AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lifestyle: చెమట వాసన రావడానికి అసలు కారణం ఏంటో తెలుసా.?

చెమట వాసన రావడానికి ప్రధాన కారణాల్లో హార్మోన్ల హెచ్చుతగ్గులు ఒకటి. దీని కారణంగా చెమట దుర్వాసన వస్తుంది. అలాగే గర్భధారణ సమయంలో, ప్రీమెనోపాజ్ లేదా మెనోపాజ్ వంటి పరిస్థితుల్లో మహిళల్లో చెమట దుర్వాసన వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చెమట దుర్వాసన రావడానికి మరో కారణం ఉపయోగించే మందులు కూడా...

Lifestyle: చెమట వాసన రావడానికి అసలు కారణం ఏంటో తెలుసా.?
Body Odor
Narender Vaitla
|

Updated on: Sep 06, 2024 | 3:09 PM

Share

చెమట పట్టడం సర్వసాధారణమైన సమస్య. కొందరికి కేవలం వాతావరణం వేడి ఉన్న సమయంలో మాత్రమే చెమట పడితే. మరికొందరకి మాత్రం వాతావరణ పరిస్థితులతో సంబంధం లేకుండా చెమట పడుతుంది. అయితే కొందరిలో చెమట దుర్వాసన వస్తుంది. అసలు చెమట వాసన రావడానికి కారణం ఏంటి.? ఈ సమస్య నుంచి బయట పడాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలి లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

చెమట వాసన రావడానికి ప్రధాన కారణాల్లో హార్మోన్ల హెచ్చుతగ్గులు ఒకటి. దీని కారణంగా చెమట దుర్వాసన వస్తుంది. అలాగే గర్భధారణ సమయంలో, ప్రీమెనోపాజ్ లేదా మెనోపాజ్ వంటి పరిస్థితుల్లో మహిళల్లో చెమట దుర్వాసన వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చెమట దుర్వాసన రావడానికి మరో కారణం ఉపయోగించే మందులు కూడా. మధుమేహం, ఊబకాయం, థైరాయిడ్, మూత్రపిండాల వ్యాధి, ఇన్ఫెక్షన్ వంటి వాటికి మందులను ఉపయోగించే వారిలో కూడా ఇలాంటి సమస్యలు వస్తాయి.

ఇక తీవ్రమైన ఒత్తిడి, ఆందోళన లేదా టెన్షన్‌తో ఇబ్బంది పడేవారిలో కూడా చెమట ఎక్కువగా పడుతుంది. అదే విధంగా దుర్వాసన కూడా వస్తుంది. తీసుకునే ఆహారం సైతం చెమట వాసనకు కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా స్పైసీ ఫుడ్, ఉల్లి, వెల్లుల్లి, ఆల్కహాల్, కెఫిన్‌ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల చెమట దుర్వాస వస్తుంది. లోదుస్తులను క్రమంతప్పకుండా మార్చనివారిలో, సింథటిక్ దుస్తులు ధరించే వారితో పాటు, చెక్కర ఎక్కువ తినేవారిలో కూడా చెమటన దుర్వాసన వచ్చే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

ఇవి పాటించండి..

శరీరం నుంచి దుర్వాసన రాకుండా ఉండాలంటే వ్యక్తిగత పరిశుభ్రతను తప్పకుండా పాటించాలి. రోజుకు రెండుసార్లు స్నానం చేయడం అలవాటుగా మార్చుకోవాలి. అండర్‌ ఆర్మ్స్‌లో వచ్చే దుర్వాసనకు బేకిండ్ సోడా ఉపయోగపడుతుంది. ఇందుకోసం ఒక గిన్నెలో నిమ్మరసం, రెండు చెంచాల బేకింగ్ సోడా కలిపి స్నానం చేసే కంటే ముందు 15 నిమిషాల పాటు అండర్ ఆర్మ్స్ పై అప్లై చేస్తే సమస్య తగ్గుతుంది. ఇక రోజ్‌ వాటర్‌ను అండర్‌ ఆర్మ్స్‌పై అప్లై చేసినా సమస్య తగ్గుముఖం పడుతుంది. యాపిల్ సైడర్ వెనిగర్ ను ఉపయోగించడం ద్వారా, అండర్ ఆర్మ్స్ లోని బ్యాక్టీరియా తొలగిపోతుంది. దీంతో దుర్వాసన తగ్గుతుంది. ఉతకని బట్టలు ధరించకూడదు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..