Fruits in Fridge: ఫ్రిడ్జ్‌లో ఈ ఫ్రూట్స్ పెడుతున్నారా.. వీటిని తిన్నా వృథానే!
పండ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిని తినడం వల్ల అనేక పోషకాలు శరీరానికి అందుతాయి. అయితే పండ్లు నిల్వ ఉండటం కోసం చాలా మంది ఫ్రిడ్జ్‌లో పెడతారు. కానీ కొన్నింటిని మాత్రం అస్సలు ఫ్రిడ్జ్‌లో పెట్టకూడదు. వీటిని తిన్నా ఎలాంటి ప్రయోజనం ఉండదు..
Updated on: Nov 21, 2024 | 6:31 PM

ఫ్రిడ్జ్‌లో అన్నీ తోసేయడం మనకు ఉండే అలవటు. అందులో ఏది పెట్టొచ్చో.. లేదో చాలా మందికి తెలీదు. అన్నీ పెడుతూనే ఉంటారు. అవీ ఇవీ కలిపేసి పెడుతూ ఉంటారు. ఇందులో ఫ్రూట్స్ కూడా ఒకటి. కొన్ని రకాల ఫ్రూట్స్ మాత్రమే ఫ్రిడ్జ్‌లో పెట్టాలి. కానీ కొంత మంది తెలీక అన్నీ పెట్టేస్తారు. వీటిని ఎలా ఉంచాలో కూడా తెలీదు.

అవకాడోని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేయకూడదు. ఫ్రిడ్జ్‌లో పెట్టడం వల్ల దీని రుచి సరిగా ఉండదు. రుచిని కోల్పోతుంది. కేవలం గది ఉష్ణోగ్రత వద్ద మాత్రమే ఉంచాలి. అయితే పచ్చి అవకాడోల కంటే పండిపోయినవి మాత్రం ఫ్రిడ్జ్‌లో పెట్టవచ్చు.

ఫ్రిడ్జ్‌లో పెట్టకూడని పండ్లలో పైనాపిల్ కూడా ఒకటి. పైనాపిల్ కూడా ఫ్రిడ్జ్‌లో నిల్వ ఉంచకూడదు. ఇలా ఉండటం వల్ల పైనాపిల్ తిన్నా ఎలాంటి ప్రయోజనాలు అందవు.

అదే విధంగా సిట్రస్ పండ్లు కూడా ఫ్రిడ్జ్‌లో పెట్టకూడదు. నిమ్మ, నారింజ, బత్తాయి, కమల, ఆరెంజ్ పండ్లు కూడా ఫ్రిడ్జ్‌లో నిల్వ చేయకూడదు. కేవలం బయట మాత్రమే ఉంచాలి. ఫ్రిడ్జ్‌లో పెడితే వీటి రుచి పోతుంది.

అంతే కాకుండా అరటి పండ్లు, టమాటాలు కూడా ఫ్రిడ్జ్‌లో పెట్టకూడదు. వీటిని పెట్టడం వల్ల ఇవి రుచిని కోల్పోతాయి. వీటిని తర్వాత ఉపయోగించినా ఎలాంటి ప్రయోజనం కూడా ఉండదు. పోషకాలు కూడా నశిస్తాయి.




