Interesting News: పూజలు చేసే సమయంలో ఉల్లి, వెల్లుల్లి తినకూడదని ఎందుకు అంటారు..
సాధారణంగా కార్తీక మాసం, శ్రావణ మాసం, నవరాత్రుల్లో ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారు. హిందువులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ రోజుల్లో తమ ఆరాధ్య దైవాలను ప్రార్థిస్తూ ఉంటారు. ఇలా ప్రత్యేకంగా పూజలు, ఉపవాసాలు చేసే సమయంలో ఉల్లిపాయలు, వెల్లుల్లి పాయలను తినకూడదని అంటూ ఉంటారు. ఈ పూజలు చేసే రోజుల్లో చాలా వరకు వెల్లుల్లి, ఉల్లిపాయలను వంట్లో ఉపయోగించారు. ఇలా పూర్వం నుంచి చాలా మంది పాటిస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ విషయం చాలా..
సాధారణంగా కార్తీక మాసం, శ్రావణ మాసం, నవరాత్రుల్లో ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారు. హిందువులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ రోజుల్లో తమ ఆరాధ్య దైవాలను ప్రార్థిస్తూ ఉంటారు. ఇలా ప్రత్యేకంగా పూజలు, ఉపవాసాలు చేసే సమయంలో ఉల్లిపాయలు, వెల్లుల్లి పాయలను తినకూడదని అంటూ ఉంటారు. ఈ పూజలు చేసే రోజుల్లో చాలా వరకు వెల్లుల్లి, ఉల్లిపాయలను వంట్లో ఉపయోగించారు. ఇలా పూర్వం నుంచి చాలా మంది పాటిస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ విషయం చాలా మందికి తెలీదు. ఇలా ప్రత్యేమైన రోజులు, పూజలు చేసే సమయంలో వెల్లుల్లి, ఉల్లి తినకూడదని ఎందుకు అంటారో చాలా మందికి తెలీదు. ఆ విషయాలు ఇప్పుడు తెలసుకుందాం.
వేడి చేసే గుణాన్ని కలిగి ఉంటాయి..
వెల్లుల్లి, ఉల్లిపాయలు తామసిక స్వభావాన్ని కలిగి ఉంటాయి. అంటే ఇవి వేడి చేసే ఆహారలు. వీటిని తినడం వల్ల శరీరంలో పిత్త దోషాన్ని పెంచుతాయి. అందుకే శ్రావణ మాసం, నవరాత్రులు, కార్తీక మాసాల్లో చాలా మంది ఉల్లిపాయ, వెల్లుల్లిని ఉపయోగించరు. ఉపవాసాలు ఉన్నప్పుడు శరీర ఉష్ణోగ్రతను సమత్యులంగా ఉంచుకోవాలి. కాబట్టి శరీరాన్ని చల్లబరిచే ఆహారాలు తీసుకోవాలి. దీని వల్ల మొత్తం ఆరోగ్యం బాగుంటంది. వెల్లుల్లి, ఉల్లిపాయ వేడి సంబంధిత లక్షణాలు కలగచేస్తాయి. దీని వల్ల మీరు పూజలు సరిగా చేయలేరు. కాబట్టి వీటిని తీసుకోవద్దని పెద్దలు చెబుతూ ఉంటారు.
మానసిక ఆరోగ్యంపై ప్రభావం:
ఆయుర్వేదం ప్రకారం.. వెల్లుల్లి, ఉల్లిపాయలు తినడం వల్ల మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం పడుతుంది. ఇవి మనిషిని, మనసును పరధ్యానంగా ఉండేలా ప్రేరేపిస్తాయి. దీని వల్ల పూజల్లో మీరు దృష్టి ఉంచలేరు. పూజపై ఏకాగ్రతను పెట్టలేరు. కాబట్టి పూజలు చేసే ప్రత్యేకమైన రోజుల్లో వెల్లుల్లి, ఉల్లిపాయలను దూరంగా పెడితే సరిపోతుంది. ప్రాచీన కాలం నుంచి కూడా ఇది ఆచారంగా వస్తుంది. ఇప్పటికీ చాలా మంది.. శ్రావణ మాసం, నవరాత్రులు, కార్తీక మాసాల్లో ఉల్లిపాయ, వెల్లుల్లిని ఆహారంలో చేర్చుకోరు. అయ్యప్ప మాలలు, భవానీ మాలలు ధరించే వారు కూడా ఉల్లిపాయలు, వెల్లుల్లిని తీసుకోరు.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..