White Sugar vs Brown Sugar: వైట్ షుగర్, బ్రౌన్ షుగర్ మధ్య తేడా ఏమిటి? ఆరోగ్యానికి ఏది మంచిదంటే..!

క్కువ మంది రోజు మొదలు పెట్టేది పంచదారతో చేసిన టీ, రాత్రి భోజనం తర్వాత స్వీట్లు తీసుకునే అలవాటు చాలా మందికి ఉంటుంది. అయితే ఎక్కువగా వైట్ షుగర్ ని ఉపయోగించడం సర్వసాధారణం. అయితే కొంతమంది బ్రౌన్ షుగర్ ను ఉపయోగించడానికి ఇష్టపడతారు. గోధుమ, తెలుపు చక్కెర రెండూ చెరకు రసం నుండి తయారు చేస్తారు. అయితే ఈ రెండు చక్కెరలలో ఏది మీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది.. వాటి మధ్య తేడా ఏమిటి వివరాలు తెలుసుకుందాం.. 

White Sugar vs Brown Sugar: వైట్ షుగర్, బ్రౌన్ షుగర్ మధ్య తేడా ఏమిటి? ఆరోగ్యానికి ఏది మంచిదంటే..!
White Sugar Vs Brown Sugar
Follow us
Surya Kala

|

Updated on: Feb 19, 2024 | 7:58 AM

పండుగ, పెళ్లి , శుభకార్యాలు,  విజయం ఇలా ఏ సంతోషకరమైన సందర్భం వచ్చినా సరే ముందుగా గుర్తుకు వచ్చేది తీపి పదార్ధం. నోరు తీపి చేయడానికి అందుబాటులో ఏదీ లేకపోతే కనీసం పంచదారతోనైనా నోరు తీపి చేస్తారు. రోజులో పంచదారను రకరకాలుగా వినియోగిస్తూనే ఉంటారు. తమ రోజువారీ దినచర్యలను  చక్కెరతో ప్రారంభిస్తారు.. అదే విధంగా రాత్రిని స్వీట్ తో ముగిస్తారు. ఎక్కువ మంది రోజు మొదలు పెట్టేది పంచదారతో చేసిన టీ, రాత్రి భోజనం తర్వాత స్వీట్లు తీసుకునే అలవాటు చాలా మందికి ఉంటుంది. అయితే ఎక్కువగా వైట్ షుగర్ ని ఉపయోగించడం సర్వసాధారణం. అయితే కొంతమంది బ్రౌన్ షుగర్ ను ఉపయోగించడానికి ఇష్టపడతారు. గోధుమ, తెలుపు చక్కెర రెండూ చెరకు రసం నుండి తయారు చేస్తారు. అయితే ఈ రెండు చక్కెరలలో ఏది మీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది.. వాటి మధ్య తేడా ఏమిటి వివరాలు తెలుసుకుందాం..

గోధుమ, తెలుపు చక్కెర్లను ప్రాసెసింగ్ ఎలా చేస్తారంటే

చెరకు రసం నుండి నీరు, మలినాలను తొలగించిన తర్వాత మిగిలిపోయిన సుక్రోజ్ కి చెందిన క్రిస్టల్ రూపాన్ని తెల్ల చక్కెర అంటారు. ఇది ఫిల్టర్ చేయబడిన షుగర్. వాస్తవానికి సుక్రోజ్ అనేది మొక్కలలో సహజంగా కనిపించే ఒక మూలకం. ఇందులో 50 శాతం గ్లూకోజ్.. 50 శాతం ఫ్రక్టోజ్లు ఉంటాయి

బ్రౌన్ షుగర్ ప్రాసెసింగ్ విషయంలోకి వెళ్తే.. ఇది ప్రాసెస్ చేయని చక్కెర. ఇందులో మొలాసిస్ (మొలాసిస్, జిగట పదార్థం) ఉంటుంది. దీని కారణంగా దీని రంగు ఇసుక లేదా ముదురు గోధుమ రంగులో ఉంటుంది. బ్రౌన్ షుగర్ ను బెల్లం కలిపి తయారు చేస్తారు. అయితే వైట్ షుగర్, బ్రౌన్ షుగర్ రెండింటి రుచిలో కొంత తేడా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

బ్రౌన్ షుగర్- వైట్ షుగర్ లో ఏది మంచింది

బ్రౌన్ షుగర్ లేదా వైట్ షుగర్ ఏది ఆరోగ్యానికి మంచిదనే విషయంలోకి వెళ్తే.. పోషకాల విలువలను పరిగణలోకి తీసుకుంటే తెల్ల చక్కెర కంటే బ్రౌన్ షుగర్ ఆరోగ్యకరమైనది. ఎందుకంటే  తెల్ల పంచదార కంటే   బ్రౌన్ షుగర్ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది.

అంతేకాదు బ్రౌన్ షుగర్ మంచి రుచిని కలిగి ఉంటుంది. ఇది వంటల రుచిని పెంచుతుంది. అంతేకాకుండా, తెల్ల చక్కెరతో పోలిస్తే ఇందులో పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. అందుకే బ్రౌన్ షుగర్ ఒక వ్యక్తికి చాలా మంచి ..  ఆరోగ్యకరమైన ఎంపిక.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..