AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heart Attack Warning Signs: ఇలా పదే పదే నొప్పి వస్తే లైట్ తీసుకోకండి.. ప్రాణాల మీదకొస్తది..!

గుండెపోటు అనగానే అది ఒక్కసారిగా వస్తుందనే భావన చాలా మందిలో ఉంటుంది. కానీ నిజంగా చూస్తే.. శరీరం ముందుగానే కొన్ని సంకేతాలు ఇస్తుంది. అవి చిన్నవిగా అనిపించవచ్చు. అయితే వాటిని సమయానికి గుర్తిస్తే ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని తెలుసుకోవడం అవసరం.

Heart Attack Warning Signs: ఇలా పదే పదే నొప్పి వస్తే లైట్ తీసుకోకండి.. ప్రాణాల మీదకొస్తది..!
Heart Healthy
Prashanthi V
|

Updated on: May 26, 2025 | 7:10 PM

Share

మన శరీరం మనకు ముందే కొన్ని సంకేతాలు ఇస్తుంటుంది. కానీ వాటిని తేలికగా తీసుకుంటూ ఉండటం వల్ల వాటి ప్రాముఖ్యత అర్థం చేసుకోలేకపోతాం. కొన్ని రోజుల పాటు వచ్చే ఈ సంకేతాలను సరైన సమయంలో గుర్తిస్తే గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. లేకుంటే అవే సంకేతాలు తర్వాత పెద్ద ప్రమాదానికి దారి తీస్తాయి.

గుండెపోటుకు ముందు వచ్చే ముఖ్యమైన సంకేతం ఛాతీలో నొప్పి. ఇది చాలా మందిలో కనిపించే లక్షణం. ఛాతీలో ఒత్తిడి, మంటగా ఉండటం, బరువుగా అనిపించడం జరుగుతుంది. ఇది ఎడమవైపు లేదా మధ్యలో అనిపించొచ్చు. కొంతమంది దీన్ని చిన్న నొప్పిగా భావించి పట్టించుకోరు. కానీ ఇది ప్రమాదానికి సంకేతం కావచ్చు.

ఎడమ చేతి, భుజం, వేళ్లలోనూ ఒక్కసారిగా నొప్పి మొదలవుతుంది. అది ఛాతీ నుండి పాకి వస్తుంది. ఎలాంటి పని చేయకపోయినా అలాంటి నొప్పి అనిపిస్తే ఇది గుండెపోటు వచ్చే ముందు హెచ్చరిక కావచ్చు. అలాంటి పరిస్థితిలో వెంటనే డాక్టర్‌ ని కలవడం మంచిది.

గుండెపోటు వస్తున్నప్పుడు కొందరికి కడుపులో భారంగా అనిపించొచ్చు. అది అజీర్ణంగా గానీ, గ్యాస్ వచ్చినట్లు గానీ అనిపిస్తుంది. అయితే ఇది ఒక మేల్కొలుపు సంకేతం కావచ్చు. దీనిని సరదాగా తీసుకోకుండా అప్రమత్తంగా ఉండాలి.

కొన్ని సందర్భాల్లో ఏ పనీ చేయకపోయినా ఊపిరి పీల్చుకోవడం కష్టంగా అనిపించవచ్చు. చాలా అలసటగా కూడా ఉంటుంది. ఇది గుండె బాగా పని చేయడం లేదన్న సూచన కావచ్చు. ఇలా తరచూ అనిపిస్తే వెంటనే డాక్టర్‌ ను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి.

ఛాతీలో మళ్లీ మళ్లీ నొప్పి వస్తుంటే దాన్ని తక్కువగా చూడకూడదు. తక్షణమే డాక్టర్‌ ను కలవాలి. కుటుంబంలో ఎవరైనా గుండె సమస్యతో బాధపడితే మిగతా సభ్యులు జాగ్రత్తగా ఉండాలి. 40 ఏళ్లు దాటిన తర్వాత ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి.

గుండెపోటు అనేది ఒక్కసారిగా వచ్చే విషయం కాదు. శరీరం ముందే కొన్ని లక్షణాలు చూపుతుంది. ఆ సంకేతాలను సమయానికి గుర్తించి వైద్య సలహా తీసుకుంటే ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. మీ శరీరం చెబుతున్న మాటలు వినండి. చిన్న నొప్పి అయినా పట్టించుకోండి.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)