World Blood Donor Day 2022: రక్తదానంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం జూన్ 14న ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని జరుపుకుంటారు. మన దేశంలో ప్రతిరోజూ సుమారు 40 వేల మంది వరకు రక్తదానం చేస్తున్నారు. తద్వారా ఎందరో జీవితాల్లో కొత్త వెలుగులు నిండుతున్నాయి. అందుకే రక్తదానాన్ని మహాదాన్ అంటారు. అయితే రక్తదానం చేయడం అందరికీ సాధ్యం కాదు. మరి ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని (World Blood Donor Day 2022) పురస్కరించుకుని ఎవరెవరు రక్తదానం చేయకూడదో తెలుసుకుందాం రండి/
పచ్చబొట్టు ఉన్నవారు..
పచ్చబొట్టు లేదా ట్యూటూలూ వేయించుకున్నవారు రక్తదానం చేయకూడదు. పచ్చబొట్టు వేసే సమయంలో శరీరంలోకి వివిధ రకాల సూదులు ఇంజెక్ట్ చేస్తారు. ఇది హెపటైటిస్ తదితర వైరస్ ల వ్యాప్తి చెందే ప్రమాదాన్ని పెంచుతుందని నిపుణులు చెబుతారు. అందుకే టాటూలు వేసుకునేవారు కనీసం 4 నుంచి ఆరు నెలల వరకు రక్తదానం చేయకూడదట.
యాంటీబయాటిక్స్ వాడేవారు..
శరీరంలో ఏవైనా ఇన్ఫెక్షన్లు ఉన్నా, యాంటీ బయాటిక్స్ వాడుతున్నా.. రక్తదానానికి దూరంగా ఉండాలి. వీరు పూర్తైన తర్వాతే బ్లడ్ డొనేషన్‌కు వెళ్లాలని నిపుణులు సూచిస్తున్నారు.
హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటే..
ఒక వ్యక్తి శరీరం చాలా బలహీనంగా ఉన్నా..శరీరంలో హిమోగ్లోబిన్ లెవెల్స్ 12 కంటే తక్కువగా ఉన్నా రక్తదానం చేయకూడదు. ఇలాంటి పరిస్థితుల్లో, రక్త దానం చేస్తే దాతల ఆరోగ్యం దిగజారుతుంది. అందువల్ల, రక్తదానం చేసే ముందు తప్పనిసరిగా హిమోగ్లోబిన్ పరీక్ష చేయించుకోవాలి
వీరు కూడా..
కామెర్లు లేదా హెపటైటిస్ వ్యాధితో బాధపడుతున్న వారు, క్యాన్సర్ బాధితులు, జలుబు, దగ్గు ఏవైనా ఇన్ఫెక్షన్ల సమస్యలు ఉన్నవారు కూడా రక్తదానం చేయకూడదు. ఇక వివిధ రకాల టీకాలు, వ్యాక్సినేషన్లు తీసుకుంటున్నవారు రక్తదానం విషయంలో ఆరోగ్య నిపుణుల సలహాలు, సూచనలు తప్పనిసరిగా పాటించాలి. ఇక 18 ఏళ్లలోపు ,65 ఏళ్లు పైబడిన వృద్ధులు రక్తదానం చేయకూడదు. ధూమపానం, మద్యం అధికంగా తీసుకునేవారు దూరంగా ఉండాలి.
గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..
Also Read:
BCCI: మాజీ క్రికెటర్లు, అంపైర్లకు శుభవార్త చెప్పిన బీసీసీఐ.. నెలవారీ పెన్షన్‌పై కీలక నిర్ణయం..
India Corona: కరోనా నుంచి కాస్త ఊరట.. తగ్గిన కొత్త కేసులు.. ఆందోళన కలిగిస్తోన్న యాక్టివ్ కేసులు..