News9 Global Summit: భవిష్యత్ ఆటో మొబైల్ రంగం ఎలా ఉండనుంది? న్యూస్9 సమ్మిట్‌లో ఆసక్తికర అంశాలు
టీవీ9 గ్రూప్ మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. భారత్-జర్మనీ దేశాల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా న్యూస్9 ఆధ్వర్యంలో ఇండియా-జర్మనీ గ్లోబల్ సమ్మిట్‌ను నిర్వహిస్తోంది. స్టుట్‌గాట్ నగరంలో నేటి నుంచి ప్రారంభంకానున్న ఈ సమ్మిట్‌లో ఈరోజు ఆటో మొబైల్ రంగంపై చర్చించనున్నారు. ఈ సమ్మిట్ ప్రముఖ ఆటో మొబైల్ సంస్థల సీఈఓలు హాజరుకానున్నారు..
టీవీ9 గ్రూప్ బృహత్యార్యానికి శ్రీకారం చుట్టింది. భారత్-జర్మనీ దేశాల మధ్య వాణిజ్య , ద్వైపాక్షిక, సాంస్కృతిక , క్రీడా సంబంధాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా న్యూస్9 ఆధ్వర్యంలో ఇండియా-జర్మనీ గ్లోబల్ సమ్మిట్‌ను నిర్వహిస్తోంది. జర్మనీలోని స్టుట్‌గాట్ నగరంలో ఈ సమ్మిట్ 21వ తేదీ (నేటి నుంచి) నుంచి ప్రారంభమై 23వ తేదీ వరకు కొనసాగనుంది. భారత ప్రధాని మోదీ కూడా సదస్సుకు హాజరవుతారు.
ఇప్పటికే ఇండియా-జర్మనీ గ్లోబల్ సమ్మిట్ సన్నాహక సమావేశం స్టుట్‌గార్ట్‌లో జరిగింది. TV9 నెట్‌వర్క్ ఎండీ బరుణ్‌దాస్ అధ్యక్షతన సమ్మిట్ సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. రెండు దేశాలకు చెందిన వివిధ రంగాల నిపుణులు , జర్నలిస్టులు ఈ సమావేశంలో తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సదస్సు రెండు దేశాల సుస్థిరాభివృద్దికి దోహదం చేస్తుందని టీవీ9 నెట్‌వర్క్ ఎండీ బరుణ్‌దాస్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇక ఈ సమ్మిట్‌లో ప్రధాని మోదీ.. ‘డెవలప్ ఇండియా’ కలను మరోసారి అంతర్జాతీయ వేదికపైకి తీసుకురాబోతున్నారు. రానున్న రోజుల్లో ప్రపంచంలోని అగ్రగామిగా భారత్ ఎలా నిలవనుందన్న విషయాన్ని మోదీ ఈ సమ్మిట్‌లో తెలపనున్నారు. ఇక ఈ సమ్మిట్ గురించి టీవీ9 నెట్ వర్క్ బరుణ్ దాస్ మాట్లాడుతూ.. “అవగాహన సయోధ్య పరంగా, జర్మనీతో భారతదేశ సంబంధాలు యూరోపియన్ దేశాల మధ్య ఎల్లప్పుడూ మంచివి” అని ఆయన స్పష్టంగా చెప్పారు.
ఇదిలా ఉంటే ఈ సమ్మిట్‌లో ఆటోమొబైల్ రంగంపై చర్చకు ప్రత్యేక ప్రాధాన్యత లభించనుంది. ‘ఫ్యూచర్ ఆఫ్ మొబిలిటీ’ అనే చర్చలో ఆటోమొబైల్ రంగానికి చెందిన ప్రముఖులంతా దీని గురించి మాట్లాడనున్నారు. సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల నుంచి ఎలక్ట్రిక్ కార్ల వరకు, హైబ్రిడ్ కార్ల గురించి కూడా చర్చించబోతున్నారు. మారుతీ సుజుకీ కార్పోరేట్ అఫైర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాహుల్ భారతి హాజరుకానున్నారు. బాష్ ఎస్‌డీఎస్ సీఈఓ.. దేబాషిస్ బిషోయ్, టాటా మోటార్స్ CVBU, CMO సుభ్రాంశు సింగ్‌తో పాటు మెర్సిడెస్ బెంజ్ MD-CEO సంతోష్ IR సమ్మిట్‌కు హాజరవుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..