Makeup Tips: యంగ్ గా కనిపించాలనుకుంటున్నారా.. ఈ మేకప్ టిప్స్ మీకోసమే!

అందంగా ఉండాలని చాలా మంది మేకప్ వేసుకుంటూ ఉంటారు. అయితే కొంత మందికి ఈ మేకప్ సూట్ అవుతుంది. మరికొందరికి సూట్ కాదు. కానీ కరెక్ట్ గా మేకప్ వేసుకుంటే.. మంచి యంగ్ లుకింగ్ తో కనిపిస్తారు. అప్పుడే మీరు వేసుకునే మేకప్ కి ఓ అర్థం ఉంటుంది. కానీ మేకప్ గురించి అన్నీ తెలిసి ఉండాలి. ఎలాంటి స్ట్రోక్ ఇస్తే.. ఎలాంటి లుక్ వస్తుందో ముందుగానే ఊహించాలి. మీరు మేకప్ లో సరిగ్గా కనిపించడం లేదంటే.. మేకప్ వేసుకోవడంలో పొరపాట్లు చేసి ఉంటారని..

Makeup Tips: యంగ్ గా కనిపించాలనుకుంటున్నారా.. ఈ మేకప్ టిప్స్ మీకోసమే!
Makeup Tips

Edited By:

Updated on: Dec 28, 2023 | 9:23 PM

అందంగా ఉండాలని చాలా మంది మేకప్ వేసుకుంటూ ఉంటారు. అయితే కొంత మందికి ఈ మేకప్ సూట్ అవుతుంది. మరికొందరికి సూట్ కాదు. కానీ కరెక్ట్ గా మేకప్ వేసుకుంటే.. మంచి యంగ్ లుకింగ్ తో కనిపిస్తారు. అప్పుడే మీరు వేసుకునే మేకప్ కి ఓ అర్థం ఉంటుంది. కానీ మేకప్ గురించి అన్నీ తెలిసి ఉండాలి. ఎలాంటి స్ట్రోక్ ఇస్తే.. ఎలాంటి లుక్ వస్తుందో ముందుగానే ఊహించాలి. మీరు మేకప్ లో సరిగ్గా కనిపించడం లేదంటే.. మేకప్ వేసుకోవడంలో పొరపాట్లు చేసి ఉంటారని గుర్తించు కోవాలి. అయితే మేకప్ వేసుకునేటప్పుడు కొన్ని రకాల ట్రిక్స్ ఫాలో అయితే మీరు యంగ్ లుక్ లో కనిపిస్తారు. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం.

హైడ్రేట్ గా ఉంచాలి:

మీరు మేకప్ వేసుకునే ముందు మీ చర్మాన్ని హైడ్రేట్ చేయాలి. అంటే.. మేకప్ వేసుకునే ముందు మీ ముఖానికి మాయిశ్చరైజ్ అప్లై చేయాలి. ఇది మీ స్కిన్ హైడ్రేట్ ఉంచుతుంది. దీంతో మేకప్ లుక్ చాలా బావుంటుంది.

మచ్చలను కవర్ చేసుకోవాలి:

చాలా మంది నేరుగా మేకప్ వేసేసుకుంటారు. అలా కాకుండా ముందుగా మీ స్కిన్ పై మచ్చలు ఏమైనా ఉంటే ముందు వాటిని కవర్ చేయాలి. ఆ తర్వాత మేకప్ వేసుకుంటే మంచి లుక్ వస్తుంది. ఈ మచ్చలను కవర్ చేయాలంటే కన్సీలర్ ఉపయోగించవచ్చు. ఈ కన్సీలర్ కూడా చాలా రకాల షేడ్స్ ఉంటాయి. వాటిల్లో మీకు స్కిన్ కి సూట్ అయ్యేది సరి చూసుకోవాలి.

ఇవి కూడా చదవండి

కళ్లను హైలెట్ చేయాలి:

మేకప్ వేసుకునేటప్పుడు ఎక్కువగా అందరూ మిస్ చేసే పాయింట్ ఏంటంటే.. కను బొమ్మలకు షేప్ ఇవ్వరు. కనుబొమ్మకు కూడా మంచి షేప్ ఇవ్వడం వల్ల మీ మేకప్ హైలెట్ అవుతుంది. అలాగే ఐలైనర్ కూడా మస్ట్ గా పెట్టుకోవాలి. దీని వల్ల మీ కళ్లు బాగా కనిపిస్తాయి. ఐలైనర్ పెట్టుకోవడం వల్ల మీ లుక్ అనేది యంగ్ గా, డిఫరెంట్ గా ఉంటుంది.

లిప్ స్టిక్:

మేకప్ వేసుకునేటప్పుడు న్యూడ్ లిప్ స్టిక్ తీసుకుంటే చాలా బెటర్. మీ స్కిన్ టోన్ కి మ్యాచ్ అయ్యే లిప్ స్టిక్ వేసుకోవడం వల్ల మీ ఫేస్ కే మంచి లుక్ వస్తుంది. డార్క్ కలర్ వేసుకోవడం వల్ల.. పెద్ద వారిలా కనిపించ వచ్చు. దీనికి బదులు మీరు క్లియర్ లిప్ గ్లాస్ ని ట్రై చేసినా కూడా బావుంటుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.