Health Tips: మీ చెవులను కాటన్ బడ్స్‌తో శుభ్రపరుస్తున్నారా.? అయితే మీకో షాకింగ్ న్యూస్.!

Ear Buds Harmful: ఈ మధ్యకాలంలో చెవిని శుభ్రపరిచేందుకు చాలామంది ఇయర్ బడ్స్ లేదా కాటన్ బడ్స్‌ను ఉపయోగిస్తుంటారు. అలాగే మరికొందరు తమ చిటికెన..

Health Tips: మీ చెవులను కాటన్ బడ్స్‌తో శుభ్రపరుస్తున్నారా.? అయితే మీకో షాకింగ్ న్యూస్.!
Cotton Buds
Follow us

|

Updated on: Sep 29, 2021 | 6:35 PM

ఈ మధ్యకాలంలో చెవిని శుభ్రపరిచేందుకు చాలామంది ఇయర్ బడ్స్ లేదా కాటన్ బడ్స్‌ను ఉపయోగిస్తుంటారు. అలాగే మరికొందరు తమ చిటికెన వేలును చెవి లోపలికి దూర్చి గులిమిని తీయాలని ప్రయత్నిస్తారు. అసలు ఇలా చేయడం మంచి పద్దతేనా.? డాక్టర్లు ఏమంటున్నారు.? అనే విషయాలు తెలుసుకుందాం..

చెవులను శుభ్రపరిచేందుకు లేదా చెవిలో గులిమి తీసేందుకు చిటికెన వేలు, కాటన్ బడ్స్ ఉపయోగించడం మంచి పద్దతి కాదని వైద్య నిపుణులు అంటున్నారు. వాటి వల్ల అనేక సమస్యలు వస్తాయని చెబుతున్నారు. సాధారణంగా చెవిలో గులిమిని తీసుకునేందుకు మనం కాటన్ బడ్స్ ఉపయోగిస్తాం. అయితే వాటిని ఉపయోగించడం వల్ల చెవుల్లో గులిమి ఇంకా లోపలికి వెళ్తుంది. కాటన్ బడ్స్ వాడటం వల్ల మీకు చెవుల్లో దురద నుంచి కాస్త ఉపశమనం పొందినా.. గులిమి శుభ్రపడదు.

కొన్నిసార్లు కాటన్ బడ్స్ వాడటం వల్ల చెవి బయట నుంచి వచ్చే బ్యాక్టీరియా కూడా గులిమిపైకి చేరి మీ చెవులకు హని కలిగించే ప్రమాదం ఉంటుంది. అలాగే కాటన్ బడ్స్ ద్వారా చెవిలో గులిమి తీసుకునేటప్పుడు చెవిపైన చర్మం మండుతుంది. తద్వారా దురద పుడుతుంది. ఇక అక్కడ మనం మళ్లీ గోక్కోవడం చేస్తే తిరిగి బ్యాక్టీరియా ఆ ప్రాంతంలో చేరుతుంది. మళ్లీ చెవిలో నొప్పి మొదలవుతుంది. అలాగే కాటన్ బడ్స్‌ను గట్టిగా చెవిలో దూర్చడం వల్ల కర్ణభేరి దెబ్బ తినే అవకాశం కూడా ఉంది.

ఒకవేళ కర్ణభేరి దెబ్బ తింటే నొప్పి రావడం, లేదా చెవులు సరిగ్గా వినిపించకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. అందుకే కాటన్ బడ్స్‌కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని డాక్టర్స్ చెబుతున్నారు. కాగా, స్నానం చేస్తున్న సమయంలో చెవులను శుభ్రపరుచుకుంటే ఇన్ఫెక్షన్ మొదలైన వాటి నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చునని సూచిస్తున్నారు.

Also Read:

ఈ 9 లక్షణాలు ఉన్నట్లయితే.. గుండెపోటుకు సంకేతమే.! వెంటనే అలెర్ట్ అవ్వండి..

చేపల కోసం ఎర వేసి చూడగా ఊహించని షాక్.. వీడియో చూస్తే గుండె గుభేల్.!

‘ఎనర్జీ డ్రింక్స్’ తాగిన కొద్ది గంటల్లోనే స్పృహ తప్పింది.. తీరా స్కాన్ చేసి చూడగా గట్టి షాక్!

ఈ ఫోటోలో చిరుతను కనిపెట్టండి చూద్దాం.. వేటాడేందుకు దాగుంది.. పజిల్ కొంచెం కష్టమే.!