News9 Global Summit: మరికాసేపట్లో న్యూస్‌ 9 గ్లోబల్‌ సమిట్‌.. ప్రపంచ దిగ్గజాల మేధోమథనం!

మూడు రోజుల పాటు జరిగే ఈ సమ్మిట్‌లో 10కి పైగా సెషన్‌లు జరగనుండగా, 50 మందికి పైగా వక్తలు ఇందులో పాల్గొంటారు.

News9 Global Summit: మరికాసేపట్లో న్యూస్‌ 9 గ్లోబల్‌ సమిట్‌.. ప్రపంచ దిగ్గజాల మేధోమథనం!
News9 Global Summit
Follow us
Balaraju Goud

|

Updated on: Nov 21, 2024 | 10:54 PM

టీవీ-9 నెట్‌వర్క్‌ ఆధ్వర్యంలో న్యూస్‌ 9 గ్లోబల్‌ సమిట్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జర్మనీలోని స్టట్‌గార్ట్‌ వేదికగా జరుగుతున్న ఈ అంతర్జాతీయ సదస్సుకు ముఖ్య అతిధిగా విచ్చేస్తున్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన కీలక సందేశాన్ని అందిస్తారు. ఇవాళ(నవంబర్‌ 21) రాత్రి తొమ్మిది గంటలకు మోదీ ప్రసంగాన్ని టీవీ నైన్‌ లైవ్‌లో చూడవచ్చు.

అంతర్జాతీయ సమున్నత యవనికపై భారతదేశం అనే అంశం ప్రధాని మోదీ ఈ సదస్సులో కీలక ఉపన్యాసం చేయనున్నారు. అంతర్జాతీయ వృద్ధికి ఆకృతి ఇవ్వడంలో భారత్‌ పాత్రను ప్రధాని మోదీ ప్రముఖంగా ప్రస్తావించనున్నారు. భారత్‌-జర్మనీ మధ్య సహకారం మరింత పెంపొందించేందుకు మోదీ ప్రసంగం దిశానిర్దేశం చేయనుంది. వికసిత్‌ భారత్‌ను ఈ అంతర్జాతీయ వేదికగా ప్రపంచానికి ఆయన తెలియజెప్పనున్నారు.

ఈ సదస్సు నవంబర్‌ 21 నుంచి 23 వరకు జర్మనీ- స్టట్‌గార్ట్‌లోని ప్రఖ్యాత MHP- అరెనాలో జరగనుంది. ఇండియా అండ్ జర్మనీ: ఏ రోడ్‌ మ్యాప్‌ ఫర్‌ సస్టెయినబుల్‌ గ్రోత్‌ అనే ముఖ్య థీమ్‌తో ఈ సదస్సు జరుగుతోంది. సుస్థిర భవిష్యత్తు కోసం అన్వేషించాల్సిన వ్యూహాలపై ఈ సదస్సులో రాజకీయాలు, వ్యాపారం, క్రీడారంగానికి చెందిన ప్రముఖులు మాట్లాడతారు.

భారత్‌-జర్మనీ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడేలా చూడాలన్నది ఈ అంతర్జాతీయ శిఖరాగ్ర సదస్సు లక్ష్యమని టీవీ నైన్‌ నెట్‌వర్క్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, CEO బరుణ్‌ దాస్‌ తెలిపారు. పరస్పర వృద్ధి కోసం వివిధ రంగాలకు చెందిన వాటాదారులను ఒక్కటి చేసి చర్యలు తీసుకొదగ్గ పరిష్కారాలను ఈ సదస్సు చూపుతుందని బరుణ్‌ దాస్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

