AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్‌లో ఎదురు దెబ్బ.. అరెస్ట్ వారెంట్ జారీ

అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ (ICC)లో ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహుకు ఎదురు దెబ్బ తగిలింది. ప్రధాన మంత్రితో పాటు మాజీ రక్షణ మంత్రి యోవ్ గాలంట్, హమాస్ మిలిటరీ కమాండర్ మహ్మద్ దేఫ్‌పై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అయితే ఇజ్రాయెల్, హమాస్ రెండూ కూడా ఈ ఆరోపణలను ఖండించాయి. మొహమ్మద్ దీఫ్ జూలైలో గాజాలో చంపబడ్డాడు.

ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్‌లో ఎదురు దెబ్బ.. అరెస్ట్ వారెంట్ జారీ
Benjamin Netanyahu]
Surya Kala
|

Updated on: Nov 21, 2024 | 7:01 PM

Share

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, మాజీ రక్షణ మంత్రి యోవ్ గాలంట్ లతో పాటు హమాస్ మిలిటరీ కమాండర్ మహమ్మద్ డీఫ్‌లపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) న్యాయమూర్తులు అరెస్ట్ వారెంట్లను జారీ చేశారు. ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరిగిన యుద్ధంతో ఈ నాయకులు యుద్ధ నేరాలకు పాల్పడ్డారని.. మానవత్వానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకున్నారని.. నేరాలకు పాల్పడ్డారని ICC తెలిపింది. నెతన్యాహుపై వచ్చిన ఆరోపణలపై విచారణకు కూడా కోర్టు ఆదేశించింది.

అయితే ఈ విషయంలో అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ఆరోపణలను ఇజ్రాయెల్ , హమాస్ రెండూ ఖండించాయి. ఇటువంటి వారెంట్లకు చట్టపరమైన ఆధారం లేదని ఇజ్రాయెల్ పేర్కొంది. అయితే హమాస్ ఆరోపణలను రాజకీయ ప్రేరేపితమని అభివర్ణించింది. ఈ విషయం అంతర్జాతీయ సమాజంలో చాలా చర్చనీయాంశంగా మారింది. జూలైలో గాజాపై వైమానిక దాడిలో మహమ్మద్ దీఫ్ మరణించినట్లు ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది.

ఏ సందర్భంలో వారెంట్ జారీ చేయబడిందంటే

నివేదిక ప్రకారం ICC చేసిన ఆరోపణలు ఏమిటంటే.. పాలస్తీనా పౌరులను ఉద్దేశపూర్వకంగా చంపుతున్నారని.. అంతర్జాతీయ మానవతా సహాయం గాజాకు చేరుకోకుండా నిరోధించేలా ఇజ్రాయెల్ సైన్యాన్ని ఆదేశించినందుకు పిఎం నెతన్యాహు, ఇజ్రాయెల్ రక్షణ మంత్రిని దోషులుగా పరిగణించినట్లు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

ఇజ్రాయెల్ ప్రధాని పాలస్తీనా పౌరులను యుద్ధం సాకుతో చంపేశారని.. గాజాను నాశనం చేయాలని ఆదేశించారని కోర్టు తన విచారణలో వెల్లడైందని చెప్పింది. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న ఐసీసీ న్యాయమూర్తులు నెతన్యాహుపై వారెంట్ జారీ చేయాలని నిర్ణయించినట్లు తెలిపింది.

కోర్టు నిర్ణయం ప్రభావం ఎలా ఉంటుందంటే

అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు వారెంట్‌పై తన నిర్ణయాన్ని అన్ని సభ్య దేశాలకు పంపుతుంది. ఈ వారెంట్ సభ్య దేశాలకు ఇచ్చే సలహా మాత్రమే అయినప్పటికీ.. దీనిని అనుసరించాల్సిన, ఆచరించాల్సిన అవసరం లేదు. అయితే ఈ కోర్టు వారెంట్ వెనుక ఉన్న తర్కం ఏమిటంటే.. ప్రతి దేశం తన అంతర్గత, విదేశాంగ విధానాన్ని నిర్ణయించుకునే స్వేచ్ఛను కలిగి ఉంది. ఈ కారణంగా.. ఇతర అంతర్జాతీయ సంస్థల వలె ICC కూడా దీనిని అంగీకరిస్తుంది.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై కోర్టు అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేసింది. ఉక్రెయిన్‌లో జరిగిన మారణహోమం కేసులో అతడు దోషిగా తేలింది. అయినప్పటికీ పుతిన్ అనేక దేశాలను సందర్శించారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..