- Telugu News Photo Gallery yoga for thyroid patients these 4 yogasanas are very beneficial to get rid of thyroid
Yoga For Thyroid Patients: థైరాయిడ్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.. ఈ 4 యోగాసనాలను ట్రై చేసి చూడండి..
Yoga For Thyroid Patients: థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు క్రమం తప్పకుండా యోగాసనాలు వేయడం వలన మంచి ఫలితం ఉంటుంది. థైరాయిడ్ నుండి బయటపడటానికి మీరు ఏ యోగాసనాలు వేయవచ్చో ఈరోజు తెలుసుకుందాం..
Updated on: Jun 14, 2022 | 12:34 PM

యోగాభ్యాసం శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది అనేక ఆరోగ్య సంబంధిత వ్యాధుల నుండి ఉపశమనం కలిగిస్తుంది. మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. థైరాయిడ్ నివారణ కోసం మీరు క్రమం తప్పకుండా యోగా సాధన చేయవచ్చు.

ఉష్ట్రాసనం - యోగా చాపపై మోకాళ్లపై నిలబడండి. వెనుకకు చేతులను వంచండి. మీ అరచేతులను పాదాలపై ఉంచండి. . శరీరం, వెన్నెముక, మెడ నిఠారుగా ఉంచాలి. అరచేతులను సంబంధిత మోకాళ్ల మీద ఆనించాలి. అనంతరం మోకాళ్ళ మీద నిలబడాలి. సుధీర్ఘ శ్వాస తీసుకుంటూ శరీరాన్ని తలను వెనుకకు తీసుకుని వెళ్ళాలి. చేతులను వెనుకకు తీసుకువెళ్ళి పాదములను పట్టుకొనవలయును. ఈ భంగిమలో కొంత సేపు ఉండండి. ఆ తర్వాత వదిలేయండి. ఈ ముద్ర రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది ఆస్తమా రోగులకు కూడా ఎంతో మేలు చేస్తుంది.

హలాసన - మొదట శవాసనం వేయాలి. తరువాత కాళ్ళు రెండూ కలిపి మెల్లమెల్లగా తలవైపుగా నేలపై ఆనించాలి. చేతులు నేలమీద చాపి గాని, మీ తల వెనుకకు వెళ్లనివ్వండి. మీ కాలి వేళ్లు నేలను వెనుకకు తాకనివ్వండి. మీ ఛాతీని మీ గడ్డానికి వీలైనంత దగ్గరగా తీసుకురావడానికి ప్రయత్నించండి.అయితే చేతులపై ఎటువంటి ఒత్తిడిని పెట్టకండి. ఈ హలాసనం శరీరంలోని కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది.

సర్వంగాసనం - మొదట శవాసనం వేయాలి. తరువాత హలాసనంలో వలె కాళ్ళను మెల్లమెల్లగా తలవైపు వంచాలి. మీ పాదాలను నేల నుండి నెమ్మదిగా పైకి ఎత్తి నిటారుగా ఉంచాలి. పాదాలు, పిక్కలు, తొడలు, నడుము అన్నీ చక్కగా నిటారుగా ఉండేటట్లు జాగ్రత్త వహించాలి. మీ గడ్డం మీ ఛాతీకి తాకడానికి ప్రయత్నించండి. మీ కళ్ళను పాదాలపై కేంద్రీకరించండి. కొద్ది క్షణాలు శ్వాసను మెల్లగా పీల్చి, మెల్లగా వదులుతూ ఉండాలి. ఈ భంగిమలో కొంత సేపు ఉండండి. థైరాయిడ్ సమస్యలతో బాధపడేవారికి ఈ ఆసనం ఎంతో మేలు చేస్తుంది

శీర్షాసనం- వజ్రాసన భంగిమ. మీ మోచేతులు క్రిందికి ఉంచండి. అరచేతులను ఒకదానితో ఒకటి జత చేయాలి. రెండు కాళ్లను కలిపి మెల్లగా పైకి ఎత్తాలి. మోకాళ్లు, తరువాత రెండు కాళ్లు కలిపి మొల్లగా పైకి ఎత్తాలి. పిక్కలు, తొడలు, నడుము, వీపు నిటారుగా వుండాలి. కళ్లు మూసుకొని మొదట శీరాసనం పేయాలి. బరువు తలమీద తక్కువగాను, చేతుల మీద ఎక్కువగాను మోపాలి. కొన్ని సెకన్ల పాటు ఈ భంగిమలో ఉండండి. ఈ ఆసనం కండరాలను బలపరుస్తుంది. హైపోటెన్షన్, మైకము మొదలైన సమస్యలను తగ్గిస్తుంది





























