AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Winter Health Tips: ఈ 3 రకాల మురబ్బాలు తినే ఆహారంలో చేర్చుకోండి.. సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టండి..

శీతాకాలంలో ఆరోగ్యంపై మరింత శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. ఈ సీజన్‌లో వైరల్ ఇన్‌ఫెక్షన్, దగ్గు, జలుబు వంటి సమస్యలు రావచ్చు. అటువంటి పరిస్థితిలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి తినే ఆహారంలో ఉసిరి తో పాటు వీటిని చేర్చుకోండి..

Winter Health Tips: ఈ 3 రకాల మురబ్బాలు తినే ఆహారంలో చేర్చుకోండి.. సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టండి..
Winter Food Tips
Surya Kala
|

Updated on: Nov 21, 2024 | 6:06 PM

Share

చలికాలంలో రకరకాల వంటకాలు తినాలనిపిస్తుంది. ప్రజలు ఈ సీజన్‌ను ఎంతగా ఇష్టపడతారో..అదే సమయంలో అనేక సవాళ్లను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు దగ్గు, జలుబుతో బాధపడుతూ ఉంటారు. చల్లని వాతావరణంలో శరీరం వెచ్చగా ఉండేలా పోషకాహారాన్ని తినాలని తరచుగా సలహా ఇస్తారు. ఈ సీజన్‌లో మురబ్బాను తప్పనిసరిగా తినే ఆహారంలో చేర్చుకోవాలి. ఇవి శరీరానికి వ్యాధులతో పోరాడే శక్తిని ఇస్తాయి. పోషకాహార నిపుణుడు నమామి అగర్వాల్ మాట్లాడుతూ చలికాలంలో ఉసిరికాయ, క్యారెట్ లతో మురబ్బాలు తయారు చేస్తారు. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. చలికాలంలో ఏ మురబ్బా తినడం వలన ఆరోగ్యానికి మంచిదో నిపుణుల చెప్పిన విషయాలు తెలుసుకుందాం.

క్యారెట్ జామ్

క్యారెట్ దొరికే సీజన్ శీతాకాలం. ఇందులో విటమిన్ ఏ, బీటా కెరోటిన్ వంటి అనేక పోషకాలు ఉన్నాయి. తినడానికి రుచికరంగా ఉండే క్యారెట్ మురబ్బా కళ్లను ఆరోగ్యంగా ఉంచడమే కాదు రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

అల్లం జామ్

అల్లం వేడి స్వభావం కలిగి ఉంటుంది. అందుకే చలికాలంలో దీన్ని తినడం వల్ల శరీరం వెచ్చగా ఉంటుంది. అల్లాన్ని పచ్చిగా తినడానికి ఇష్టపడకపోతే.. రోగనిరోధక శక్తిని బలోపేతం చేసుకోవడానికి శీతాకాలంలో అల్లం మురబ్బాను కూడా తినవచ్చు. ఇది మిమ్మల్ని వ్యాధుల నుంచి కాపాడుతుంది.

ఇవి కూడా చదవండి

ఆమ్లా మురబ్బా

ఉసిరిని శీతాకాలపు సూపర్ ఫుడ్ అంటారు. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్ ఇది వ్యాధుల నుంచి రక్షణను అందిస్తుంది. చలికాలం ఉదయం ఆహారంతో పాటు రోజూ ఒక ఉసిరి జామ్ తినడం కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

అయితే పరిమిత పరిమాణంలో ఈ మురబ్బాను తింటే మాత్రమే మీరు దీని ప్రయోజనాలను పొందుతారని నిపుణులు కూడా చెబుతున్నారు. ఎందుకంటే వీటి తయారీలో చక్కెరను ఉపయోగిస్తారు. అటువంటి పరిస్థితిలో ఎక్కువ సంఖ్యలో మురబ్బాలను తింటే శరీరంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. తినేటప్పుడు జామ్ నుంచి అదనపు సిరప్ తొలగించండి. మురబ్బాలను తిన్న వెంటనే నీరు త్రాగవద్దు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి