AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Skin Care Tips: ముఖానికి వీటిని పొరపాటున కూడా నేరుగా అప్లై చేయవద్దు.. ఎందుకంటే

శీతాకాలం వస్తే చాలు ఆరోగ్యం విషయంలో మాత్రమే కాదు చర్మం విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. స్కిన్ కేర్ కోసం రకరకాల రసాయనాలను కొంతమంది అప్లై చేస్తే.. మరికొందరు వంట ఇంట్లో దొరికే వస్తువులను నేరుగా చర్మంపై అప్లై చేస్తారు. ఇలా చేయడం వలన ముఖం ఆరోగ్యంగా, అందంగా ఉంటుందని భావిస్తారు.

Skin Care Tips: ముఖానికి వీటిని పొరపాటున కూడా నేరుగా అప్లై చేయవద్దు.. ఎందుకంటే
Skin Care Tips
Surya Kala
|

Updated on: Nov 21, 2024 | 8:52 PM

Share

ప్రస్తుతం మార్కెట్ లో చర్మ సంరక్షణ కోసం అనేక రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. అదే సమయంలో మెరిసే చర్మం కోసం రకరకాల ఇంటి చిట్కాలను అనుసరిస్తారు. అయితే ప్రతి ఒక్కరూ తమ చర్మాన్ని బట్టి సహజసిద్ధమైన పదార్థాలను మాత్రమే ఉపయోగించాలి. వీటిని సరిగ్గా ఉపయోగించకపోతే ముఖానికి మెరుపు మాట అటు ఉంచి హానిని కలించే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా కొన్నింటిని ముఖంపై నేరుగా అప్లై చేస్తారు. అయితే చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. కొన్నింటిని నేరుగా చర్మంపై అప్లై చేయడం వల్ల చికాకు, దద్దుర్లు, అలెర్జీలు సహా అనేక ఇతర చర్మ సంబంధిత సమస్యలు వస్తాయి. కనుక ఈ రోజు వేటిని నేరుగా ముఖానికి అప్లై చేయవద్దో తెలుసుకుందాం..

ఎసెన్షియల్ ఆయిల్‌

ఎసెన్షియల్ ఆయిల్‌ను నేరుగా ముఖంపై అప్లై చేయకూడదు. బదులుగా కొబ్బరి, జోజోబా లేదా బాదం నూనె వంటి క్యారియర్ ఆయిల్‌తో కలిపి ముఖానికి అప్లై చేయాలి. ఒక చెంచా క్యారియర్ ఆయిల్‌లో 2 నుంచి 3 చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ మిక్స్ చేసి అప్లై చేయాలి. ఎసెన్షియల్ ఆయిల్‌ను నేరుగా ముఖంపై అప్లై చేయడం వల్ల చర్మం పై చికాకు, చర్మ సమస్యలు వస్తాయి.

సిట్రస్ పండ్లు

నిమ్మ, నారింజ, ద్రాక్ష వంటి సిట్రస్ పండ్లలో విటమిన్ సి ఉంటుంది. ఇవి చర్మానికి మంచివి.. అయితే నేరుగా వీటిని ముఖానికి అప్లై చేయవద్దు. ఉదాహరణకు, నిమ్మకాయ లేదా టమోటాను నేరుగా ముఖంపై అప్లై చేస్తే చికాకు, ఎరుపు, అలర్జీలు వచ్చే అవకాశం ఉంది. చర్మ సంరక్షణలో సిట్రస్ పండ్లను ఫేస్ ప్యాక్‌లు వాడవద్దు లేదా తక్కువ పరిమాణంలో వాడండి. అయితే సున్నితమైన లేదా పొడి చర్మం ఉంటే సిట్రస్ పండ్లని ఉపయోగించవద్దు.

ఇవి కూడా చదవండి

చక్కెర

చాలా మంది స్క్రబ్ కోసం షుగర్‌ని వాడతారు. అయితే నేరుగా షుగర్ అప్లై చేయడం వలన స్కిన్ రాషేస్ వచ్చే అవకాశం ఉంది.

బేకింగ్ సోడా

చాలామంది చర్మ సంరక్షణ కోసం బేకింగ్ సోడాను ఉపయోగిస్తారు. అయితే చర్మం pH స్థాయిని పాడుచేయవచ్చు, దీని కారణంగా చర్మం పొడిగా, సున్నితంగా మారుతుంది. కనుక బేకింగ్ సోడా వాడకుండా ఉండండి.

అలోవెరా

అలోవెరా జెల్ చర్మానికి చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. అయితే కొన్ని సందర్భాల్లో తాజా కలబంద జెల్‌ను నేరుగా చర్మంపై పూయడం వల్ల చికాకు, దద్దుర్లు ఏర్పడతాయి, ముఖ్యంగా సున్నితమైన స్కిన్ ఉండే వారు నేరుగా కలబందను ఉపయోగించవద్దు. దీనిని రోజ్ వాటర్, విటమిన్ ఇ క్యాప్సూల్, బాదం లేదా కొబ్బరి నూనెను కలిపి వాడాల్సి ఉంటుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)