AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంట్లో డబ్బు ఎక్కడ పెట్టాలి? ఆర్థిక వృద్ధిని ఇచ్చే వాస్తు చిట్కాలు పాటించారంటే..

ప్రతి ఒక్కరూ తమ కుటుంబంలో ఐశ్వర్యం, ప్రశాంతత, ఆర్థిక స్థిరత్వం ఉండాలని కోరుకుంటారు. ఎంత సంపాదించినా డబ్బు చేతిలో నిలవడం లేదని భావించేవారు వాస్తు శాస్త్రం సూచించే కొన్ని నిబంధనలను పాటించడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. వాస్తు ప్రకారం ఇంట్లో ధనాన్ని దాచే ప్రదేశం, దిశ, కొన్ని చిన్న మార్పులు లక్ష్మీదేవి కటాక్షాన్ని, కుబేరుని అనుగ్రహాన్ని కలిగిస్తాయి. ఆ వివరాలు ఇక్కడ చూద్దాం.

ఇంట్లో డబ్బు ఎక్కడ పెట్టాలి? ఆర్థిక వృద్ధిని ఇచ్చే వాస్తు చిట్కాలు పాటించారంటే..
Vastu Tips For Money
Jyothi Gadda
|

Updated on: Sep 19, 2026 | 12:15 PM

Share

ఇంట్లో ధన ప్రవాహం పెరగాలన్నా, ఆర్థిక స్థిరత్వం లభించాలన్నా వాస్తు నియమాలను పాటించడం ఎంతో ముఖ్యం. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో డబ్బు, నగలు, విలువైన వస్తువులను దాచే ప్రదేశం సరైన దిశలో ఉండాలి. లాకర్ లేదా బీరువాను ఇంట్లో ఏ దిశగా ఉండాలి..అలాగే బీరువా తలుపులు ఏ దిశకు తెరుచుకునేలా ఉండాలి..వంటి వివరాల్లోకి వెళితే..

బీరువా లేదా లాకర్ ఉంచాల్సిన సరైన దిశ:

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో డబ్బు ఉంచే బీరువా లేదా క్యాష్ బాక్స్‌ను ఉత్తర దిశ లో ఉంచాలి. ఉత్తర దిశను సంపదకు అధిపతియైన కుబేరుడి స్థానంగా భావిస్తారు. బీరువాను గది నైరుతి మూలలో ఉంచి, దాని తలుపులు ఉత్తరం వైపు తెరుచుకునేలా అమర్చడం అత్యంత శుభప్రదం. ఇలా చేయడం వల్ల ఇంట్లోకి ధనాగమనం పెరుగుతుంది. వృధా ఖర్చులు తగ్గుతాయి.

అద్దం ఉపయోగం:

లాకర్ లేదా బీరువా లోపల ధనం ఉండే ప్రదేశానికి ఎదురుగా ఒక చిన్న అద్దాన్ని అమర్చాలి. లేదా లాకర్ తలుపు తెరిచినప్పుడు లోపలి డబ్బు ప్రతిబింబించేలా అద్దం ఉండటం వల్ల ఇంట్లో సంపద రెట్టింపు అవుతుందని నమ్ముతారు.

ఇవి కూడా చదవండి

పరిసరాల పరిశుభ్రత:

డబ్బు ఉంచే ప్రదేశం లేదా క్యాష్ బాక్స్ ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండాలి. బీరువాలో లేదా లాకర్ సమీపంలో పాత పత్రాలు, చిరిగిన కాగితాలు లేదా పనికిరాని వస్తువులను ఉంచకూడదు. దుమ్ము, ధూళి లేకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం వల్ల లక్ష్మీదేవి ఆ ప్రదేశంలో స్థిరంగా నివసిస్తుంది.

