Bats Facts: గబ్బిలాలు నేర్పించే జీవిత పాఠాలు.. పాటిస్తే సక్సెస్ మీ సొంతం కావడం పక్కా..!
గబ్బిలాలు అంటేనే చాలా మందికి చీకటి, భయం గుర్తుకు వస్తాయి. కానీ ఇవి మనకు జీవితానికి సంబంధించిన మంచి పాఠాలు చెబుతాయి. ఒక మనిషి చుట్టూ గబ్బిలం కనిపిస్తే అది ఏదో అపశకునంగా భావిస్తారు. కానీ ఈ ఎగిరే జీవి ఎన్నో గొప్ప విషయాలు మనకు చెబుతోంది.

గబ్బిలాలు అంధకారంలో కూడా ఎగిరి పోతాయి. అవి ఎకోలొకేషన్ అనే ధ్వని ఆధారంగా పని చేసే పద్ధతిని ఉపయోగిస్తాయి. ఇవి విడుదల చేసే శబ్దాలు చుట్టూ ఉన్న వస్తువులను తాకి తిరిగి వస్తాయి. ఈ ప్రక్రియ ద్వారా దారి ఏది, అడ్డం ఏది అనేది అవి గుర్తిస్తాయి. మన జీవితం కూడా కొన్ని సార్లు చీకట్లో మునిగినట్టుగా అనిపిస్తుంది. అప్పుడు మనం ఓర్పుతో, మనకున్న మనస్సాక్షిని ఉపయోగించి దారి ఎలా వెతుక్కోవాలో తెలుసుకోవాలి. గబ్బిలాల్లా మనం కూడా చీకట్లోనూ మార్గం కనిపెట్టగలగాలి.
గబ్బిలాలు ఒంటరిగా ఎగిరినా.. అవి వందలాది సంఖ్యలో ఉంటాయి. ఒక గుంపులో ఒకటి ఇబ్బందుల్లో పడితే.. మిగతావి వెంటనే సహాయం చేస్తాయి. వాటి మధ్య ఉన్న అనుబంధం వల్ల అవి సమిష్టిగా పని చేస్తాయి. ఇది మనకు చెప్పేదేమిటంటే.. మనుషులు కలిసి ఉన్నప్పుడు సమస్య ఎంత పెద్దదైనా అధిగమించగలం. అందరూ కలిసి పని చేస్తే ఏదైనా సాధ్యమే.
గబ్బిలాలు ఎన్నో వైరస్ లను తట్టుకోగలవు. అయితే వాటికి పెద్దగా వ్యాధులు రావు. వాటి జీవనశైలి, శరీర నిర్మాణం వాటిని ఆరోగ్యంగా ఉంచుతుంది. శాస్త్రవేత్తలు చెప్పినట్టే ఇవి సరిగ్గా తింటాయి. సరైన సమయానికి విశ్రాంతి తీసుకుంటాయి. మనం కూడా మన దైనందిన జీవనశైలిని సరిచేసుకుంటే.. మన ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటే.. మనలో ఒత్తిడి తక్కువగా ఉంటుంది.
గబ్బిలాలు తక్కువ శక్తితో ఎక్కువ దూరం ప్రయాణిస్తాయి. అవి వాతావరణాన్ని బాగా అర్థం చేసుకుంటాయి. ఎప్పటికప్పుడు అనుకూలంగా మారతాయి. మన జీవితం కూడా అలానే ఉంటుంది. కొన్నిసార్లు మన దగ్గర వనరులు, అవకాశాలు తక్కువగా ఉంటాయి. అలాంటి సమయంలో వాటిని బాగా ఆలోచించి సరిగ్గా ఉపయోగించుకుంటే మనం పెద్ద లక్ష్యాలను చేరుకోగలుగుతాం.
గబ్బిలాలు ప్రకృతికి ఎంతో ఉపయోగపడతాయి. అవి పూలకు పరిమళం రావడంలో, విత్తనాలు పెరిగే ప్రక్రియలో సహాయపడతాయి. పర్యావరణాన్ని సమతుల్యంలో ఉంచడంలో వాటి పాత్ర చాలా ముఖ్యంగా ఉంటుంది. మనం కూడా ప్రకృతిని అర్థం చేసుకొని దానితో కలిసి మెలిసి జీవించాలి. అలా చేస్తే మాత్రమే వాతావరణ మార్పులు, ప్రకృతి విపత్తుల నుంచి మనం దూరంగా ఉండగలుగుతాం.




