Fish: ఆ చేపలతో అందం కూడా సొంతం.. వారంలో ఒక్కరోజు తిన్నా చాలు..

చేపలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని తెలిసిందే. ముఖ్యంగా కొలెస్ట్రాల్ తక్కువగా ఉండే చేపలను ఆహారంలో భాగం చేసుకోవడంలో గుండె సంబంధిత సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. అయితే సాల్మన్‌ చేపలను తీసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు...

Fish: ఆ చేపలతో అందం కూడా సొంతం.. వారంలో ఒక్కరోజు తిన్నా చాలు..
అనేక రకాల సీఫుడ్‌లలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు తక్కువ మొత్తంలో ఉంటాయి. కొవ్వు చేపలలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఇవి గుండెకు చాలా మేలు చేస్తాయి.
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 03, 2024 | 3:00 PM

చేపలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని తెలిసిందే. ముఖ్యంగా కొలెస్ట్రాల్ తక్కువగా ఉండే చేపలను ఆహారంలో భాగం చేసుకోవడంలో గుండె సంబంధిత సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. అయితే సాల్మన్‌ చేపలను తీసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. వారంలో ఒక్క రోజు ఈ చేపలను తిన్నా సరే చర్మ సమస్యలన్నీ బలదూర్‌ అవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ సాల్మన్ చేపలను తీసుకోవడం వల్ల చర్మానికి కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

వయసుతో పాటు వచ్చే చర్మం ముడతల సమస్యకు సాల్మన్‌ చేపలు బాగా ఉపయోగపడాతాయి. ఇది చర్మానికి కావాల్సి ఆర్థ్రీకరణ పెంచడంలో తోడ్పడుతుంది. ఇక సాల్మన్‌ చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. చర్మం మృదువుగా మారడంలో కూడా సాల్మన్‌ చేపలు ఉపయోగపడతాయి. ఇందులోని ఆరోగ్యకరమైన కొవ్వులు చర్మం తేమను కాపాడడంలో ఉపయోగపడతాయి. చర్మాన్ని డ్రై కాకుండా కాపడుతుంది. తేమను లాక్‌ చేస్తుంది.

సాల్మన్‌ చేపలను క్రమంతప్పకుండా తీసుకోవడం వల్ల మొటిమలు కంట్రోల్‌ అవుతాయి. అలాగే వీటివల్ల కొల్లాజెన్‌ ఉత్పత్తిని పెంచుతుంది. ఇది చర్మాన్ని యవ్వనంగా, దృఢంగా మార్చడంలో ఉపయోగపడుతుంది. సాల్మన్‌ చేపల్లో విటమిన్‌ డీ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మాన్ని కాంతివంతంగా మార్చడంలో ఉపయోగపడుతుంది. స్కిన్‌ హీలింగ్‌గా ఉపయోగపడి, మచ్చలు తగ్గేలా చేస్తాయి. కాబట్టి చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా సాల్మన్‌ చేపలను తీసుకోవాలని చెబుతున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

ఈ ఏడాది సంక్రాంతి ఎప్పుడు ? స్నానం, దానం శుభ సమయం ఎప్పుడంటే
ఈ ఏడాది సంక్రాంతి ఎప్పుడు ? స్నానం, దానం శుభ సమయం ఎప్పుడంటే
ఆ వ్యాన్‌లో ఉన్నది ఫర్నీచర్ కాదు గురూ..!
ఆ వ్యాన్‌లో ఉన్నది ఫర్నీచర్ కాదు గురూ..!
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
17 ఏళ్లకే ఎంట్రీ ఇచ్చి స్టార్.. కట్ చేస్తే 24ఏళ్లకే కెరీర్ క్లోజ్
17 ఏళ్లకే ఎంట్రీ ఇచ్చి స్టార్.. కట్ చేస్తే 24ఏళ్లకే కెరీర్ క్లోజ్
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ అంటున్న రష్మిక.. కన్నప్ప సినిమా అప్డేట్
సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ అంటున్న రష్మిక.. కన్నప్ప సినిమా అప్డేట్
గురు శిష్య గ్రహాల యుతి.. ఆ రాశుల వారికి కనక వర్షం..!
గురు శిష్య గ్రహాల యుతి.. ఆ రాశుల వారికి కనక వర్షం..!
50 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్‌గా, చలాకీగా ఉండాలా.. ఈ టిప్స్ మీ కోసం
50 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్‌గా, చలాకీగా ఉండాలా.. ఈ టిప్స్ మీ కోసం
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో