- Telugu News Photo Gallery Do this to get rid of sleepiness during cold season, Check Here is Details
Sleep intoxication: చలి కాలంలో నిద్ర మత్తు వదలాలంటే ఇలా చేయండి..
చలి కాలం వచ్చిందంటే చాలా మంది ఎదుర్కొనే సమస్యల్లో నిద్ర మత్తు కూడా ఒకటి. నిద్ర మత్తు కారణంగా సమయానికి లేవరు. ఆ తర్వాత అన్నీ లేటుగానే అవుతాయి. కాబట్టి నిద్ర మత్తు వదలాంటే ఈ చిట్కాలు ట్రై చేయండి..
Updated on: Nov 21, 2024 | 5:00 PM

చలి కాలంలో వచ్చిదంటే.. అసలు ఏమీ చేయాలనిపించదు. ఈ సీజన్‌లో అన్ని పనులు కూడా చాలా ఆలస్యంగా నడుస్తాయి. చాలా బద్ధకంగా అనిపిస్తుంది. ఒక్కోసారి అసలట, నీరసంగా కూడా ఉంటుంది. ఎక్కువగా నిద్ర మత్తు వస్తుంది. అందులోనూ ఉదయం నిద్ర లేవాలంటే యుద్ధమే చేయాలి.

మెలటోనిన్ కంటెంట్ కారణంగా చెర్రీ రసం మెరుగైన నిద్రను ప్రోత్సహిస్తుందని చెబుతున్నారు. మెలటోనిన్‌ను సాధారణంగా 'స్లీప్ హార్మోన్' అని పిలుస్తారు. ఎప్పుడు నిద్రపోవాలో, ఎప్పుడు నిద్ర లేవాలో నిర్ణయించడంలో ఇది శరీరంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది.

ఉదయాన్నే లేవాలని అలారమ్ పెట్టుకుంటారు. చాలా మంది చేసే తప్పు ఏంటంటే.. మోగిన అలారాన్ని ఆపివేసి మళ్లీ పడుకుంటారు. కొంత మంది స్నూజ్ చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల నిద్ర మత్తు పోదు.

నిద్ర వెంటనే పోవాలంటే లేవగానే నీటిని తాగండి. నీరు తాగడం కూడా మంచిదే. ముఖాన్ని నీళ్లతో కడిగినా నిద్ర ఎగిరిపోతుంది. చాలా మందికి బెడ్ టీ తాగే అలవాటు ఉంటుంది. కాబట్టి ముందు ఈ అలవాటును మానుకోవాలి.

చలి కాలంలో నిద్ర మత్తు పోవాలంటే.. చల్ల నీటితో స్నానం చేయాలి. ఇలా చేయాలంటే కాస్త కష్టమే అయినా సరే.. చల్లనీటితో స్నానం చేయడం వల్ల ఒత్తిడి, అలసట, కండరాల నొప్పులు తగ్గుతాయి.




