Sunflower Seeds: పోషకాల సిరులు.. సన్‌ఫ్లవర్ సీడ్స్ రోజూ తింటే ఈ సమస్యలన్నీ దూరం..!
విత్తనాలు తినడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. చియా గింజలు, అవిసె గింజలు, గుమ్మడికాయ గింజలు, నల్ల బీన్ గింజలు, జనపనార గింజలు, పొద్దుతిరుగుడు విత్తనాలు వంటి అనేక రకాల విత్తనాలు ఉన్నాయి. అన్ని రకాల విత్తనాలు ఆరోగ్యకరమైన కొవ్వులతో సమృద్ధిగా ఉంటాయి. ఆరోగ్యానికి మేలు చేస్తాయి. పొద్దుతిరుగుడు విత్తనాల గురించి చెప్పాలంటే, మనం తరచుగా వాటిని సలాడ్లు, పెరుగు, స్మూతీలు లేదా చిరుతిండిగా తీసుకుంటాము.

పొద్దుతిరుగుడు విత్తనాల గురించి చెప్పాలంటే, మనం తరచుగా వాటిని సలాడ్లు, పెరుగు, స్మూతీలు లేదా చిరుతిండిగా తీసుకుంటాము. పొద్దుతిరుగుడు విత్తనాలలో ప్రోటీన్, ఫైబర్, విటమిన్ E, మెగ్నీషియం, సెలీనియం, అనేక ఇతర పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉంటాయి. పొద్దుతిరుగుడు విత్తనాలను మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఈ విత్తనాలు ఎముకలు, కండరాలను బలోపేతం చేయడంలో ప్రయోజనకరమైన ప్రభావాన్ని చూపుతాయి.
ఈ గింజల్లో ఉండే విటమిన్ బి6, విటమిన్ ఇ, ఐరన్, సెలీనియం జుట్టు రాలకుండా చూస్తాయి. జుట్టును బలంగా, ఒత్తుగా మారుస్తాయి. సన్‌ఫ్లవర్ సీడ్స్ తింటే ఎక్కువసేపు ఆకలి వేయదు. దీంతో బరువు అదుపులో ఉంటుంది. అందుకే బరువు తగ్గాలని చూసేవారు ఈ గింజలు తినడం మంచిది. ఈ గింజల్ని తినడం వల్ల ఎముకలు బలంగా, ఆరోగ్యంగా ఉంటాయి. వీటిలో ఉండే మెగ్నీషియం, కాపర్, కాల్షియం ఆస్టియోపొరోసిస్ వంటి సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
ఈ గింజల్లో ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా ఉంటాయి. వీటిని తినడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. షుగర్ ఉన్నవారికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో ఉండే పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచుతుంది. హైబీపీ ఉన్నవారు ఈ గింజలు తింటే ఎంతో మేలు కలుగుతుంది. సన్‌ఫ్లవర్ సీడ్స్‌లో మెగ్నీషియం సమృద్ధిగా ఉంటుంది. వీటిని తినడం వల్ల మెదడు పనితీరు బాగుంటుంది. ఆందోళన, ఒత్తిడి తగ్గుతాయి.
సన్‌ఫ్లవర్ సీడ్స్‌లో విటమిన్ ఇ ఉంటుంది. ఇది చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ వల్ల నష్టం కలగకుండా కాపాడుతుంది. తద్వారా చర్మం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది. సన్‌ఫ్లవర్ సీడ్స్‌లో విటమిన్ ఎ, మెగ్నీషియం ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. చెడు కొలెస్ట్రాల్‌ను కూడా తగ్గిస్తాయి. ఈ గింజల్లో విటమిన్ ఇ, జింక్, సెలీనియం వంటి పోషకాలు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. తద్వారా జలుబు, ఫ్లూ వంటి సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..








