AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: గర్ల్ ఫ్రెండ్ కోసం రెండు దేశాలల్లో చక్కర్లు కొట్టిన యువకుడు.. అతను చెప్పిన రీజన్ వింటే షాక్..

ప్రేమ కోసం ప్రేమించిన అమ్మాయి కోసం ఏమైనా చేసే వారు ఎందరో ఉన్నారు. ప్రేమకు సంబందించిన అనేక వార్తలు తరచుగా తింటూనే ఉన్నాం.. తాజాగా ఓ ప్రేమ పట్ల అసాధారణమైన నిబద్ధతతో ఓ చైనీస్ అంతర్జాతీయ విద్యార్థి ఇంటర్నెట్ దృష్టిని ఆకర్షించాడు. జు గ్వాంగ్లీ అనే 28 ఏళ్ల యువకుడు తన ప్రియురాలితో కలిసి చైనాలోని షాన్‌డాంగ్ లో ఉంటున్నాడు. మరోవైపు చదువు కోసం ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ మధ్య వారానికోసారి ప్రయాణిస్తున్నాడు.

Viral News: గర్ల్ ఫ్రెండ్ కోసం రెండు దేశాలల్లో చక్కర్లు కొట్టిన యువకుడు.. అతను చెప్పిన రీజన్ వింటే షాక్..
Viral NewsImage Credit source: Douyin
Surya Kala
|

Updated on: Nov 21, 2024 | 8:29 PM

Share

ప్రేమించిన అమ్మాయి కోసం తపించిపోయే ప్రేమికుల్ని చూసాం. కానీ చైనాలో ఓ యువకుడు గర్ల్‌ఫ్రెండ్‌తో టైమ్‌ గడిపేందుకు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న కాలేజీకి వారం వారం విమాన ప్రయాణం చేశాడు. ప్రతి వారం విమానంలో వెళ్లి క్లాస్‌కు హాజరై, తిరిగి విమానంలో రావడం ఎంతో సవాలుతో కూడుకున్న పని. ఎన్ని కష్టాలు ఎదురైనా సరే.. గర్ల్‌ఫ్రెండ్‌ కోసం విమాన ప్రయాణం చేస్తూ వార్తల్లో నిలిచాడు.

జు గువాంగ్లీ  చైనాలో నివాసం ఉంటాడు. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఆర్‌ఎంఐటీ విశ్వవిద్యాలయంలో ఎనిమిదేళ్లు చదువుకున్నాడు. ఆఖరు సెమిస్టర్‌ ఒక్కటే మిగిలుంది. కేవలం ఒకే ఒక క్లాస్ మూడు నెలల పాటు అటెండ్ అయితే చాలు. మాస్టర్స్‌ డిగ్రీ వచ్చేస్తుంది. అందుకోసం చైనా నుంచి మెల్‌బోర్న్‌కు ప్రతి వారం విమాన ప్రయాణం చేసాడు. గతేడాది ఆగస్ట్ నుంచి అక్టోబర్ మధ్య మూడు నెలల సమయంలో వారానికి ఒకసారి చొప్పున 11 సార్లు ఫ్లైట్‌ జర్నీ చేశాడు గువాంగ్లీ. చైనా నుంచి మెల్‌బోర్న్‌కు గువాంగ్లీకి ప్రయాణానికి మూడ్రోజులు పట్టేది. అయినా ప్రయాణం చేయడానికే ఆసక్తి చూపేవాడు. చైనాలో విమానం ఎక్కితే మరునాడు ఆస్ట్రేలియా చేరుకునేవాడు. ఆ రోజు క్లాస్‌కి వెళ్లి మరుసటి రోజు ఫ్లైట్‌ ఎక్కి చైనా తిరిగొచ్చేవాడు. ప్రతీ వారం విమానంలో ఎందుకు వెళ్తాడు అని ఎవరైనా అతనిని అడిగినప్పుడు.. అతను చెప్పిన సమాధానం విని ఆశ్చర్యపోయారు.

ఎందుకంటే తాను రెండు దేశాల మధ్య చక్కర్లు కొట్టడానికి కారణం తన గర్ల్ ఫ్రెండ్ అని చెప్పాడు. మెల్‌బోర్న్‌ విశ్వవిద్యాలయంలో ఉండగా పరిచయమైందని అనుకోకుండా తన గర్ల్‌ఫ్రెండ్‌ తనకంటే ముందు చైనాకు తిరిగొచ్చేసిందని అన్నాడు. ఆమె కోర్స్‌ పూర్తి కావడంతో ఆమె తిరిగి చైనా వచ్చేసిందని ఆమె లేకుండా మెల్‌బోర్న్‌లో ఏదో వెలితిగా అనిపించేదనీ ఒంటరితనం వెంటాడేదని గువాంగ్లీ తెలిపాడు. సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన వీడియోలో తన ప్రయాణ అనుభవాన్ని షేర్‌ చేసుకున్నాడు. విమాన టికెట్‌ కోసం, ట్యాక్సీ ఛార్జీలు భోజనం కోసం తనకు ఎంత ఖర్చు అయిందీ వివరించాడు. అలా మెల్‌బోర్న్‌ వెళ్లిన ప్రతీసారి డబ్బు ఆదా చేయడానికి ఫ్రెండ్‌ ఇంట్లో వారంలో ఒక రాత్రి బస చేసేవాడట.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..