జంక్‌ఫుడ్ తింటున్నారా.. అయితే మీ గుండె డేంజర్‌లో ఉన్నట్లే..! ఇది తెలిస్తే షాక్ అవుతారు..
World Heart Day: ఒకప్పుడు 40 ఏళ్ల తర్వాత ప్రజలు తమ గుండె గురించి ఆలోచించేవారు కానీ ప్రస్తుతం కాలం మారిపోయింది. 20 ఏళ్ల యువకుడికే గుండెపోటు వస్తుంది.
World Heart Day: ఒకప్పుడు 40 ఏళ్ల తర్వాత ప్రజలు తమ గుండె గురించి ఆలోచించేవారు కానీ ప్రస్తుతం కాలం మారిపోయింది. 20 ఏళ్ల యువకుడికే గుండెపోటు వస్తుంది. ఈ విషయంలో మనం పాశ్చాత్త దేశాలను కూడా దాటిపోయామని నిపుణలు చెబుతున్నారు. దీనికి ప్రధాన కారణాలలో జంక్ ఫుడ్ ఒకటి. గుండె ఆరోగ్యంపై ఇది చాలా చెడు ప్రభావాన్ని చూపుతుంది. సాధారణంగా ధమనులలో కొవ్వు పేరుకుపోతే గుండె జబ్బులు వస్తాయి. జంక్‌ఫుడ్ వల్ల ఇది చిన్న వయస్సు నుంచే ప్రారంభమవుతుంది. అలాంటి వ్యక్తులు యుక్తవయస్సు రాగానే గుండెపోటుకు గురవుతున్నారు.
1. ప్యాక్ చేసిన ఫుడ్ ప్యాక్ చేసిన ఫుడ్ వల్ల గుండె జబ్బులు ఎక్కువగా వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ ఆహారాలలో కొవ్వు, ఉప్పు, చక్కెర అధికంగా ఉంటున్నాయి. ఇవి వివిధ వ్యాధులను కలిగిస్తున్నాయి. వీటివల్ల శరీరంలో విపరీతంగా కొవ్వు పేరుకుపోతుంది.
2. ఉప్పు, చక్కెర భారతదేశంలో కనీసం 14.4 లక్షల మంది పిల్లలు ఊబకాయంతో బాధపడుతున్నారు. కొవ్వు, ఉప్పు, చక్కెర అధికంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల స్థూలకాయం పెరుగుతుంది. దీనివల్ల మధుమేహం, గుండె సంబంధ వ్యాధులు వస్తున్నాయి.
3. చిన్న వయస్సులో కచ్చితమైన చర్యలు తీసుకోకపోతే 2045 నాటికి స్థూలకాయం, మధుమేహం విషయంలో భారతదేశం ప్రపంచంలో మొదటి స్థానానికి చేరుకుంటుంది. పాశ్చాత్య దేశాల కంటే భారతదేశంలో చిన్న వయసులో గుండె జబ్బుల ప్రమాదం మరింత ఎక్కువైంది.
4. అవగాహన చిన్న వయస్సులోనే పిల్లలకు ఆహార ఉత్పత్తులపై అవగాహన కల్పించాలి. అల్ట్రా ప్రాసెస్ చేసిన ఉత్పత్తుల జోలికి పోకూడదు. సహజసిద్దమైన ఆహారాలను డైట్‌లో చేర్చాలి.