AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బంగారం దుఖాణంలో నగలను పింక్‌ పేపర్‌లో ఎందుకు చుట్టి ఇస్తారో తెలుసా? అసలు సీక్రెట్ ఇదే..

బంగారు దుకాణాల్లో చిన్న ముక్కు పుడక నుంచి పెద్ద ఆభరణాల దుకాణాల వరకు ఏదీ కొనుగోలు చేసినా సిబ్బంది ఆభరణాలను పింక్ కాగితంలో చుట్టి క్యారీ బ్యాగ్‌లో చుట్టి ఇస్తారు. అసలు బంగారు నగలు ఇలా పింక్ కాగితంలో ఎందుకు చుడతారో మీకు తెలుసా?..

బంగారం దుఖాణంలో నగలను పింక్‌ పేపర్‌లో ఎందుకు చుట్టి ఇస్తారో తెలుసా? అసలు సీక్రెట్ ఇదే..
Wrap Gold And Silver In Pink Paper
Srilakshmi C
|

Updated on: Aug 26, 2025 | 1:20 PM

Share

మగువలు పసిడి ప్రియులు. ఏ మాత్రం డబ్బు దొరికినా వెంటనే బంగారు ఆభరణాలు కొనడానికి షాప్‌లకు పరుగులు తీస్తారు. అయితే ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో బంగారం, వెండి ఆభరణాలు కొనుగోలు చేసి ఉంటారు. అయితే బంగారు దుకాణాల్లో చిన్న ముక్కు పుడక నుంచి పెద్ద ఆభరణాల దుకాణాల వరకు ఏదీ కొనుగోలు చేసినా సిబ్బంది ఆభరణాలను పింక్ కాగితంలో చుట్టి క్యారీ బ్యాగ్‌లో చుట్టి ఇస్తారు. అసలు బంగారు నగలు ఇలా పింక్ కాగితంలో ఎందుకు చుడతారో మీకు తెలుసా? బంగారం, వెండి ఆభరణాలు కొనేటప్పుడు గులాబీ రంగు కాగితంలో చుట్టి ఒక బాక్సులో ఉంచి ఇవ్వడం దాదాపు ప్రతి చోట చూసేదే. ప్యాకింగ్‌కి గులాబీ రంగు కాగితం మాత్రమే ఎందుకు ఉపయోగిస్తారు? ఎరుపు, నీలం మొదలైన రంగుల కాగితం ఎందుకు ఉపయోగించరో ఇక్కడ తెలుసుకుందాం..

బంగారు, వెండి ఆభరణాలను గులాబీ రంగు కాగితంలో ఎందుకు చుడతారంటే.. నిజానికి, శతాబ్దాలా నాటి ఈ సంప్రదాయం వెనుక నిర్ధిష్ట కారణం అంటూ ఏదీ లేదు. అయినా వందల యేళ్ల నుంచి అనుసరిస్తున్న సంప్రదాయం ఇది. పురాతన కాలం నుండి ఆభరణాల వ్యాపారులు గులాబీ కాగితంలో ఆభరణాలను చుట్టేవారు. ఎందుకంటే ఎరుపు, గులాబీ రంగులను శుభప్రదంగా భావిస్తారు. అంతేకాకుండా నగలను గీతలు పడకుండా రక్షించడంలో పేపర్ సహాయపడుతుంది. కాబట్టి నగలను ఈ రంగు కాగితంలో చుట్టి ఇస్తారు.

మెటాలిక్ షైన్

కొన్ని పరిశోధనల ప్రకారం గులాబీ రంగు కాగితంలో కొంచెం మెటాలిక్ షైన్ ఉంటుందని తేలింది. దీనివల్ల ఈ కాగితంలో ఉంచడం వల్ల నగలు మరింత మెరుస్తాయట. నలుపు, తెలుపు మొదలైన కాగితంపై ఉంచినప్పుడు నగలు అంత ఆకర్షణీయంగా, మెరుస్తూ కనిపించవు. తెల్ల కాగితంపై బంగారం కొంచెం నిస్తేజంగా కనిపిస్తుంది. అలాగే రంగు కాగితం రసాయనాలను లీక్‌ చేయగలదు. ఇది లోహాన్ని దెబ్బతీస్తుంది. వాటిని మసకబారకుండా నిరోధించే పూత ఉంటుంది. అంటే ఈ రంగులలో ప్యాక్ చేయబడిన బంగారం త్వరగా దాని మెరుపును కోల్పోదు. అందువల్లనే భద్రత, మెరుపు కోసం ఆభరణాలను గులాబీ కాగితంలో నగలను చుట్టడం ఆనవాయితీగా వస్తుంది. గాలి, తేమ, ధూళి వంటి బాహ్య కారకాల నుండి బంగారాన్ని రక్షించడంలో సహాయపడే శాస్త్రీయ ఎంపిక ఈ పింక్ కాగితం. ఇది బంగారం మెరుపు చాలా కాలం పాటు చెక్కుచెదరకుండా ఉండేలా కాపాడుతుంది.

ఇవి కూడా చదవండి

మరో విషయం ఏమిటంటే గులాబీ రంగు చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఏదైనా బహుమతిని గులాబీ రంగులో ప్యాక్ చేస్తే, అది అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. చాలా అందంగా, మెరుస్తూ కనిపిస్తుంది. అందుకే బంగారం, వెండి ఆభరణాలను చుట్టడానికి ఎక్కువగా గులాబీ కాగితాన్ని ఎంచుకుంటారు. ఇది వాటి మెరుపును పెంచుతుంది.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.

శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..