Forehead Wrinkles: చిన్నవయసులోనే నుదుటిపై ముడతలా.? ఏం చేయాలంటే..
వయసు పెరిగే కొద్దీ చర్మం పొడిబారుతుంది, దీంతో చర్మం మృదుత్వాన్ని కోల్పోతుంది. దీనివల్ల నుదుటిపై గీతలు ఏర్పడడం మొదలవుతాయి. అయితే ఇది చిన్న వయసులో కనిపించడాన్ని 'ప్రీమెచ్యూర్ రింకిల్స్' అంటారు. చర్మం పల్చగా ఉన్న వారిలో ముడతలు చిన్న వయసులో రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు...
వయసుతో పాటు ముఖంపై ముడతలు రావడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా నుదుటిపై ముడతలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. అయితే వయసు మళ్లిన తర్వాత ఈ సమస్య కనిపిస్తే పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ.. చిన్న వయసులోనే ముడతలు వస్తే మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ చిన్న వయసులోనే నుదుటిపై ముడతలు రావడానికి ప్రధాన కారణం ఏంటి.? ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో ఇప్పుడు తెలుసుకుందాం..
వయసు పెరిగే కొద్దీ చర్మం పొడిబారుతుంది, దీంతో చర్మం మృదుత్వాన్ని కోల్పోతుంది. దీనివల్ల నుదుటిపై గీతలు ఏర్పడడం మొదలవుతాయి. అయితే ఇది చిన్న వయసులో కనిపించడాన్ని ‘ప్రీమెచ్యూర్ రింకిల్స్’ అంటారు. చర్మం పల్చగా ఉన్న వారిలో ముడతలు చిన్న వయసులో రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. వంశపారంపర్యంగా, ఎండలో ఎక్కువ సేపు తిరిగే వారిలో ఈ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. అంతేకాకుండా పదే పదే నుదురు చిట్లిస్తుండడం, కనుబొమ్మల్ని పైకి ఎగరేయడం వంటి వాటి వాల్ల కూడా ముడతలు ఏర్పడే అవకాశం ఉందని అంటున్నారు. డ్రై స్కిన్‌తో బాధపడేవారిలో కూడా ఈ లక్షణాలు కనిపిస్తాయి.
సమస్య నుంచి ఎలా బయటపడాలంటే..
నుదుటిపై ముడతలు రాకుండా ఉండాలంటే శరీరంలో డీహైడ్రేషన్‌కు గురికాకుండా చూసుకోవాలి. ఇందుకోసం ప్రతీ రోజూ బాగా నీరు తాగాలి. మరీ ముఖ్యంగా నిమ్మరసం తీసుకోవడం వల్ల శరీరం హైడ్రేట్‌గా ఉంటుంది. ఇక ఎండలో ఎక్కువగా తిరిగే వారు సన్‌స్క్రీన్ లోషన్స్‌ను ఉపయోగించాలి. ముఖ్యంగా బయటకు వెళ్లే ముందు కచ్చితంగా స్క్రీన్ లోషన్ అప్లై చేసుకోవాలి. దీనివల్ల సాధారణంగా చర్మంపై వచ్చే ముడతలు సైతం కంట్రోల్ అవుతాయి.
విపరీతమైన ఒత్తిడి కారణంగా కూడా నుదుటిపై ముడతలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడిని కంట్రోల్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇందుకోసం యోగా, మెడిటేషన్ వంటి వాటిని అలవాటు చేసుకోవాలి. ముఖ్యంగా తీసుకునే ఆహారంలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా గ్రీన్ టీ, పాలకూర, వాల్‌నట్స్, చిలగడ దుంప, బ్లూ బెర్రీ వంటివి ఉండేలా చూసుకోవాలి. చర్మం పొడిబారకుండా ఉండాలంటే ఆకు కూరలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలని చెబుతున్నారు. ముఖానికి సంబంధించిన వ్యాయామాలు చేయడం ద్వారా కూడా ముడతల సమస్య నుంచి బయటపడొచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..