News9 Global Summit: టీవీ9 నెట్‌వర్క్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మక గ్లోబల్ సమ్మిట్.. జర్మనీ వేదికగా గళం వినిపించనున్న భారత మీడియా సంస్థ

ఢిల్లీలో వాట్‌ ఇండియా థింక్స్‌ థీమ్‌తో గ్లోబల్‌ సమ్మిట్‌ను విజయవంతంగా నిర్వహించిన TV9 గ్రూప్‌నకు చెందిన న్యూస్‌9 .. ఇప్పుడు జర్మనీ లోని స్టుట్‌గాట్‌ నగరం వేదికగా మరో అంతర్జాతీయ సదస్సును నిర్వహిస్తోంది. ఈ సదస్సు గురువారం నుంచి (నవంబర్‌ 21 నుంచి 23వ తేదీ వరకు) శనివారం వరకు జరగనుంది. ఈ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు.

News9 Global Summit: టీవీ9 నెట్‌వర్క్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మక గ్లోబల్ సమ్మిట్.. జర్మనీ వేదికగా గళం వినిపించనున్న భారత మీడియా సంస్థ
News9 Global Summit
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 21, 2024 | 8:04 AM

ఢిల్లీలో వాట్‌ ఇండియా థింక్స్‌ థీమ్‌తో గ్లోబల్‌ సమ్మిట్‌ను విజయవంతంగా నిర్వహించిన TV9 గ్రూప్‌నకు చెందిన న్యూస్‌9 .. ఇప్పుడు జర్మనీ లోని స్టుట్‌గాట్‌ నగరం వేదికగా మరో అంతర్జాతీయ సదస్సును నిర్వహిస్తోంది. ఈ సదస్సు గురువారం నుంచి (నవంబర్‌ 21 నుంచి 23వ తేదీ వరకు) శనివారం వరకు జరగనుంది. ఈ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. ఇలాంటి అంతర్జాతీయ సదస్సును భారతదేశానికి చెందిన ఓ మీడియా సంస్థ నిర్వహించడం చారిత్రాత్మకం కానుంది. భారత్‌- జర్మనీ దేశాల మధ్య వాణిజ్య , ద్వైపాక్షిక, సాంస్కృతిక , క్రీడా సంబంధాలను బలోపేతంగా చేయడం లక్ష్యంగా న్యూస్‌9 గ్లోబల్‌ సమ్మిట్‌ జరగనుంది. గురువారం నుంచి 23వ తేదీ వరకు MHP ఎరినా ఫుట్‌బాల్‌ స్టేడియం వేదికగా టీవీ9 నెట్‌వర్క్ ఎండీ, సీఈఓ బరుణ్‌దాస్‌ అధ్యక్షతన ఈ సదస్సు మూడు రోజులపాటు జరగనుంది. ఇండియా-జర్మనీ గ్లోబల్‌ సమ్మిట్‌కు 200 మంది ప్రతినిధులు హాజరవుతున్నారు. భారత్‌ , జర్మనీకి చెందిన మంత్రులు, రాజకీయ, వ్యాపార, క్రీడా ప్రముఖులు ఈ సదస్సుకు హాజరై చర్చలో పాల్గొని.. తమ తమ అభిప్రాయాలను వెల్లడించనున్నారు.

న్యూస్‌9 గ్లోబల్‌ సమ్మిట్‌.. భారత్, జర్మనీ రెండు దేశాల సుస్థిరాభివృద్దికి దోహదం కానుంది. అయితే.. గత ఫిభ్రవరిలో న్యూస్‌ 9 ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన ఇండియా-జర్మనీ సమ్మిట్‌కు కొనసాగింపుగా జర్మనీలో కూడా సదస్సును నిర్వహిస్తున్నారు. స్టుట్‌గార్డ్‌ నగరం బెంజ్‌ కార్ల తయారీతో పాటు ఫుట్‌బాల్‌కు చాలా ప్రసిద్ది చెందింది.. ఈ రంగాల్లో మరింత అభివృద్ధి సాధించేందుకు వీలుగా టీవీ9 నెట్‌వర్క్.. ఇక్కడ సదస్సును ఏర్పాటు చేసినట్లు టీవీ9 నెట్‌వర్క్ ఎండీ, సీఈఓ బరుణ్‌దాస్‌ తెలిపారు. వాస్తవానికి భారత్‌ను కూడా ఫుట్‌బాల్‌ రంగంలో తీర్చిదిద్దేందుకు TV9 గ్రూప్‌ నడుంబిగించిన విషయం తెలిసిందే..

ఇటీవల ఢిల్లీలో న్యూస్‌ 9 ఆధ్వర్యంలో జరిగిన సదస్సుకు 50 దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు.. దాని కొనసాగింపుగా స్టుట్‌గార్ట్‌ సమ్మిట్‌ జరగనుంది.. వాణిజ్యంతో అన్నిరంగాల్లో ఇరు దేశాల భాగస్వామ్యం.. అదేవిధంగా ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ఈ శిఖరాగ్ర సదస్సు జరగనుంది..

రెండో రోజు ప్రధాని మోదీ ప్రసంగం..

ఇండియా- జర్మనీ సుస్థిర వృద్ధికి రోడ్ మ్యాప్ అనే అంశంపై న్యూస్‌9 గ్లోబల్‌ సమ్మిట్‌ జరగనుంది.. దీంతో పాటు.. ప్రపంచ సవాళ్లను పరిష్కరించడం లక్ష్యంగా చర్చ జరగనుంది.. భారత కాలమానం ప్రకారం.. మొదటిరోజు గురువారం రాత్రి 9.45 కి ప్రారంభం కానుంది.. టీవీ9 నెట్‌వర్క్ ఎండీ, సీఈఓ బరుణ్‌దాస్‌ ప్రారంభ ఉపన్యాసం తర్వాత.. కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, జ్యోతిరాదిత్య సింధియా, మై హోం గ్రూప్ వైస్ చైర్మన్ రాము రావు ప్రసంగించనున్నారు.

రెండోరోజు గ్లోబల్‌ సమ్మిట్‌లో ఇండియా ఇన్‌సైడ్ ద గ్లోబల్ బ్రైట్ స్పాట్ అనే అంశంపై… ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. భారత్- జర్మనీ మధ్య సంబంధాలపై, ప్రపంచ పరిస్థితులపై సమ్మిట్‌లో చర్చించే అవకాశం ఉంది..

అలాగే ఈ సమ్మిట్ లో పలువురు రాజకీయ, వాణిజ్య, క్రీడా, సినీ ప్రముఖులు పాల్గొని అభిప్రాయాలను పంచుకోనున్నారు.

న్యూస్9 గ్లోబల్ సమ్మిట్ మూడు రోజుల కార్యక్రమాల వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

జర్మనీ వేదికగా న్యూస్9 గ్లోబల్ సమ్మిట్.. ప్రధాన మోదీ కీలక ప్రసంగం
జర్మనీ వేదికగా న్యూస్9 గ్లోబల్ సమ్మిట్.. ప్రధాన మోదీ కీలక ప్రసంగం
కోతికి సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడిన యువకుడు..!
కోతికి సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడిన యువకుడు..!
గంట కొట్టాలంటే ఒకలా.. గంట కొట్టేయాలంటే మరొకలా..
గంట కొట్టాలంటే ఒకలా.. గంట కొట్టేయాలంటే మరొకలా..
విమానంలో కుదుపులు.. ఎగిరిపడ్డ ప్రయాణికులు.! వీడియో వైరల్..
విమానంలో కుదుపులు.. ఎగిరిపడ్డ ప్రయాణికులు.! వీడియో వైరల్..
అమెరికాలో భారీగా ఉద్యోగాల కోత.. వివేక్ రామస్వామి హింట్.!
అమెరికాలో భారీగా ఉద్యోగాల కోత.. వివేక్ రామస్వామి హింట్.!
భద్రకాళి చెరువు ఖాళీ. అబ్బో.. ఎన్ని రకాల చేపలో! అదిరిపోయే వీడియో
భద్రకాళి చెరువు ఖాళీ. అబ్బో.. ఎన్ని రకాల చేపలో! అదిరిపోయే వీడియో
మందు పార్టీ తరువాత ఘోరం.! రోడ్డుపై చెల్లాచెదురుగా పడిన శరీరభాగాలు
మందు పార్టీ తరువాత ఘోరం.! రోడ్డుపై చెల్లాచెదురుగా పడిన శరీరభాగాలు
ఇన్సూరెన్స్ కోసం ఎలుగుబంటి వేషంలో కార్లు నాశనం.! వీడియో..
ఇన్సూరెన్స్ కోసం ఎలుగుబంటి వేషంలో కార్లు నాశనం.! వీడియో..
ఫ్రీ డేటా, నో ఛార్జింగ్‌, టెస్లా.. ఇలాంటి ఫోన్లను తయారుచేస్తోందా?
ఫ్రీ డేటా, నో ఛార్జింగ్‌, టెస్లా.. ఇలాంటి ఫోన్లను తయారుచేస్తోందా?
రంగులు మారే శివలింగం.. ఎక్కడో తెలుసా.? వీడియో వైరల్..
రంగులు మారే శివలింగం.. ఎక్కడో తెలుసా.? వీడియో వైరల్..