PM Modi: గ్లోబల్ వాయిస్‌.. గత ప్రధానమంత్రుల రికార్డులనే బద్దలు కొట్టారు.. ఆ విషయంలో నరేంద్రమోదీనే టాప్..

విదేశాంగ విధానం అంటే సాధారణ ప్రజలకు సంబంధం లేదనే భావన చాలా మందిలో ఉంటుంది. కాని మోదీ ప్రధానిగా ఉన్న ఈ పదేళ్ల కాలంలో ఆ భావన తొలగిపోయింది. విదేశాంగ విధానపరంగా మోదీ సర్కారు తీసుకున్న చొరవలు అంతర్జాతీయంగా భారత్‌ స్థాయి పెంచడంతో పాటు భద్రత, ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేశాయనే చెప్పాలి.. ముఖ్యంగా మోదీ సర్కారు అనుసరిస్తున్న విదేశాంగ విధానం - ప్రపంచ దేశాల్లో భారత ఖ్యాతి మార్మోగేలా చేస్తోంది.

PM Modi: గ్లోబల్ వాయిస్‌.. గత ప్రధానమంత్రుల రికార్డులనే బద్దలు కొట్టారు.. ఆ విషయంలో నరేంద్రమోదీనే టాప్..
PM Modi
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 21, 2024 | 11:39 AM

విదేశాంగ విధానం అంటే సాధారణ ప్రజలకు సంబంధం లేదనే భావన చాలా మందిలో ఉంటుంది. కాని మోదీ ప్రధానిగా ఉన్న ఈ పదేళ్ల కాలంలో ఆ భావన తొలగిపోయింది. విదేశాంగ విధానపరంగా మోదీ సర్కారు తీసుకున్న చొరవలు అంతర్జాతీయంగా భారత్‌ స్థాయిని పెంచడంతో పాటు భద్రత, ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేశాయనే చెప్పాలి.. ముఖ్యంగా మోదీ సర్కారు అనుసరిస్తున్న విదేశాంగ విధానం – ప్రపంచ దేశాల్లో భారత ఖ్యాతి మార్మోగేలా చేస్తోంది. మోదీ సర్కారు ప్రస్థానంలో దానికి సంబంధించిన ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి… అది జీ20 అయినా.. కాప్ 19, జీ7 ఇలా ఏ వేదికైనా భారత్ విధానాలను స్పష్టంచేయడంతోపాటు.. అనేక విషయాలపై ప్రధాని మోదీ క్లారిటీ ఇస్తారు.. అందుకే.. ప్రపంచ దేశాల్లో భారత్ క్రేజ్ విపరీతంగా పెరిగిందని చెప్పవచ్చు.

రాష్ట్రానికి, దేశానికి అత్యున్నత రాజ్యాంగ పదవుల్ని నిర్వహించిన మోదీ పాలన తనకంటూ ఓ ప్రత్యేకతను, గుర్తింపును పొందారు.. దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో తన మార్క్ ను పదిలంగా ఉండిపోయేలా చేశారు.. వేదిక ఏదైనా సరే తన వాగ్దాటితో అందరినీ ఆకట్టుకుంటారు.. భారత్ లక్ష్యాలను సాధించడం కోసం ఎల్లప్పుడూ స్పష్టమైన విధానాలతో ముందుకు సాగుతారు.. అది దౌత్యం అయినా.. వార్నింగ్ అయినా.. ఆయన స్టైలే వేరు.. మూడో సారి ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న నరేంద్రమోదీ.. ప్రపంచంలోనే కీలక నేతల్లో ఆయన ఒకరిగా నిలిచిపోయారు.. అంతేకాకుండా.. మోదీ వాయిస్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తోంది.. అంతేకాకుండా.. పలు దేశాలు సైతం తమ దేశంలో పర్యటించాలని ఆహ్వానాలు అందుకున్న కీలక నేతల్లో మోదీ ఒకరు.. భారత్ వాయిస్ ను గ్లోబల్ చేసిన ఘనత మోదీకే దక్కుతుందనడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పవచ్చు.. అయితే.. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి విదేశాల్లో అత్యధిక ప్రసంగాలు చేసిన ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ మరో ఘనతను సాధించారు..

తన గయానా పర్యటన సందర్భంగా, ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 21న గయానీస్ పార్లమెంట్‌లో ప్రత్యేక సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు.. ఇది తన ప్రపంచ దౌత్య రంగంలో మరో ముఖ్యమైన ఘట్టాన్ని సూచిస్తుంది.

విదేశీ దేశాల పార్లమెంటులలో భారత ప్రజల తరపున ప్రధాని మోదీ ప్రసంగించడం ఇది 14వ సందర్భం.. విదేశీ పార్లమెంటులను ఉద్దేశించి అత్యధిక ప్రసంగాలు చేసిన భారత ప్రధానిగా నరేంద్రమోదీ మరో చరిత్రను లిఖించారు.

విదేశీ పార్లమెంటులను ఉద్దేశించి ఆయన చేసిన 14 ప్రసంగాలు మన్మోహన్ సింగ్ చేసిన ప్రసంగాల సంఖ్య కంటే రెట్టింపు.. మన్మోహన్ సింగ్ 7 ప్రసంగాలు మాత్రమే చేశారు. ఇందిరాగాంధీ నాలుగుసార్లు విదేశీ చట్టసభల్లో ప్రసంగించగా, జవహర్‌లాల్ నెహ్రూ మూడుసార్లు ప్రసంగించారు. రాజీవ్ గాంధీ, అటల్ బిహారీ వాజ్‌పేయి ఇలా రెండు ప్రసంగాలు చేయగా, మొరార్జీ దేశాయ్, పివి నర్సింహారావు వంటి వారు ఒక్కసారి మాత్రమే ప్రసంగించారు.

2014లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. సంవత్సరాలుగా, ప్రధాని మోదీ అమెరికా నుంచి యూరప్, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఆసియా వరకు ప్రపంచవ్యాప్తంగా అత్యన్నత సభలలో ప్రసంగాలు చేశారు. ఖండాంతరాలు దాటిన అతని ప్రసంగాలు.. ప్రపంచ వేదికపై భారతదేశ గుర్తింపు పెరుగుతుందనడానికి నిదర్శనం..

యుఎస్ కాంగ్రెస్ ఉమ్మడి సెషన్‌లో ప్రధానమంత్రి రెండుసార్లు ప్రసంగించారు – 2016లో, ఆపై మళ్లీ 2023లో ప్రసంగించారు.

2014లో, PM ఆస్ట్రేలియా – ఫిజీ పార్లమెంటులను ఉద్దేశించి ప్రసంగించారు.

2015లో బ్రిటన్ పార్లమెంటును ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు.

ఆఫ్రికాలో, PM 2015లో మారిషస్ జాతీయ అసెంబ్లీని, 2018లో ఉగాండా పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించారు.

ఆసియాలో, 2014లో భూటాన్ పార్లమెంట్, నేపాల్ రాజ్యాంగ సభ, 2015లో శ్రీలంక, మంగోలియా, ఆఫ్ఘనిస్తాన్ పార్లమెంట్‌లు, 2019లో మాల్దీవుల పార్లమెంటు సంయుక్త సెషన్‌లో ప్రధాని మోదీ ప్రసంగించారు.

తాజాగా.. ప్రధాని మోదీ.. గయానాలో పర్యటించడంతోపాటు.. అక్కడి పార్లమెంట్ ను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. 1968 తర్వాత భారత ప్రధాని గయానాలో పర్యటించడం ఇదే తొలిసారి..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బలవంతంగా రోహిత్ రిటైర్మెంట్‌.. మెల్‌బోర్న్ చేరుకున్న అగార్కర్?
బలవంతంగా రోహిత్ రిటైర్మెంట్‌.. మెల్‌బోర్న్ చేరుకున్న అగార్కర్?
సంభాల్‌ లో కొనసాగుతోన్న అన్వేషణ.. ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ది
సంభాల్‌ లో కొనసాగుతోన్న అన్వేషణ.. ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ది
మరోసారి పల్లెటూరి అమ్మాయిగా సాయి పల్లవి.
మరోసారి పల్లెటూరి అమ్మాయిగా సాయి పల్లవి.
అదిరిపోయిన సోలార్‌ కార్‌.. 50 పైసల ఖర్చుతో కిలోమీటర్‌ ప్రయాణం
అదిరిపోయిన సోలార్‌ కార్‌.. 50 పైసల ఖర్చుతో కిలోమీటర్‌ ప్రయాణం
మనాలిలో భారీ హిమపాతం.. సోలంగ్నాలో 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
మనాలిలో భారీ హిమపాతం.. సోలంగ్నాలో 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
ఫాలో ఆన్ ప్రమాదంలో భారత్.. ఆశలన్నీ తెలుగబ్బాయ్‌పైనే
ఫాలో ఆన్ ప్రమాదంలో భారత్.. ఆశలన్నీ తెలుగబ్బాయ్‌పైనే
ప్రదోష వ్రతం రోజున రుద్రాభిషేకం ఎలా చేయాలి? శుభ సమయం ఎప్పుడంటే
ప్రదోష వ్రతం రోజున రుద్రాభిషేకం ఎలా చేయాలి? శుభ సమయం ఎప్పుడంటే
ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన
పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన
మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!