Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Quality Sleep: కంటి నిండా నిద్ర లేకపోతే ఎన్ని అనర్ధాలో తెలుసా? నిపుణులు చెబుతున్న షాకింగ్ విషయాలు..

నిజానికి, ఒక వ్యక్తి రాత్రిపూట 10 గంటలపాటు మంచం మీద ఉన్నంత మాత్రాన అతను నాణ్యమైన నిద్రను పొందుతున్నాడు అని అనుకోలేమని నిపుణులు చెబుతున్నారు. ప్రశాంతమైన నిద్రను కలిగి ఉన్నా.. అది నాణ్యమైన నిద్ర కాదని వివరిస్తున్నారు. మరి నాణ్యమైన నిద్ర అంటే ఏమిటి?

Quality Sleep: కంటి నిండా నిద్ర లేకపోతే ఎన్ని అనర్ధాలో తెలుసా? నిపుణులు చెబుతున్న షాకింగ్ విషయాలు..
Quality Sleep
Follow us
Madhu

| Edited By: Anil kumar poka

Updated on: Jan 23, 2023 | 9:39 PM

నిద్ర మనిషికి చాలా అవసరం. నిద్ర పోతున్న సమయంలోనే మనిషి శరీరం పునరుత్తేజితం అవుతుంది. ప్రస్తుత ఆధునిక కాలంలో మనిషికి నిద్ర కరువైపోతోంది. మంచి గాఢమైన నిద్ర దొరకడం అరుదైపోతోంది. ఈక్రమంలో మనిషి అనారోగ్యాలను కొని తెచ్చుకుంటున్నాడు. ఈ క్రమంలో అసలు నిద్రకు శరీర ఆరోగ్యానికి లింకేంటి? అసలు నిద్ర ఎలా పోవాలి? ఎన్ని గంటలు పడుకోవాలి? నాణ్యమైన నిద్ర అంటే ఏమిటి?  నిపుణులు చెబుతున్న వివరాలను తెలుసుకుందాం..

నాణ్యమైన నిద్ర అంటే..

నిజానికి, ఒక వ్యక్తి రాత్రిపూట 10 గంటలపాటు మంచం మీద ఉన్నంత మాత్రాన అతను నాణ్యమైన నిద్రను పొందుతున్నాడు అని అనుకోలేమని నిపుణులు చెబుతున్నారు. ప్రశాంతమైన నిద్రను కలిగి ఉన్నా.. అది నాణ్యమైన నిద్ర కాదని వివరిస్తున్నారు. మరి నాణ్యమైన నిద్ర అంటే ఏమిటి? దానికి కొన్ని కొలతలు ఉన్నాయట.. అవేంటో చూద్దాం..

  • నిద్ర నాణ్యతను నిర్ణయించే మొదటి పెరామీటర్ సమర్థత.. అంటే నిద్ర సామర్థ్యం. ఇందులో, మీరు నిద్రపోతున్న సమయాన్ని లెక్కించాలి. మీరు మంచం మీద ఉన్న సమయం ప్రకారం, ఉదాహరణకు, మీరు 2-3 గంటలు పడుకున్నారని అనుకుందాం. కానీ దాని అర్థం మీరు నిజంగా నిద్రపోతున్నారని కాదు. మీరు మంచెంపై ఉన్న సమయంలో కనీసం 85 శాతం నిద్రలో ఉండాలి.
  • రెండో పెరామీటర్ వచ్చేసరికి.. రాత్రి సమయంలో మీరు మేల్కొనే సంఖ్య. చాలా మంది తరచుగా మేల్కోంటూ ఉంటారు. ఇది మీ గాఢ నిద్రకు భంగం కలిగించ వచ్చు. మళ్లీ నిద్ర పట్టడానికి సమయం పడుతుంది. కాబట్టి రాత్రి సమయంలో ఎంత తక్కువ సార్లు మేల్కోంటే.. నిద్ర నాణ్యత అంత మెరుగ్గా ఉంటుంది.
  • మూడో పెరామీటర్ నిద్ర లేటెన్సీ. సరళంగా చెప్పాలంటే, మీరు నిద్రపోవడానికి ఎంత సమయం పడుతుంది అనేది లెక్కించడం. సాధారణంగా నిద్రపోవడానికి సగటున 30 నిమిషాలు పడుతుంది. ఒక గంట లేదా అంతకంటే ఎక్కువ సమయం తీసుకుంటే, ఒక రకమైన నిద్రలేమికి ఎక్కువ అవకాశాలు ఉన్నట్లే లెక్కని నిపుణులు చెబుతున్నారు.
  • నిద్ర నాణ్యతను నిర్ణయించే నాల్గో పెరామీటర్ మీరు నిద్రపోయిన వెంటనే అకస్మాత్తుగా మేల్కొంటే, అది నాణ్యతను తగ్గిస్తుంది.

నాణ్యమైన నిద్ర లేకపోతే ఏం జరుగుతుంది..

మీరు తగినంతగా నిద్రపోకపోతే, ఏకాగ్రత కోల్పోవడం, భావోద్వేగానికి లోనవడం జరుగుతుంది. మరింత చికాకు, ఒత్తిడి, కోపం, విచారం, మానసిక అలసట ఉండే అవకాశం ఉంది. నాణ్యమైన నిద్ర లేకపోతే దీర్ఘకాలంలో గ్రోత్ హార్మోన్ల ఉత్పత్తికి అంతరాయం కలుగుతుంది. హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. అది శరీరం రీసెట్ యొక్క విధులను ప్రభావితం చేస్తుంది. ఒక వారం లేదా రెండు వారాల పాటు నిద్ర లేకపోతే అది రోగ నిరోధకశక్తిపై ప్రభావం చూపుతుంది. రోజులో కనీసం 7 గంటల కంటే తక్కువ నిద్ర ఉన్నవారికి జలుబు ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం 3 రెట్లు ఎక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. రోజూ 8 గంటల కంటే ఎక్కువ నిద్రపోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇవి కాకుండా ఏవైనా టీకాలు వేసినప్పుడు అవి సక్రమంగా పనిచేయాలంటే నిద్ర చాలా అవసరం. ముఖ్యంగా మీరు హెపటైటిస్ బి లేదా ఇన్ఫ్లుఎంజా వ్యాక్సినేషన్ చేయించుకొని సక్రమంగా నిద్రపోక పోతే దాని ప్రభావం అంతక ఉండకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అది అలా కొనసాగితే దీర్ఘకాలంలో గుండె సంబంధిత వ్యాధులు, మధుమేహం, స్థూలకాయం, క్యాన్సర్, మానసిక జబ్బులు చుట్టుముట్టే అవకాశం చాలా ఎక్కువ.

ఇవి కూడా చదవండి

నాణ్యమైన నిద్రను ఎలా పొందాలి?

  • మీరు మంచి పరిశుభ్రతను కలిగి ఉండాలి. మీ మనస్సు నిద్రించడానికి సిద్ధంగా ఉంచుకోవాలి. మీ పడకగది సౌకర్యవంతంగా ఉండాలి. ఉష్ణోగ్రత అనువైనదిగా ఉండాలి.
  • టీవీ, సెల్ ఫోన్ వంటి స్క్రీన్‌లను చూడకపోవడం మంచిది. ఎందుకంటే బ్లూ లైట్‌ను విడుదల చేసే ఈ స్క్రీన్‌లను చూడటం వల్ల మెలటోనిన్ ఉత్పత్తి తగ్గి, నిద్రపోవడం చాలా కష్టమవుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
  • అలాగే రోజూ వ్యాయామం, మంచి ఆహారంతో కూడిన ఆరోగ్యకర జీవన శైలి రాత్రి పూట బాగా నిద్రపోవడానికి సాయపడుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం..