AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ambani: అంబానీలు తినే ఫుడ్ గురించి తెలిస్తే నోరెళ్లబెడతారు? ఇంత సింపులా అనుకుంటారు

అంబానీలు అనగానే ఠక్కున గుర్తొచ్చేది రిలయన్స్, జియో, ఆంటీలియా, ఐపీఎల్ టీమ్… ఇంకా లక్షల కోట్లు! కానీ వీళ్లు రోజూ ఏం తింటారు? ప్రపంచ కుభేరుల డైట్​ ఎలా ఉంటుంది? అనే విషయాలు తెలుసుకోవాలని చాలామంది ఆసక్తి చూపిస్తారు. మరి అంబానీ డైట్​లో ..

Ambani: అంబానీలు తినే ఫుడ్ గురించి తెలిస్తే నోరెళ్లబెడతారు? ఇంత సింపులా అనుకుంటారు
Ambani1 Copy
Nikhil
|

Updated on: Nov 28, 2025 | 11:32 PM

Share

అంబానీలు అనగానే ఠక్కున గుర్తొచ్చేది రిలయన్స్, జియో, ఆంటీలియా, ఐపీఎల్ టీమ్… ఇంకా లక్షల కోట్లు! కానీ వీళ్లు రోజూ ఏం తింటారు? ప్రపంచ కుబేరుల డైట్​ ఎలా ఉంటుంది? అనే విషయాలు తెలుసుకోవాలని చాలామంది ఆసక్తి చూపిస్తారు. మరి అంబానీ డైట్​లో ఏముంటుందో, ఆ డైట్ ప్రత్యేకతేంటో మనమూ తెలుసుకుందాం..

బ్రేక్‌ఫాస్ట్

సాధారణంగా ముకేష్ అంబానీ ఉదయం 5:30కే లేస్తారట. కానీ ఆయన బ్రేక్​ఫాస్ట్​ మాత్రం చాలా సింపుల్​గా ఉంటుందట. ఇంట్లోనే బొప్పాయి, దానిమ్మ, బత్తాయితో చేసే ఫ్రెష్​ ఫ్రూట్​ జ్యూస్​ ఓ గ్లాస్, ఇడ్లీ-వడ, పొంగల్, ఉప్మా లేదా పూరీ-ఆలూ కూర… అవును, మనలాగానే! నీతా అంబానీకి దోసె అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా మసాలా దోసె, పెసరట్టు, రవ్వ దోసె… ఆంటీలియా కిచెన్‌లో రోజూ బ్రేక్​ఫాస్ట్​లో దోసె తప్పనిసరి. కొకిలాబెన్ అయితే గుజరాతీ స్టైల్ ధోక్లా, ఖమణ్, థేప్లా ప్రేమికురాలట. అంటే మూడు తరాల వెరైటీ ఒక్క టేబుల్ మీద ఉంటుంది!

మధ్యాహ్నం భోజనం..

మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్య లంచ్​. ఇక్కడ కూడా సింపుల్ ఇండియన్ థాలీ – దాల్, రోటీ, రైస్, రెండు రకాల కూరగాయలు, పప్పు, రైతా, సలాడ్. ముకేష్​కి పంజాబీ దాల్ మఖానీ, రాజ్మా-చవల్ ఇష్టం. నీతా అంబానీ గుజరాతీ ఉండియు-కఢీ, దాల్-ధోక్లీ ఎక్కువగా తింటారట. ఆకాష్-శ్లోక మాత్రం పనీర్ బటర్ మసాలా, నాన్ లాంటివి తింటారట. ఒక్కోసారి ఇషా పిల్లలతో కలిసి పిజ్జా లేదా పాస్తా కూడా తింటారట, అంటే ఇంట్లో ఇండియన్, కంటినెంటల్ మిక్స్!

Ambani2 Copy

Ambani2 Copy

రాత్రి భోజనం

రాత్రి 8 తర్వాత డిన్నర్. ఇక్కడ మాత్రం కాస్త లైట్ – సూప్, గ్రిల్డ్ వెజిటబుల్స్, సలాడ్, ఒకటి-రెండు రొట్టెలు లేదా ఖిచ్డీ. కొకిలాబెన్‌కి గుజరాతీ ఖిచ్డీ-కఢీ కాంబినేషన్ ఎప్పుడూ ఫేవరెట్. ముకేష్ ఒక్కోసారి రాత్రి పూట్టికి ఒక గ్లాస్ మిల్క్, ఫ్రూట్ మాత్రమే తీసుకుంటారట.

ఇక్కడ ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఆంటీలియాలో వారానికి ఒక రోజు గుజరాతీ, ఒక రోజు సౌత్ ఇండియన్, ఒక రోజు పంజాబీ, ఒక రోజు ఇంటర్నేషనల్ ఫుడ్ డేలు ఉంటాయట. అందరూ కలిసి కూర్చొని తింటారు, ఫ్యామిలీ టైమ్ అన్నమాట! అంటే లక్షల కోట్ల ఆస్తి ఉన్నా… ప్లేట్ మాత్రం మనలాగానే ఇండియన్ మిడిల్ క్లాస్ స్టైల్!