చేయకూడని పొరపాట్లు:

డబ్బును ఎప్పుడూ దక్షిణం లేదా పశ్చిమం వైపు తలుపులు తెరుచుకునేలా ఉంచకూడదు. ఇది ఆర్థిక నష్టాలకు దారితీస్తుంది. ఈశాన్య మూలలో బరువైన లాకర్లను ఉంచడం వాస్తు ప్రకారం నిషిద్ధం. ఈ చిన్న వాస్తు చిట్కాలను పాటించడం ద్వారా మీ ఇంట్లో ధన ప్రవాహాన్ని పెంచుకోవడమే కాకుండా, సమృద్ధి, శ్రేయస్సును సాధించవచ్చు.

(Disclaimer: ఈ కథనంలోని వివరాలు మతపరమైన విశ్వాసాలు, జానపద కథలు, ప్రాంతీయ ఆచారాల ఆధారంగా అందించబడ్డాయి. వీటిని శాస్త్రీయంగా నిరూపితమైన విషయాలుగా భావించకూడదు. ఆచారాలను పాటించాలా వద్దా అనేది వ్యక్తిగత విశ్వాసం, సంప్రదాయం, విచక్షణపై ఆధారపడి ఉంటుంది.)

Follow Us
హైదరాబాద్‌లో సదర్ సమ్మేళనంలో విషాదం.. దున్నపోతును ఆడిస్తూ..
హైదరాబాద్‌లో సదర్ సమ్మేళనంలో విషాదం.. దున్నపోతును ఆడిస్తూ..
వైట్‌హౌస్‌ వద్ద హైటెన్షన్.. ట్రంప్‌ ఉండగానే 2 భద్రతా ఉల్లంఘనలు
వైట్‌హౌస్‌ వద్ద హైటెన్షన్.. ట్రంప్‌ ఉండగానే 2 భద్రతా ఉల్లంఘనలు
గోవర్ధన పర్వతం ఎందుకు కుంచించుకుపోతోంది? పులస్త్య మహర్షి శాపం..
గోవర్ధన పర్వతం ఎందుకు కుంచించుకుపోతోంది? పులస్త్య మహర్షి శాపం..
దీపావళి కానుకగా లేఆఫ్ నోటీసు.. షాకైన ఉద్యోగి!
దీపావళి కానుకగా లేఆఫ్ నోటీసు.. షాకైన ఉద్యోగి!
రోజూ ఉలవలు తింటే.. ఇమ్యూనిటీ డబుల్ .. గుర్రంలా పరుగులు తీస్తారు
రోజూ ఉలవలు తింటే.. ఇమ్యూనిటీ డబుల్ .. గుర్రంలా పరుగులు తీస్తారు
దంతాలలో క్యావిటీస్ రావడానికి కారణం ఏంటో తెలుసా..? ఏ ఖనిజం లోపం
దంతాలలో క్యావిటీస్ రావడానికి కారణం ఏంటో తెలుసా..? ఏ ఖనిజం లోపం
అర్జున్‌ను ఇలా ఎప్పుడూ చూసి ఉండరు.. పొలిమేర 3 గ్లింప్స్ రిలీజ్
అర్జున్‌ను ఇలా ఎప్పుడూ చూసి ఉండరు.. పొలిమేర 3 గ్లింప్స్ రిలీజ్
ఉసిరికాయ ఎప్పుడు తినాలి? ఆరోగ్య ప్రయోజనాలు, తినే సరైన విధానం ఇదే!
ఉసిరికాయ ఎప్పుడు తినాలి? ఆరోగ్య ప్రయోజనాలు, తినే సరైన విధానం ఇదే!
చికెన్, మటన్ కన్నా బలమైన ఫుడ్ ఇదే.. గుప్పెడు తింటే చచ్చుబడ్డ నరాల
చికెన్, మటన్ కన్నా బలమైన ఫుడ్ ఇదే.. గుప్పెడు తింటే చచ్చుబడ్డ నరాల
గోవర్ధన పూజ రోజు ఈ 4 దానాలు చేస్తే ఎంతో పుణ్యఫలం.. సుఖసంతోషాలు..
గోవర్ధన పూజ రోజు ఈ 4 దానాలు చేస్తే ఎంతో పుణ్యఫలం.. సుఖసంతోషాలు..