AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Comedian Ali: ఆస్పత్రిలో అలీ భార్య.. వెక్కి వెక్కి ఏడ్చిన స్టార్ కమెడియన్.. వీడియో వైరల్.. ఏం జరిగిందంటే?

ప్రముఖ నటుడు అలీ సతీమణి జుబేదా ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటోంది. ఈ విషయాన్ని స్వయంగా జుబేదానే సోషల్ మీడియా ద్వారా అందరితో షేర్ చేసుకున్నారు. ఈ క్రమంలో భార్య పరిస్థితిని చూసి అలీ ఏడుస్తున్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

Comedian Ali: ఆస్పత్రిలో అలీ భార్య.. వెక్కి వెక్కి ఏడ్చిన స్టార్ కమెడియన్.. వీడియో వైరల్.. ఏం జరిగిందంటే?
Ali Family
Basha Shek
|

Updated on: Oct 26, 2026 | 6:12 PM

Share

తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు అలీ. ఛైల్డ్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఆయన ఆ తర్వాత హీరోగానూ, కమెడియన్ గానూ కొన్ని వందల సినిమాల్లో నటించారు. తన నటనతో తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. కేవలం నటుడిగానే కాదు యాంకర్ గానూ సత్తా చాటారు అలీ. మధ్యలో రాజకీయాల్లోకి వెళ్లి సినిమాలకు దూరమైనా మళ్లీ కెమెరా ముందుకు వచ్చారు. వరుస సినిమాలతో మళ్లీ బిజీ బిజీగా మారారు. అలీ సంగతి పక్కన పెడితే.. ఆ నటుడి భార్య జుబేదా కూడా ఆడియెన్స్ కు బాగా పరిచయమే. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఆమె చాలా యాక్టివ్ గా ఉంటారు. తన సొంత యూట్యూబ్ ఛానెల్ వేదికగా వంటలకు సంబంధించిన వీడియోలతో పాటు తన ఫ్యామిలీకి సంబంధించిన అన్ని విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉన్నారు. అయితే తాజాగా అలీ సతీమణి జుబేదా తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. గుండెకు సంబంధించిన సమస్యలు తలెత్తడంతో ఆమెకు హార్ట్ సర్జరీ చేయించాల్సి వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా జుబేదా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

జుబేదాకు హార్ట్ సర్జరీ సక్సెస్ అయ్యిందని తెలుస్తోంది. ప్రస్తుతం ఐసీయూలోనే ఉంటోన్న ఆమె క్రమంగా కోలుకుంటున్నారు. అయితే ఎంతో చలాకీగా ఉండే తన భార్య ఇప్పుడు ఆస్పత్రిలో ఉండడం చూసి అలీ చిన్న పిల్లాడిలాగా వెక్కి వెక్కి ఏడ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. దీనిని చూసిన సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు కూడా బాగా ఎమోషనల్ అవుతున్నారు. అలీ భార్య త్వరగా కోలుకోవాలని కామెంట్స్ పెడుతున్నారు.  కాగా 1994 జనవరి 23న జుబేదా సుల్తానా బేగం- అలీల వివాహం జరిగింది.  ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు  ఉన్నారు.  ఫాతిమా రమీజున్, జువేరియా మీథీ అనే ఇద్దరు కుమార్తెలు,  మహమ్మద్ అబ్దుల్ సుభాన్ అనే ఒక కుమారుడు ఉన్నారు.

వీడియో ఇదిగో..

ఇవి కూడా చదవండి

ఇక సినిమాల విషయానికి వస్తే.. ఇటీవలే మహేంద్రగిరి వారాహి అనే సినిమాలో నటించారు అలీ. ఇందులో అక్కినేని సుమంత్ హీరోగా చేశారు. స్టార్ కమెడియన్లు బ్రహ్మానందం, వెన్నెల కిశోర్ తో పాటు అలీ ఇందులో కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం అలీ చేతుల్లో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. అలాగే బుల్లితెరపై హోస్ట్ గానూ రాణిస్తున్నారీ స్టార్ కమెడియన్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us