AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

News9 Global Summit: ఇండియా-జర్మనీ గ్లోబల్‌ సమ్మిట్‌కు 200 మంది ప్రతినిధులు..ఈ ఈవెంట్‌లో అవే హైలెట్..

మూడు రోజుల పాటు జరిగే ఈ గ్లోబల్ సమ్మిట్‌ ఈవెంట్‌లో భారత్ జర్మనీ కార్పొరేట్ ప్రపంచంలోని ప్రముఖులు పాల్గొనున్నారు. జర్మన్ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ కూడా హాజరుకానున్నారు. మొదటి శిఖరాగ్ర సమావేశంలో భారతదేశానికి ఓలాఫ్ స్కోల్జ్ వచ్చిన సంగతి తెలిసిందే

News9 Global Summit: ఇండియా-జర్మనీ గ్లోబల్‌ సమ్మిట్‌కు 200 మంది ప్రతినిధులు..ఈ ఈవెంట్‌లో అవే హైలెట్..
News9 Global Summit
Velpula Bharath Rao
|

Updated on: Nov 21, 2024 | 8:02 AM

Share

టీవీ నైన్ నెట్‌వర్క్ న్యూస్9 గ్లోబల్ సమ్మిట్‌తో భారత్-జర్మనీల మధ్య దౌత్య, ఆర్థిక సంబంధాలు కొనసాగుతున్నాయి. ఈ సమ్మిట్ మొదటి ఎడిషన్ ఈ సంవత్సరం ప్రారంభంలో ఢిల్లీలో నిర్వహించబడింది. రెండో శిఖరాగ్ర సమావేశం ఈసారి అంతర్జాతీయంగా జరగనుంది. రెండవ ఎడిషన్ నవంబర్ 21-23 తేదీలలో స్టట్‌గార్ట్‌లోని MHP అరేనాలో జరగనుంది. ‘ఇండియా, ఇన్‌సైడ్ ది గ్లోబల్ బ్రైట్ స్పాట్’ పేరుతో జరిగే ఈ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు.

సమ్మిట్ జర్మన్ ఎడిషన్ భారతదేశాన్ని అంతర్జాతీయ స్థాయిలో, ముఖ్యంగా యూరోపియన్ ప్రేక్షకులకు ప్రదర్శించడానికి ఇది ఒక అవకాశం. మూడు రోజుల పాటు జరిగే ఈ మెగా ఈవెంట్‌లో భారత్ జర్మనీ కార్పొరేట్ ప్రపంచంలోని ప్రముఖులు హాజరుకానున్నారు. జర్మన్ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ ఇక్కడ హాజరుకానున్నారు. మొదటి శిఖరాగ్ర సమావేశంలో స్కోల్జ్ అతని బృందం కూడా భారతదేశంలో పెట్టుబడికి ప్రధాన వేదికగా గుర్తించింది. ఇండియా-జర్మనీ గ్లోబల్‌ సమ్మిట్‌కు 200 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు.

న్యూస్ నైన్ సమ్మిట్ వ్యాపారం, ఆర్థిక వ్యవస్థ, సాంకేతికత, క్రీడలు, సంస్కృతి-చాలా అంశాలపై దృష్టి సారిస్తుంది. కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, జ్యోతిరాదిత్య సింధియా భారత ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తారు. మరోవైపు, జర్మనీ ప్రభుత్వం తరపున మంత్రి విన్‌ఫ్రైడ్ క్రెట్ష్‌మన్ హాజరుకానున్నారు. ఈ సమ్మిట్‌లో క్రీడలు ఒక ముఖ్యమైన భాగం కానున్నాయి. ఏ దేశంలోనైనా క్రీడలు,  వినోదం ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.

ఈ సెషన్‌లో కాన్‌స్టాంటిన్ ఫిల్మ్ AG మేనేజింగ్ డైరెక్టర్ ఫ్రెడరిక్ రాడ్‌మాన్, బాడెన్-వుర్టెంబర్గ్ ఫిల్మ్ ఆఫీస్ బోర్డు ఛైర్మన్ ఆలివర్ మాన్, టిబెటన్ బ్లూ అడ్వైజరీ సర్వీస్ వ్యవస్థాపకుడు జాయ్ ఫ్రాంకోవిచ్, VFB స్టట్‌గార్ట్‌లోని యూత్ డెవలప్‌మెంట్ డైరెక్టర్ స్టీఫన్ హిల్డెబ్రాండ్ హాజరవుతారు. నవంబర్ 22న, రాత్రి 9 గంటలకు ప్రారంభమయ్యే టీవీ-నైన్ నెట్‌వర్క్ ప్రసారాలు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో నరేంద్ర మోదీ ప్రసంగాన్ని ప్రత్యక్షంగా వీక్షించనున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా