Coconut Oil: కొబ్బరి నూనెతో క్యారీ బ్యాగ్స్, డార్క్ సర్కిల్స్‌ని మాయం చేసేయండి..
కొబ్బరి నూనె గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. కొబ్బరి నూనె నిత్యవసర వస్తువు. అందరి ఇంట్లో ఉండే కామన్ వస్తువు. తలకు కొబ్బరి నూనె పెట్టుకోవడం చాలా ముఖ్యం. కొబ్బరి నూనెతో ఆరోగ్యాన్ని, అందాన్ని కూడా పెంచుకోవచ్చు. అందుకే కేరళ రాష్ట్ర ప్రజలకు ఎక్కువగా వంటల్లో కూడా కొబ్బరి నూనె, కొబ్బరి ఉండేలా చూసుకుంటారు. చర్మ అందాన్ని, జుట్టు ఆరోగ్యాన్ని కాపాడటంలో ఆ ఆయిల్ చక్కగా సహాయ పడుతుంది. కొబ్బరి నూనెలో పలు ఔషధ గుణాలు..
కొబ్బరి నూనె గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. కొబ్బరి నూనె నిత్యవసర వస్తువు. అందరి ఇంట్లో ఉండే కామన్ వస్తువు. తలకు కొబ్బరి నూనె పెట్టుకోవడం చాలా ముఖ్యం. కొబ్బరి నూనెతో ఆరోగ్యాన్ని, అందాన్ని కూడా పెంచుకోవచ్చు. అందుకే కేరళ రాష్ట్ర ప్రజలకు ఎక్కువగా వంటల్లో కూడా కొబ్బరి నూనె, కొబ్బరి ఉండేలా చూసుకుంటారు. చర్మ అందాన్ని, జుట్టు ఆరోగ్యాన్ని కాపాడటంలో ఆ ఆయిల్ చక్కగా సహాయ పడుతుంది. కొబ్బరి నూనెలో పలు ఔషధ గుణాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో కూడా కొబ్బరి నూనె పలు రకాల సమస్యలు తగ్గించడానికి ఉపయోగిస్తూ ఉంటారు. అదే విధంగా ఇప్పుడున్న కాలంలో చాలా మంది కళ్ల కింద క్యారీ బ్యాగ్స్, డార్క్ సర్కిల్స్‌తో ఇబ్బంది పడుతూ ఉంటున్నారు. ఈ సమస్యలను తగ్గించడంలో కొబ్బరి నూనె బాగా సహాయ పడుతుంది. మరి ఈ నూనెను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు చూద్దాం.
ముడతలు తగ్గాలంటే..
కొల్లాజెన్‌ను బూస్ట్ చేయడంలో కొబ్బరి నూనె హెల్ప్ చేస్తుంది. దీంతో చర్మం ఎంతో సాఫ్ట్‌గా, గ్లోగా కనిపిస్తుంది. ఇందులో ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. కంటి కింద రాస్తే, ముఖంపై తరచూ రాస్తూ ఉండే ముడతలు కూడా తగ్గుతాయి. అంతే కాకుండా త్వరగా రాకుండా ఉంటాయి. ముఖ సౌందర్యం కూడా పెరుగుతుంది.
కళ్ల చుట్టూ మంట తగ్గాలంటే..
ఒక్కో సారి కంటి చుట్టూ మంటగా అనిపిస్తూ ఉంటుంది. ఈ మంటను తగ్గించడంలో కోకోనట్ ఆయిల్ బెస్ట్‌గా వర్క్ చేస్తుంది. కంటి చూట్టూ కొబ్బరని నూనె రాస్తే మంట నుంచి ఉపశమనం వస్తుంది.
పొడి చర్మం పోవాలంటే..
డ్రై స్కిన్‌తో బాధ పడేవారు ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు కొబ్బరి నూనె రాసుకుని పడుకోవాలి. ఉదయం లేచిన తర్వాత స్నానం చేస్తే చాలు. రాత్రి కుదరని వాళ్లు ఉదయం స్నానంకి ఓ గంట ముందు కూడా శరీరానికి అప్లై చేసి కూడా చేయవచ్చు.
డార్క్ సర్కిల్స్:
డార్క్ సర్కిల్స్ సమస్యతో ఇబ్బంది పడేవారు ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు కంటి చుట్టూ కొబ్బరి నూనె రాసి మర్దనా చేయాలి. ఇలా చేస్తే డార్క్ సర్కిల్స్, క్యారీ బ్యాగ్స్, కంటి కింద ముడతలు తగ్గుతాయి. కొబ్బరి నూనె నేచురల్ బ్లీచింగ్‌లా పని చేస్తుంది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..