన కలిగే ప్రయోజనాలు

  1. ఈ ముద్ర మెదడులోని నరాలను బలపరుస్తుంది.  జ్ఞాపకశక్తి ని పెంచుతుంది. ఓర్పు, ఏకాగ్రత, మానసిక బలాన్ని పెంచుతుంది. మేధస్సును అభివృద్ధి చేస్తుంది. తలనొప్పి , నిద్రలేమి సమస్య నివారణలో కూడా ఈ ధ్యాన ముద్ర ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది.
  2. ఇది మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది.  కోపం చిరాకు ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. ధ్యాన ముద్ర అనేది ప్రాణాయామ సమయంలో చేసే భంగిమ.
  3. ధ్యాన ముద్ర మనస్సుకు విశ్రాంతిని అందిస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. అటువంటి పరిస్థితిలో ఇది తలనొప్పి, పార్శ్వపు నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది.
  4. ప్రతిరోజూ 5 నుండి 10 నిమిషాల పాటు ఈ భంగిమను ఉపయోగించి ధ్యానం చేస్తే ఒత్తిడి నుంచి ఉపశమనం పొందవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..