Pakistan: పాముకి పాలు పోస్తే.. పాక్ లో ఉగ్రవాదుల బీభత్సం.. 40 మంది మృతి, 25 మందికి గాయాలు

పాకిస్తాన్‌లోని లోయర్ కుర్రంలో ఉగ్రవాదులు మెరుపుదాడి చేశారు. ప్రయాణికులతో ఉన్న వాహనంపై ఉగ్రవాదుల విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 40 మంది చనిపోయారు. 25 మంది గాయపడ్డారు. ఇందులో పలువురు మహిళలతో పాటు ఓ పోలీసు అధికారి కూడా ఉన్నారు.

Pakistan: పాముకి పాలు పోస్తే.. పాక్ లో ఉగ్రవాదుల బీభత్సం.. 40 మంది మృతి, 25 మందికి గాయాలు
Terrorist Attack In Pak
Follow us
Surya Kala

|

Updated on: Nov 21, 2024 | 6:33 PM

పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు బీభత్సం సృష్టించారు. లోయర్ కుర్రంలో ప్రయాణికుల వెళ్తున్న వాహనంపై ఉగ్రవాదులు మెరుపుదాడి చేశారు. విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 40 మంది చనిపోయారు. 25 మందికి పైగా గాయపడ్డారు. ఇందులో పలువురు మహిళలతో పాటు ఓ పోలీసు అధికారి కూడా ఉన్నారు. వాహనం పరాచినార్ నుంచి పెషావర్‌కు వెళ్తున్నట్లు సమాచారం. ఉచాట్ ప్రాంతంలో ఉగ్రవాదులు మెరుపుదాడి చేశారు. క్షతగాత్రుల్లో 8 మంది మండోరి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఈ దాడికి సంబంధించి పాక్ మంత్రి మొహ్సిన్ నఖ్వీ ఓ ప్రకటన చేశారు. ఈ దాడి చాలా బాధాకరమని అన్నారు. ఉగ్రదాడిలో ప్రాణ, ఆస్తి నష్టం జరగడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉగ్రవాదులు పిరికిపంద చర్యకు పాల్పడ్డారు. ఈ దాడికి పాల్పడిన వారిని ప్రభుత్వం విడిచిపెట్టదని అన్నారు.

దాడి ఘటనపై ప్రత్యక్ష సాక్షులు కథనం

దిగువ కుర్రం ఉగ్రదాడిపై ప్రత్యక్ష సాక్షులు కొందరు మాట్లాడుతూ ఉగ్రవాదులు మెరుపుదాడి చేశారని.. విచక్షణారహితంగా కాల్పులు జరిపారని.. హృదయ విదారక సంఘటన గురించి చెప్పారు. హత్తుగా దాడి చేయడంతో వాహనంలోని వ్యక్తులకు అసలు ఏమి జరుగుతుందో తెలుసుకునే అవకాశం కూడా లేకపోయింది.. ఏమీ అర్థం చేసుకోకముందే.. మృత్యు ఘోష అప్పటికే మొదలైంది.. మృతదేహాల కప్పులుగా పడడం మొదలైందని చెప్పారు.

షియా ముస్లింలను లక్ష్యంగా చేసుకుని దాడులు

వాహనంలో ఎక్కువ మంది షియా ముస్లింలు ఉన్నట్లు సమాచారం. ఈ దాడి జరిగిన కుర్రం జిల్లాలో ఇటీవలి కాలంలో మెజారిటీ సున్నీ, మైనారిటీ షియా ముస్లింల మధ్య అనేక ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ ఘర్షణల్లో పదుల సంఖ్యలో ప్రజలు చనిపోయారు. ఖైబర్ పఖ్తుంఖ్వా రాజధాని పెషావర్‌కు అనేక వాహనాలు ప్రయాణికులను ఎక్కించుకుని వెళ్తున్నాయని ఓ పోలీసు అధికారి తెలిపారు. ఈ సమయంలోనే ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు.

ఇవి కూడా చదవండి

దాడి చేసిన వారిని శిక్షిస్తాం: జర్దారీ

కుర్రం ఉగ్రవాద దాడిపై అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ సంతాపం వ్యక్తం చేశారు. అమాయక ప్రయాణికులపై దాడి చేయడం చాలా పిరికి చర్యని, అమానుషమని అన్నారు. అమాయకులపై దాడి చేసిన వారిని శిక్షిస్తామని చెప్పారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. గాయపడిన వారికి సకాలంలో వైద్యం అందించాలని, దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని జర్దారీ ఆదేశాలు జారీ చేశారు.

పౌరులను టార్గెట్ చేయడం పిరికిపందల

పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ చైర్మన్ బిలావల్ భుట్టో జర్దారీ కూడా ప్రయాణికుల వాహనాలపై దాడిని ఖండించారు. కుర్రం జిల్లాలో అమాయక పౌరులను టార్గెట్ చేయడం అత్యంత పిరికి, దారుణమని అన్నారు. దాడికి పాల్పడిన వారికి న్యాయం చేయడం ప్రభుత్వ ప్రథమ బాధ్యతని చెప్పారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?