AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Relationship Tips: అబ్బాయిలూ.. మంచి కొడుకుకు ఉండవల్సిన లక్షణాలు ఇవేనట! ఇంతకీ మీలో ఉన్నాయా?

Wwhat are qualities of good sons: తమ కొడుకు సమాజంలో మంచి వ్యక్తిగా నిలవడమే కాకుండా సద్గుణాలతో నిండి ఉండాలని, కుటుంబానికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటారు. ఆ విధంగా పెంచుతారు కూడా. అయితే వ్యసనాలు, ఇతరుల ప్రభావం వల్ల వారు పెరిగి పెద్దయ్యాక కరడుగట్టిన నేరస్తుల్లా తల్లిదండ్రుల పట్ల ప్రవర్తిస్తుంటారు...

Relationship Tips: అబ్బాయిలూ.. మంచి కొడుకుకు ఉండవల్సిన లక్షణాలు ఇవేనట! ఇంతకీ మీలో ఉన్నాయా?
Qualities Of A Good Son In The Family
Srilakshmi C
|

Updated on: Oct 06, 2025 | 1:12 PM

Share

ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలను మంచి వ్యక్తులుగా ఉండాలని కోరుకుంటారు. ముఖ్యంగా కొడుకుల విషయంలో మరికాస్త జాగ్రత్తలు ఎక్కువగా తీసుకుంటారు. తమ కొడుకు సమాజంలో మంచి వ్యక్తిగా నిలవడమే కాకుండా సద్గుణాలతో నిండి ఉండాలని, కుటుంబానికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటారు. ఆ విధంగా పెంచుతారు కూడా. అయితే వ్యసనాలు, ఇతరుల ప్రభావం వల్ల వారు పెరిగి పెద్దయ్యాక కరడుగట్టిన నేరస్తుల్లా తల్లిదండ్రుల పట్ల దారుణంగా ప్రవర్తిస్తుంటారు. అసలు మంచి కొడుకు అంటే ఎవరు? అతడికి ఉండవలసిన లక్షణాలు ఏమిటి? తల్లిదండ్రులు మంచి కొడుకుగా పరిగణించబడాలంటే ఏయే లక్షణాలు ఉండాలి? ఆ సద్గుణాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..

మంచి కొడుకుకు ఉండవలసిన లక్షణాలు ఇవే..

  • మంచి కొడుకు ఎల్లప్పుడూ తన తల్లిదండ్రుల మాట విని వారి మాటల ప్రకారం ప్రవర్తిస్తాడు.
  • తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించే వ్యక్తిని మంచి కొడుకుగా పరిగణిస్తారు.
  • కొంతమంది పెళ్లి చేసుకున్న తర్వాత లేదా ఉద్యోగం వచ్చిన తర్వాత తల్లిదండ్రులను పట్టించుకోరు. ఇలాంటి సందర్భాల్లో కూడా వారికి ఎన్ని బాధ్యతలు ఉన్నా తల్లిదండ్రుల అవసరాలను తీర్చేవాడే మంచి కొడుకుగా నిలదొక్కుకుంటాడు.
  • తల్లిదండ్రులు కష్టాల్లో ఉన్నప్పుడు లేదా బాధలో ఉన్నప్పుడు వారి నుంచి పారిపోకుండా లేదా వారిని విస్మరించకుండా వారి కష్టాల్లో వారికి తోడుగా నిలిచేవాడే నిజమైన కుమారుడు.
  • నేను మగాడిని.. ఇంటి బాధ్యత ఎందుకు చేపట్టాలి అనే అహంకారాన్ని పక్కన పెట్టి, మంచి కొడుకు తన తల్లిదండ్రులకు ఇంటి పనిలోనూ సహాయం చేస్తాడు.
  • మంచి కొడుకు తన వృద్ధ తల్లిదండ్రులను ఓల్డ్‌ ఏజ్‌ హోమ్‌లో ఎన్నటికీ చేర్చడు. బదులుగా తన తల్లిదండ్రులను తన వద్దనే ఉంచుకుని ఆదరిస్తాడు.
  • మీరు కూడా మీ తల్లిదండ్రుల దృష్టిలో మంచి కొడుకుగా ఉండటానికి ప్రయత్నిస్తే వారిని వారు ఇష్టపడే ప్రదేశానికి విహారయాత్రకు తీసుకెళ్లండి. లేదా తీర్థయాత్రకు తీసుకెళ్లండి.
  • మంచి కొడుకు తన స్నేహితులు, భార్య, పిల్లలతోనే కాకుండా తన తల్లిదండ్రులతో కూడా నాణ్యమైన సమయాన్ని గడుపుతాడు. మీరు మంచి కొడుకు కావాలనుకుంటే ముందుగా మీ తల్లిదండ్రులతో కాస్త సమయాన్ని గడపండి. వారి ఇష్టాయిష్టాలను జాగ్రత్తగా
  • తెలుసుకుని అందుకనుకూలంగా ప్రవర్తించండి.
  • మంచి కొడుకు అందరితో మర్యాదగా ప్రవర్తిస్తాడు. తల్లిదండ్రులను గౌరవిస్తాడు. వారి భావాలను, అభిప్రాయాలను గౌరవిస్తాడు. కుటుంబం పట్ల బాధ్యత తీసుకుంటాడు.

ఈ లక్షణాలన్నీ మీలో ఉంటే మీరు ఖచ్చితంగా మంచి కొడుకులే.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్‌స్టైల్ కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.