Tv9 నెట్‌వర్క్ MD &CEO బరున్ దాస్ స్వాగత ప్రసంగం తర్వాత సెషన్‌లు ప్రారంభమవుతాయి. జర్మనీ ఆహార ,వ్యవసాయ మంత్రి సెమ్ ఓజ్డెమిర్ భారత్‌ – జర్మనీల స్థిరమైన అభివృద్ధి గురించి ప్రసంగిస్తారు. ఇది కాకుండా, గ్రీన్ ఎనర్జీ, AI, డిజిటల్ ఎకానమీ స్కిల్ డెవలప్‌మెంట్‌పై సాయంత్రం వరకు భారతదేశం, జర్మనీకి చెందిన విధాన రూపకర్తలు పాల్గొంటారు. భారతదేశ రక్షణ పరిశ్రమ, నేటి యునికార్న్ అంశం కూడా చర్చిస్తారు. ఈ శిఖరాగ్ర సదస్సులో భాగంగా భారత్‌-జర్మనీ: మన్నికైన వృద్ధి కోసం అనుసంధానం అనే పేరుతో నిర్వహించే సెషన్‌లో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కీలక ప్రసంగం చేయనున్నారు. మొదటి రోజు, Mercedes-Benz India CEO సంతోష్ అయ్యర్, శ్రీనగర్ టు స్టట్‌గార్ట్,కన్స్యూమర్ కారిడార్ అనే అంశంపై కూడా చర్చిస్తారు. ఇక, ఈ థీమ్‌ రెండు దేశాల మధ్య ఇంజినీరింగ్‌, టెక్నాలజీ, ఇన్నోవేషన్‌ రంగంలో దీర్ఘకాలిక ఆర్థికవృద్ధికి ఊతంగా నిలవనుంది.

సమ్మిట్ యొక్క రెండవ రోజు, రైల్వే, సమాచార, ప్రసార రంగం, ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ రంగంలో భారత్‌ సాధిస్తున్న ప్రగతికి జర్మనీ ఇంజినీరింగ్‌ ప్రతిభ, ఆవిష్కరణల సంస్కృతి తోడైతే సుస్థిర సాంకేతిక పరిజ్ఞానం, మౌలిక సదుపాయాల అభివృద్ధిలో కొత్త అంతర్జాతీయ ప్రమాణాలు నెలకొననున్నాయి. ఈ విషయాలను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ న్యూస్‌ నైన్‌ గ్లోబల్‌ సమిట్‌ వేదికగా వెల్లడిస్తారు.

న్యూస్9 గ్లోబల్ సమ్మిట్ రెండో రోజున, పోర్షే, మారుతీ, సుజుకీ, మెర్సిడెస్ బెంజ్, భారత్ ఫోర్స్, భారతదేశం, జర్మనీకి చెందిన అనేక వ్యాపార సంస్థలు, ఇండో జర్మన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మరియు అసోచామ్ వంటి వాణిజ్య సంఘాల ప్రతినిధులు ముఖ్యమైన అంశాలపై మేధోమథనం చేయనున్నారు.

సుస్థిర ప్రగతి, ఆవిష్కరణల్లో కర్నాటక పోషిస్తున్న పాత్రపై ఈ సదస్సులో కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రత్యేక ప్రసంగం ఉంటుంది. టెక్నాలజీ, రెన్యువబుల్‌ ఎనర్జీ, సమిష్ఠి అభివృద్ధిలో కర్నాటక రాష్ట్రం తీసుకుంటున్న చర్యలు, చొరవను తన ప్రసంగంలో సిద్ధరామయ్య ప్రస్తావించనున్నారు.

మూడు రోజుల పాటు జరిగే ఈ సమ్మిట్‌లో 10కి పైగా సెషన్‌లు జరగనుండగా, 50 మందికి పైగా వక్తలు ఇందులో పాల్గొంటారు. వీటిలో టెక్ మహీంద్రాకు చెందిన హర్షుల్ అస్నానీ, ఎమ్‌హెచ్‌పికి చెందిన స్టెఫాన్ బేయర్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆంత్రోపోమెట్రిక్స్‌కు చెందిన డాక్టర్ జాన్ నీహుయిస్, మైక్రోన్ ఇండియాకు చెందిన ఆనంద్ రామమూర్తి ‘ఏఐ: అడ్వాంటేజ్ ఇండియా’ అనే అంశంపై చర్చిస్తారు. క్వెస్ కార్ప్‌కు చెందిన అజిత్ ఐజాక్, పీపుల్‌స్ట్రాంగ్‌కు చెందిన పంకజ్ బన్సల్, డాక్టర్. ఫ్లోరియన్ స్టెగ్‌మాన్, ఫింటిబాకు చెందిన జోనాస్ మార్గ్రాఫ్ ‘బ్రిడ్జింగ్ ది స్కిల్ గ్యాప్: క్రాఫ్టింగ్ ఎ విన్-విన్?’ అనే అంశంపై తన అభిప్రాయాలను పంచుకుంటారు. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్‌కు చెందిన అజయ్ మాథుర్, డాక్టర్ విభా ధావన్, హీరో ఫ్యూచర్ ఎనర్జీకి చెందిన రాహుల్ ముంజాల్, డాక్టర్ జూలియన్ హోచ్‌స్‌చార్ఫ్ మరియు ప్రిజీరోకి చెందిన పీటర్ హార్ట్‌మన్ ‘డెవలప్డ్ వర్సెస్ డెవలపింగ్: ది గ్రీన్ డైలమా’ అనే అంశంపై మేధోమథనం చేస్తారు.

నాలుగుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన జర్మనీ – భారత్‌ను ఫుట్‌బాల్‌ దేశంగా తీర్చిదిద్దేందుకు ఆసక్తి చూపుతోంది. నైపుణ్యం కలిగిన యువతను ప్రోత్సహించి వారిని స్టార్స్‌గా తీర్చిదిద్దేందుకు ఇప్పటికే చర్యలు ప్రారంభించింది. దీనికి సంబంధించిన చర్చలో భారతీయ టెన్నిస్‌ దిగ్గజం సానియా మీర్జా పాల్గొంటారు. సదస్సు చివరి రోజు స్టట్‌గార్డ్‌లో జర్మన్‌ ఫుట్‌బాల్‌ టీముల మధ్య మ్యాచ్‌ కూడా ఏర్పాటు చేశారు.

మరిన్ని న్యూస్‌ 9 గ్లోబల్‌ సమిట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

భారత్‌-జర్మనీ మధ్య సుస్థిర అభివృద్ధికి రోడ్‌మ్యాప్‌..!
భారత్‌-జర్మనీ మధ్య సుస్థిర అభివృద్ధికి రోడ్‌మ్యాప్‌..!
రాజకీయాలకు పోసాని గుడ్‌బై.. ఇకపై ఆఖరి శ్వాస వరకు..
రాజకీయాలకు పోసాని గుడ్‌బై.. ఇకపై ఆఖరి శ్వాస వరకు..
పుష్ప2 కోసం ఏకంగా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్.! సుక్కు దెబ్బ అది
పుష్ప2 కోసం ఏకంగా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్.! సుక్కు దెబ్బ అది
మనబొమ్మ అదుర్స్.. బాలీవుడ్‌ బెదుర్స్.! ఫిల్మ్ ఇండస్ట్రీ పై టాలీవు
మనబొమ్మ అదుర్స్.. బాలీవుడ్‌ బెదుర్స్.! ఫిల్మ్ ఇండస్ట్రీ పై టాలీవు
మీ రివ్యూ మీ ఇష్టమైతే.. మా సినిమా మా ఇష్టం.! రివ్యూవర్స్‌పై
మీ రివ్యూ మీ ఇష్టమైతే.. మా సినిమా మా ఇష్టం.! రివ్యూవర్స్‌పై
జక్కన్న సంగతి తెలిసిందేగా.. SSMB29 ఇప్పట్లో లేనట్లేనా.?
జక్కన్న సంగతి తెలిసిందేగా.. SSMB29 ఇప్పట్లో లేనట్లేనా.?
బన్నీ,సుకుమార్‌ దేవీశ్రీ ని పక్కన పెట్టేశారా? మధ్యలో తమన్ ఎందుకు?
బన్నీ,సుకుమార్‌ దేవీశ్రీ ని పక్కన పెట్టేశారా? మధ్యలో తమన్ ఎందుకు?
వామ్మో.. అనుష్క.! వయసు 43ఏళ్లే.. కానీ సంపాదన 140 కోట్లు.!
వామ్మో.. అనుష్క.! వయసు 43ఏళ్లే.. కానీ సంపాదన 140 కోట్లు.!
ఇండియాలోనే పరమ చెత్త సినిమా.. 45కోట్లు పెడితే 70 వేల కలెక్షన్స్‌.
ఇండియాలోనే పరమ చెత్త సినిమా.. 45కోట్లు పెడితే 70 వేల కలెక్షన్స్‌.
శివునికి నమస్కరిస్తూ కుప్పకూలిపోయిన వ్యక్తి... CPR చేసినా..
శివునికి నమస్కరిస్తూ కుప్పకూలిపోయిన వ్యక్తి... CPR చేసినా..