AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raja Suya Yagam: పూర్ణాహుతితో ముగిసిన రాజశ్యామల యాగం.. పాల్గొన్న చంద్రబాబు దంపతులు.. విజయం తథ్యమన్న పండితులు

కేసీఆర్‌, జగన్‌ బాటలో చంద్రబాబు పయనిస్తున్నారా?.. టీడీపీ అధినేత కూడా అదే సెంటిమెంట్‌ను నమ్ముకుని ప్రయాణిస్తున్నారు.. టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో మూడు రోజులుగా సాగుతున్న రాజశ్యామల యాగం దిగ్విజయంగా ముగిసింది. శుక్రవారం నుంచి నిర్విరామంగా కొనసాగిన యాగం.. నిన్నటి పూర్ణాహుతి కార్యక్రమంతో ముగిసింది.   

Raja Suya Yagam: పూర్ణాహుతితో ముగిసిన రాజశ్యామల యాగం.. పాల్గొన్న చంద్రబాబు దంపతులు.. విజయం తథ్యమన్న పండితులు
Chandrababu Rajasuya Yagam
Surya Kala
|

Updated on: Feb 19, 2024 | 7:02 AM

Share

టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో మూడు రోజులుగా సాగుతున్న రాజశ్యామల యాగం దిగ్విజయంగా ముగిసింది. శుక్రవారం నుంచి నిర్విరామంగా కొనసాగిన యాగం.. నిన్నటి పూర్ణాహుతి కార్యక్రమంతో ముగిసింది. గుంటూరుకు చెందిన వేద పండితులు శ్రీనివాసాచార్యుల ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 50 మంది రుత్వికుల సమక్షంలో యాగం నిర్వహించారు. చంద్రబాబు దంపతులతో వివిధ పూజా క్రతువులు నిర్వహించారు. మూడో రోజు పూర్ణాహుతి కార్యక్రమంతో యాగం పరిసమాప్తమైంది. తొలిరోజు చంద్రబాబు దంపతులు యాగక్రతవులో పాల్గొన్నారు. ప్రజలందరికీ మేలు జరగాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చంద్రబాబు దంపతులు హోమాలు నిర్వహించారు.

రాజశ్యామల యాగం విజయాన్ని అందుకోవాలని, శత్రువులు క్షీణించాలని, రాజ్యలక్ష్మి శాశ్వతంగా ఉండాలని నిర్వహిస్తారు. విజయం సిద్ధించేలా చేయమని శ్యామలాదేవిని ప్రసన్నం చేసుకోవడానికి యాగం చేపడతారు. వాస్తవానికి.. ఇలాంటి యాగాలు నిర్వహించడంలో కేసీఆర్ ముందుంటారు. కేసీఆర్.. ఎన్నికలతో పాటు ఏ ముఖ్యమైన పని చేయాలనుకున్నా యాగం నిర్వహిస్తారు. గతంలో భారీగా యాగశాల నిర్మించి పెద్దఎత్తున రాజశ్యామల యాగం నిర్వహించారు. ఇటీవల ఎన్నికల ముందు కూడా ఆయన ఫాంహౌస్‌లో శారదా పీఠాధిపతి స్వరూపానంద సమక్షంలో రాజశ్యామల యాగం చేపట్టారు.

ఇవి కూడా చదవండి

సీఎం జగన్ కూడా హోమాలు నిర్వహించారు. 2019 ఎన్నికలకు ముందు స్వరూపానంద యాగం చేయగా సీఎం జగన్ పాల్గొన్నారు. ఇక.. గతేడాది డిసెంబర్‌లోనూ చంద్రబాబు నివాసంలో చండీయాగం, సుదర్శన నారిసింహా హోమం నిర్వహించారు. మొత్తంగా.. అత్యంత భక్తి శ్రద్ధలతో, నిష్ట నియమాలతో చంద్రబాబు నిర్వహించిన యాగం పూర్ణాహుతి కార్యక్రమంతో దిగ్విజయంగా ముగిసింది. అయితే.. ఎన్నికల ముందు రాజశ్యామల యాగం నిర్వహించడం ప్రత్యర్థులను బలహీనపరిచేందుకేనని పండితులు చెప్తుంటారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..