Lord Shiva Puja: శివయ్య ప్రసన్నం కోసం సోమవారం ఇలా పూజ చేయండి.. ఉపవాస నియమాలు మీకోసం..
భోళాశంకరుడిని ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు సోమవారం ఉపవాసం పాటిస్తారు. సోమవారం రోజున చేసే శివుని ఆరాధనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. సోమవారం నాడు శివుని పూజించడం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరతాయని విశ్వాసం. శివుడిని పూజించడానికి సోమవారం తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేయాలి. ఈ రోజున ఆలయానికి వెళ్లి శివలింగానికి నీరు, పాలు సమర్పించాలి. భష్మాభిషేకానికి కూడా ప్రాముఖ్యత ఉంది.
హిందూ మతంలో శివుని ఆరాధనకు చాలా ప్రాముఖ్యత ఉంది. శాస్త్రాల ప్రకారం శివుడు ఎంత కోపంతో ఉంటాడో అంత దయగల దైవం. హిందూ మతంలో వారంలో ఒకొక్క రోజు ఒకొక్క దేవుళ్లను పూజించే పద్ధతి ఉంది. గ్రంధాల ప్రకారం. ఈ నేపథ్యంలో సోమవారం శివునికి అంకితం చేయబడింది. భోళాశంకరుడిని ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు సోమవారం ఉపవాసం పాటిస్తారు. సోమవారం రోజున చేసే శివుని ఆరాధనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. సోమవారం నాడు శివుని పూజించడం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరతాయని విశ్వాసం. శివుడిని పూజించడానికి సోమవారం తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేయాలి. ఈ రోజున ఆలయానికి వెళ్లి శివలింగానికి నీరు, పాలు సమర్పించాలి. భష్మాభిషేకానికి కూడా ప్రాముఖ్యత ఉంది.
సోమవారం ఉపవాస నియమాలు:
- సోమవారం తప్పనిసరిగా శివుడిని, పార్వతిని పూజించాలి. దీనితో పాటు సోమవారం ఉపవాసం దీక్షను చేపట్టండి.
- సోమవారం తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేసి శివయ్యకు పూజ చేయాలి.
- ఈ రోజున భగవంతుడు భోళాశంకరుడికి నీరు, పాలు, బిల్వ పత్రం, పువ్వులు మొదలైన వాటిని సమర్పించండి.
- అనంతరం శివ పార్వతికి పూజ చేసి హారతినివ్వండి.
- ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపవాసం చేయండి.
- వాస్తవానికి సోమవారం ఉపవాసం సమయంలో పండ్లు తినకూడదు అనే ప్రత్యేక నియమం లేదు.
- మూడు గంట తర్వాత మాత్రమే భోజనం చేస్తారు. వాస్తవానికి సోమవారం మూడు రకాల ఉపవాసాలు ఉంటాయి. ప్రతి సోమవారం ఉపవాసం చేయవచ్చు.
- దీనితో పాటు సౌమ్య ప్రదోషం, 16 సోమవారాలు కూడా ఉపవాసం చేయవచ్చు. మూడు ఉపవాసాల పద్ధతి ఒకటే. శివపూజ చేసిన తర్వాత కథ వినడం ముఖ్యం. సాయంత్రం పూజ చేసి హారతిని ఇస్తారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు