పోషకాలకు పవర్ హౌస్ ఈ చిన్న పండు.. ఖరీదు ఎక్కువైనా సరే.. ఖచ్చితంగా తినాల్సిందే…!
బ్లూబెర్రీస్.. ఒక చిన్న గుండ్రని నీలం రంగు పండు..ఇవి పరిమాణంలో చాలా చిన్నవిగా ఉంటాయి. కానీ, శక్తివంతమైన పోషకాలతో నిండి ఉంటాయి. ఇది ఎక్కువగా యూరప్, ఆసియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికాలో పెరుగుతుంది. ఇది ఇతర పండ్ల కంటే కొంచెం ఖరీదైనది అయినప్పటికీ, ఇది లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అందుకే వీటిని సూపర్ ఫుడ్స్ అని కూడా అంటారు. వీటిలో శరీరానికి అవసరమైన విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. బ్లూబెర్రీస్ తినడం వల్ల అనేక వ్యాధుల నుండి మిమ్మల్ని రక్షించడమే కాకుండా మీ చర్మాన్ని కూడా అందంగా మారుస్తుంది. అవి రక్తంలో చక్కెరను తగ్గించడంలో, జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో, శక్తిని అందించడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. ఇవి కేలరీలు తక్కువగా, పోషకాలు అధికంగా ఉంటాయి. బ్లూబెర్రీస్ అతి ముఖ్యమైన ప్రయోజనాలు ఇక్కడ తెలుసుకుందాం..

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6




